కొత్త‌కారా.. పాత కారా.. కొనుగోలు దారులు ఎటువైపు?

ఆర్గ‌నైజ్డ్ సెక్టార్‌లో స‌ర్టిఫై చేసిన కారును కొనుగోలు చేసేందుకు వీలుంటుంది. అంతేకాకుండా రుణం కూడా సుల‌భంగా ల‌భిస్తుంది.

కొత్త‌కారా.. పాత కారా.. కొనుగోలు దారులు ఎటువైపు?

గ‌త కొంత కాలంగా కొత్త కార్ల అమ్మ‌కాలు త‌గ్గిపోతున్నాయి. కొత్త కార్ల మార్కెట్‌తో పోలిస్తే, గ‌త ఏడాది నుంచి వినియోగించిన కార్ల మార్కెట్ వృద్ధి కొన‌సాగుతూ వ‌స్తుంది. ఈ కార్ల మార్కెట్ ప్ర‌స్తుతం కొత్త కార్ల మార్కెట్ కంటే పెద్ద‌దిగా ఉంది. మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ వీల్స్ లిమిటెడ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రానికి కొత్త కార్ల అమ్మ‌కాలు 36 ల‌క్ష‌లు కాగా సెకెండ్ హ్యండ్ కార్ల అమ్మ‌కాలు, కొనుగోళ్ళు 40 ల‌క్ష‌లుగా ఉన్నాయి.

కొత్త కార్ల అమ్మ‌కాలు త‌గ్గుముఖం ప‌ట్ట‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. ఎన్నిక‌ల కావ‌డంతో ఆటో రంగ అమ్మ‌కాలు మంద‌గించ‌డం, ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో వినియోగ మాంద్యం ఏర్ప‌డ‌టం వంటివి కార‌ణాలుగా చెప్పుకోవ‌చ్చు. 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రంలో కొత్త కార్ల అమ్మకాలు 2.70 శాతం వృద్ధిచెందాయి. గ‌త నాలుగు సంవ‌త్స‌రాల‌తో పోలిస్తే అతి త‌క్కువ వృద్ధి రేటు న‌మోద‌యిన‌ట్లు తెలుస్తుంది. అంత‌కు ముందు ఏప్రిల్‌తో పోలిస్తే గ‌త‌ ఏప్రిల్ నెల‌లో పాసింజ‌ర్ వాహ‌నాల దేశీయ అమ్మ‌కాలు 17.07 శాతం త‌గ్గాయి.

నిపుణుల ప్ర‌కారం, కొత్త కార్ల అమ్మ‌కాలు త‌గ్గుతున్నాయంటే అర్ధం ఈ డిమాండ్ పాత కార్ల‌కు పెరుగుతుంది. పాత కార్లు అమ్మిన వారు కూడా వాటి స్థానంలో కొత్త‌కార్ల‌కు బ‌దులుగా ఉప‌యోగించిన కార్ల‌నే కొనుగోలు చేసేందుకు మ‌గ్గుచూపుతున్నారు.

పాత కార్ల మార్కెట్ ఎందుకు వృద్ధి చెందుతుంది?

ఇండియా బ్లూబుక్ నివేదిక ప్ర‌కారం, కొనుగోలు దారులు కొత్త కార్ల కంటే వినియోగించిన కార్ల‌కు అధిక ప్రాధాన్య‌త ఇస్తున్నారు. కొనుగోలు దారుల డ‌బ్బుకి మంచి విలువ ల‌భించ‌డ‌మే ఇందుకు కార‌ణం. అభివృద్ధి చెందిన దేశాల‌లో కొత్త కారు, ప్రీఓన్డ్‌ కారు కొనే వారి సంఖ్య 1:3 నిష్ప‌త్తిలో ఉంది. అంటే కార్ల క‌నుగోలు దారులు ప్ర‌తీ న‌లుగురిలో ఒక్క‌రు కొత్త కారు కొనుగోలు చేస్తుంటే మిగిలిన ముగ్గురు పాత కార్లు కొనుగోలు చేస్తున్నారు. ప్రీఓన్డ్ కార్లు కొనుగోలు చేసే వారి సంఖ్య భార‌త‌దేశంలో పెరుగుతుంద‌ని బ‌న్సాల్ అభిప్రాయ‌ప‌డ్డారు.

ఈ సంవ‌త్స‌రం కొత్త కారు కొనుగోలు చేస్తే, కొన్ని మోడ‌ళ్ళలో కారు ధ‌ర మ‌రుస‌టి సంవ‌త్స‌రం 50 శాతం ప‌డిపోతుంది. అందువ‌ల్ల‌ కొనుగోలు దారుల కోణం నుంచి చూస్తే కారు కొనుగోలు చేయాల‌న్న క‌ల నెర‌వేర‌డంతో పాటు త‌క్కువ ధ‌ర‌కే కారు ల‌భిస్తుంది.

అయితే ప్రీ-ఓన్డ్ కారు మార్కెటు ఎక్కువ‌గా స‌ప్లై మీద ఆదార‌ప‌డి ఉంటుంది. డిమాండ్ మీద ఆధార‌ప‌డ‌దు. ఒక ద‌శాబ్ధ కాలం క్రితం ఒక కారు స‌గ‌టున 10 సంత్స‌రాల పాటు ఉప‌యోగించేవారు. కానీ ప్ర‌స్తుతం 3 నుంచి 5 సంవ‌త్స‌రాలు మాత్ర‌మే ఉప‌యోగిస్తున్నారు. చాలా మంది కొత్త కారు కొనుగోలు చేయ‌డం కంటే 3 సంవ‌త్స‌రాలోపు ఉప‌యోగించిన కారును కొనుగోలు చేయ‌డం మంచిద‌ని భావిస్తున్నారు. డిమాండ్ ఎక్కువ‌గా ఉన్నందువ‌ల్ల కారు అమ్మేందుకు కూడా ఇది మంచి స‌మ‌యం.

ఇండియ‌న్ బ్లూబుక్ నివేదిక ప్ర‌కారం, 45 శాతం కొనుగోలు దారులు 4 నుంచి 5 సంవ‌త్స‌రాల పాత కారును కొనుగోలు చేసేందుకు ఆశ‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. అలాగే 46 శాతం అమ్మ‌కం దారులు 6 నుంచి 8 సంవ‌త్స‌రాల పాటు ఉప‌యోగించిన త‌రువాత కారును విక్ర‌యిస్తున్నారు. అందువ‌ల్ల డిమాండ్‌-స‌ప్లైల మ‌ధ్య అస‌మాన‌త ఏర్పుడ‌తుంది. 3 నుంచి 5సంవ‌త్స‌రాల పాత‌దైన కారును విక్ర‌యించేవారిలో చాలా మంది కొత్త లేదా మంచి మోడ‌ల్ కారు కొనుగోలు చేయాల‌నే ఉద్దేశ్యంతో కారును స‌రైన ధ‌ర‌ను విక్ర‌యించ‌డం లేదని బ‌న్సాల్ తెలిపారు.

మంచి ధ‌ర‌కు వాహనాన్ని విక్ర‌యించాల‌నుకునే అమ్మ‌కం దారులు కారు కొనుగోలు చేసిన 4 లేదా 5 ఏళ్ళ త‌రువాత విక్ర‌యించ‌డం ద్వారా మంచి విలువ‌ను పొంద‌చ్చు. మొద‌టి మూడు సంవ‌త్స‌రాల‌లో వాహ‌నం త‌రుగుద‌ల విలువ చాలా ఎక్కువ‌గా ఉంటుంది. కానీ మూడు సంవ‌త్స‌రాల త‌రువాత ఇదే వేగంతో త‌రుగ‌ద‌ల ఉండ‌దు. అదే విధంగా 5 సంవ‌త్స‌రాల దాటిన త‌రువాత కారు త‌రుగుద‌ల ఎక్కువ‌గా ఉంటుంది ఉదాహ‌ర‌ణ‌కి నాలుగు సంవ‌త్స‌రాల పాత‌దైన మీ కారును 2022లో రూ.5 ల‌క్ష‌ల కంటే త‌క్కువ ధ‌ర‌కు విక్ర‌యించ‌డం కంటే 2019లో రూ.5 ల‌క్ష‌ల‌కు విక్ర‌యించ‌డం మంచిది.

సెకెండ్ హ్యాండ్ కారు మార్కెట్లో పెరుగుదల ఉన్నప్పటికీ, ఇది చాలా అసంఘటితంగా ఉంటుంది. ఇండియన్ బ్లూబుక్‌ నివేదిక ప్రకారం, 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రానికి ఈ మార్కెట్లో కేవలం 18 శాతం మాత్రమే ఆర్గ‌నైజడ్ సంస్థ‌లు న‌డిపిస్తున్నాయి. రెండు సంవ‌త్స‌రాల క్రితం ఇది 15 శాతం మాత్ర‌మే ఉండేది.

లావాదేవీల్లో మూడోవంతు , వ్య‌క్తుల మధ్యనే ఉందని నివేదిక ద్వారా తెలుస్తుంది. కారును స‌రైన ధ‌ర‌కు కొనుగోలు చేస్తున్నామా… అనే విష‌యంపై కొనుగోలు దారునికి గానీ, స‌రైన ధ‌ర‌కు విక్ర‌యిస్తున్నామా… అనే దానిపై అమ్మ‌కం దారునికి గానీ స‌రైన అవ‌గాహ‌న లేద‌ని, స్ట్రేట‌జిక్ స‌ల‌హాల సంస్థ అవెంట‌మ్ అడ్వైజ‌ర్స్ వ్య‌వ‌స్థాప‌కుడు, భాగ‌స్వామి అయిన వీ.జీ. రామ‌కృష్ణ‌న్ తెలిపారు. కారును ప‌రిశీలించి ధ‌ర‌ను నిర్ణ‌యించేందుకు కొన్ని సంస్థ‌లు ఉన్నాయ‌న్న విష‌యం కూడా చాలా మందికి తెలియ‌దు. కొంత రుసుముతో ఆరెంజ్‌బుక్‌వేల్యూ.కామ్ వంటి సంస్థ‌లు ఈ సేవ‌ల‌ను అందిస్తున్నాయి.

మ‌ధ్యవర్తులలో మరింత పారదర్శకత ఉంటే, విక్రేత కారు విక్ర‌యించ‌డంలో అధిక ధరను, కొనుగోలుదారుకు త‌క్కువ‌ధ‌ర‌కే కారును పొందవచ్చు. అయితే పార‌ద‌ర్శ‌క‌త క‌లిగిన మ‌ధ్య‌వ‌ర్తిని ఎంపిక చేసుకుంటే కొనుగోలు దారుడు ఒక మంచి కారును కొనుగోలు చేసేందుకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వ‌ర‌కు ఖ‌ర్చు పెట్టాల్సి ఉంటుంది.

ఉప‌యోగించిన కారుకు రుణం

కొత్త కార్ల మార్కెట్‌తో పోలిస్తే, పాత కార్ల మార్కెట్లో అమ్మకాలు ఎక్కువ‌గా జ‌రుగుతున్న‌ప్ప‌టీ, పాత కార్ల‌కు రుణం(ఫైనాన్సింగ్‌) పొంద‌డం క‌ష్టం, 75 శాతం కొత్త‌కార్ల ఫైనాన్షింగ్ పొందుతుంటే, 17 శాతం మాత్ర‌మే వాడిన కార్లుకు ఫైనాన్సింగ్ అందుతుంది.

టాటా క్యాపిట‌ల్ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీస్ లిమిటెడ్‌, మేనేజింగ్ డైరెక్ట‌ర్ కుశాల్ రాయ్‌, ప్ర‌కారం కొత్త కార్ల‌కు ఇచ్చే రుణాల వ‌డ్డీ రేట్ల‌తో పోలిస్తే, పాత కార్ల‌కు ఇచ్చే రుణాల వ‌డ్డీ రేట్లు అధికంగా ఉంటాయి. కొత్త కారు కంటే దాదాపు 2 నుంచి 5 శాతం వ‌డ్డీ రేటు ఎక్కువ‌గా ఉంటుంది. ఇది వినియోగ‌దారుని రిస్క్ ప్రొఫైల్‌, వాహ‌న కొనుగోలు విలువ‌పై ఆధార‌ప‌డి ఉంటుంది.

ప్రీ-ఓన్డ్ కార్ల‌కు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు అంత‌గా ఆస‌క్తి చూప‌వు. జీవితంలో మొట్ట‌మొద‌టి సారి సెకెండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేసేవారికి, క్రెడిట్ కార్డు, రుణ చ‌రిత్ర లేక‌పోతే వారి క్రెడిట్ ప్రొఫైల్‌ను అంచనా వేయ‌డం బ్యాంకుల‌కు క‌ష్టం. రుణాలు మంజూరు చేయ‌డంలో బ్యాంకులు ఎదుర్కొనే మ‌రొక స‌మ‌స్య కారు విలువ‌ను అంచ‌నా వేయడం. కొత్త‌కార్ల‌కు ఉన్న నాణ్య‌త ప్ర‌మాణాలు పాత కార్ల‌కు ఉండ‌వు. ఉదాహ‌ర‌ణ‌కు, కారు మోడ‌లు, వ‌య‌సు, డ్రైవింగ్ చ‌రిత్ర‌, రంగు, తిరిగిన సిటి వంటి వాటి ఆధారంగా ప్రతీ కారుకు ధ‌ర నిర్ణ‌యిస్తారు. ఆర్గ‌నైజ్డ్ సెక్టార్‌లో కారు ధ‌ర‌ల‌ను ఈ అంశాల ప్రాతిప‌దిక‌న నిర్ణ‌యిస్తారు. కావున న‌ష్ట‌భ‌యం ఉండ‌దు.

నాన్‌-బ్యాంకింగ్ కంపెనీలు ప్రాసెస్‌ను స‌మ‌ర్థ‌వంతంగా చేసేందుకు స‌మాచార విశ్లేష‌కులు, కృత్రిమ మేధ‌స్సుల‌ స‌హాయం తీసుకుంటున్నాయి. ఆటో మొబైల్ రంగంలోని కొంద‌రు ఆర్థిక సంస్థ‌లతో ఒప్పందం కుదుర్చుకుని వినియోగ‌దారుల‌కు, సుల‌భంగా రుణాల‌ను అందజేస్తున్నారు. కారు రుణాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే ప్ర‌క్రియ కొత్త‌, పాత కార్ల‌కు ఒకే విధంగా ఉంటుంది. చిన్న చిన్న తేడాలు మాత్ర‌మే ఉంటాయి. ఒక‌వేళ మీరు రుణం తీసుకుని సెకెండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేయాల‌నుకుంటే ఆర్గ‌నైజ్డ్ సెక్టార్ సంప్ర‌దించ‌డం మంచిది.
మీరు కొనుగోలు దారుడైతే ఆన్‌లైన్ ద్వారా ముందుగా సెకెండ్ హ్యాండ్‌ కార్ల మార్కెట్‌ను ప‌రిశీలించాలి. ఆర్గ‌నైజ్డ్ మార్కెట్‌ని సంప్ర‌దించ‌డం ద్వారా రెండు ఉప‌యోగాలు ఉన్నాయి. ఒక‌టి వాహ‌న నాణ్య‌త స‌ర్టిఫై చేస్తారు. అంతేకాకుండా కొంత వారంటీ కూడా దొరుకుతుంది. పైగా ఆర్గ‌నైజ్డ్ రంగం ద్వారా రుణం సుల‌భంగా ల‌భిస్తుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly