సరికొత్త బీఎస్ VI బైకును విడుదల చేసిన హోండా..

ప్రస్తుతం ఇంకా మార్కెట్లో బీఎస్ IV సీబీ షైన్‌ బైకులను సంస్థ విక్రయిస్తుంది

సరికొత్త బీఎస్ VI బైకును విడుదల చేసిన హోండా..

హోండా మోటార్‌ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) గురువారం కొత్త బీఎస్ VI బైకు ఎస్పీ 125 ను మార్కెట్ లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 72,900 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతుందని సంస్థ తెలిపింది. ఈ కొత్త బైకు, సంస్థకు చెందిన 125 సీసీ మోడల్ సీబీ షైన్ ఎస్పీని భర్తీ చేస్తుంది. ప్రస్తుతం ఇంకా మార్కెట్లో బీఎస్ IV సీబీ షైన్‌ బైకులను సంస్థ విక్రయిస్తుంది.

టెక్నాలజీ, స్టైల్, పని తీరు పరంగా ఈ కొత్త మోడల్ 125 సీసీ మోటార్‌ సైకిల్ విభాగంలో దూసుకుపోయే అవకాశం ఉందని హెచ్‌ఎంఎస్‌ఐ ప్రెసిడెంట్, సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ మినోరు కటో తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మోడల్ ధర కంటే కొత్త మోడల్ ధర 11 శాతం ఎక్కువ అని, అలాగే 16 శాతం మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుందని సంస్థ తెలిపింది.

125 సీసీ బైక్ విభాగంలో కంపెనీకి 39 శాతం మార్కెట్ వాటా ఉందని హెచ్‌ఎంఎస్‌ఐ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యాద్విందర్ సింగ్ గులేరియా తెలిపారు. అదే విధంగా ఇప్పటి వరకు కంపెనీ 80 లక్షల 125 సీసీ బైకులను మార్కెట్లో విక్రయించిందని గులేరియా తెలిపారు. సరికొత్త ఎస్పీ 125 ప్రొడక్షన్ ఇప్పటికే ప్రారంభమైందని, ఈ నెల చివరి నాటికి అన్ని డీలర్‌ షిప్‌లలో ఈ బైకు అందుబాటులో ఉంటుందని గులేరియా తెలిపారు.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly