గేమ్స్ ఆడేవారి కోసం వివో కొత్త స్మార్ట్ ఫోన్..

ఈ ఫోన్ మొత్తం మూడు వేరియంట్లలో (4 జీబీ/64 జీబీ, 6 జీబీ/64 జీబీ, 6 జీబీ/128 జీబీ) అందుబాటులో ఉండనుంది

గేమ్స్ ఆడేవారి కోసం వివో కొత్త స్మార్ట్ ఫోన్..

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ వివో ‘జడ్1 ప్రో’ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. యూత్‌ టార్గెట్‌ గా ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ ను విడుదల చేసినట్లు తెలుస్తుంది. ఇందులో పంచ్‌ హోల్‌ డిస్‌ప్లే ను అమర్చారు. అలాగే ఇది ట్రిపుల్‌ కెమెరా సెట్ అప్ తో వస్తోంది. అదే విధంగా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్లో అందుబాటులోఉంటుంది. గూగుల్‌ అసిస్టెంన్స్ కోసం ప్రత్యేకంగా ఏఐ బటన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గేమింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ కోసం గేమ్‌ మోడ్‌ 5.0, 4డీ వైబ్రేషన్‌, 3డీ సరౌండ్‌తో పాటు పలు టర్బో ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ మొత్తం మూడు వేరియంట్లలో (4 జీబీ/64 జీబీ, 6 జీబీ/64 జీబీ, 6 జీబీ/128 జీబీ) అందుబాటులో ఉండనుంది. ఇక ధర విషయానికి వస్తే, 4 జీబీ/64 జీబీ వేరియంట్‌ ధర రూ. 14,990 కాగా, 6 జీబీ/64 జీబీ వేరియంట్‌ ధర రూ. 16,990, అలాగే 6 జీబీ/128 జీబీ వేరియంట్‌ ధర రూ. 17,999 గా సంస్థ నిర్ణయించింది. ఇది మిర్రర్‌ బ్లాక్‌, సోనిక్‌ బ్లాక్‌, సోనిక్‌ బ్లూ రంగుల్లో లభిస్తుంది. జులై 11 నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్‌కార్ట్‌, వివో ఈ-స్టోర్‌లో విక్రయించనున్నారు. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌/ డెబిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారికి అదనంగా రూ. 750 డిస్కౌంట్‌ ను అందిస్తున్నారు. దానితో పాటు రిలయన్స్‌ జియో ఆఫర్‌ ను కూడా సంస్థ అందిస్తుంది.

వివో జడ్1 ప్రో స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ను ఒకసారి పరిశీలిస్తే…

  • ఆండ్రాయిడ్‌ 9. 0 పై ఆపరేటింగ్ సిస్టం
  • 6.53 ఇంచ్ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ పంచ్‌ హోల్‌ డిస్‌ప్లే
  • స్నాప్‌డ్రాగన్‌ 712 ప్రాసెసర్‌
  • 4 జీబీ/ 6 జీబీ ర్యామ్, 64 జీబీ/ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • వెనుకవైపు 16+8+2 ఎంపీ ట్రిపుల్‌ కెమెరా సెట్ అప్
  • ముందు వైపు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • ఫింగర్ ప్రింట్ స్కానర్
  • 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌
  • 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly