మూడోతరం సూపర్ బైక్ ను లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ..

2009 సంవత్సరంలోనే బీఎండబ్ల్యూ ఈ బైకుకు సంబంధించిన తొలి మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది

మూడోతరం సూపర్ బైక్ ను లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ..

జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ సరికొత్త సూపర్‌ బైక్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. దాని పేరు ఎస్‌ 1000 ఆర్‌ఆర్‌. 2018 సంవత్సరంలో ఇటలీలోని మిలాన్‌లో జరిగిన ఈఐసీఎంఏ మోటార్‌ సైకిల్‌ షోలో సంస్థ దీన్ని ప్రదర్శించింది. దీని ధర రూ.18.50 లక్షలు (ఎక్స్-షో రూమ్) గా సంస్థ నిర్ణయించింది. ఈ మోడల్‌లో వస్తున్న మూడోతరం బైక్‌ ఇది. 2009 సంవత్సరంలోనే బీఎండబ్ల్యూ ఈ బైకుకు సంబంధించిన తొలి మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. తాజాగా విడుదల చేసిన ఈ బైకు మూడవ మోడల్. దీని ముందు మోడల్ తో పోల్చితే ఇందులో అనేక రకాల మార్పులను సంస్థ చేసింది. అదే విధంగా పాత బైకు కంటే దీని బరువు 11 కేజీలు తక్కువ ఉంటుంది.

ఈ స్పోర్ట్ బైక్ ఫీచర్స్ విషయానికి వస్తే… ఈ బైకులో రోడ్‌, రెయిన్‌, డైనమిక్‌ అండ్‌ రేస్‌ అనే మూడు రైడింగ్‌ మోడ్స్‌ ఉంటాయి. వీటితో పాటు అదనంగా మూడు ‘ప్రో’ మోడ్‌లను కూడా కంపెనీ అందిస్తుంది. ఈ బైకులో 998 సీసీ ఇంజిన్‌ ను అమర్చారు. ఇది అత్యధికంగా 204 బీహెచ్‌పీని ఉత్పత్తి చేస్తుంది. 113 ఎన్‌ఎం టార్క్‌ను కలిగి ఉంటుంది. ఈ బైకులో మొత్తం 6 గేర్లు ఉంటాయి. ఇందులో 6.5 అంగుళాల టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్‌ కన్సోల్‌, బ్లూటూత్‌ కనెక్టివిటీ సదుపాయాలు ఉన్నాయి. లాంచ్‌ కంట్రోల్‌, వేగాన్ని నియంత్రించేందుకు ఉపయోగించే పిట్‌లేన్‌ స్పీడ్‌ లిమిటర్‌ వంటి ఫీచర్లను సంస్థ ఈ బైకులో అందిస్తుంది. ఈ బైకు సుజుకీ జీఎస్‌ఎక్స్‌ ఆర్‌ 1000, డుకాటీ పనిగలే వీ4, కవాసాకీ జడ్‌ఎక్స్‌-10ఆర్‌ఆర్‌ వంటి సూపర్‌ బైక్‌లకు గట్టి పోటీ ఇస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly