ఇకపై నగదు బదిలీ ఉచితం...

డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సెంట్రల్ బ్యాంకు ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ చార్జీలను తొలగించాలని నిర్ణయించింది

ఇకపై నగదు బదిలీ ఉచితం...

బ్యాంకు ఖాతాదారులకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుభవార్త తెలిపింది. రియల్ టైమ్ గ్రోస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్), నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (ఎన్ఈఎఫ్టీ) ద్వారా చేసే నగదు బదిలీలపై విధిస్తున్న రుసుములను తొలగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. గురువారం నిర్వహించిన మోనిటరీ పాలసీ సమావేశంలో (ఎంపీసీ) ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సెంట్రల్ బ్యాంకు ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ చార్జీలను తొలగించాలని నిర్ణయించింది.

ఈ ప్రయోజనాలను బ్యాంకులు తమ ఖాతాదారులకు బదిలీ చేయాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. అలాగే వారంలోగా దీనికి సంబంధించిన సూచనలు అన్ని బ్యాంకులకు జారీ చేస్తామని ఆర్బీఐ తెలిపింది. గతంలో ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్ ద్వారా చేసే లావాదేవీలపై విధించిన రుసుమును ఆర్‌బీఐ బ్యాంకుల నుంచి వసూలు చేసేది. అయితే బ్యాంకులు సదరు రుసుమును తమ ఖాతాదారుల నుంచి వసూలు చేసేవి. ఇప్పుడు ఆర్‌బీఐ ఈ రుసుమును తొలగించడంతో బ్యాంకులు కూడా తమ వినియోగదారుల నుంచి చార్జీలను వసూలు చేయకూడదని ఆర్బీఐ ఆదేశించింది.

ఇటీవల ఆర్టీజీఎస్ లావాదేవీ సమయాన్ని మరో గంటన్నర పాటు పొడిగిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఇది జూన్ 1, 2019 నుంచి అమలులోకి వచ్చింది. గతంలో ఆర్టీజీఎస్ లావాదేవీకి సమయ పరిమితి సాయంత్రం 4:30 వరకు మాత్రమే ఉండేది. ఇప్పుడు దానిని 6:00 గంటల వరకు పొడిగించడం జరిగింది. అలాగే ఇంటర్ బ్యాంకు లావాదేవీలను సాయంత్రం 7:45 వరకు చేసుకోవచ్చు.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly