గ్రాట్యూటీ రూల్స్ తెలుసా?

ఎన్‌పిఎస్ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి

గ్రాట్యూటీ రూల్స్ తెలుసా?

ప‌ద‌వీవిర‌మ‌ణ స‌మ‌యంలో అందించే గ్రాట్యూటీ నిబంధ‌న‌ల‌పై ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌త‌నిచ్చింది. గ్రాట్యూటీని రెండు కేంద్ర‌, రాష్ర్ట ప్ర‌భుత్వాలు పంచుకోకూడ‌దు, అదేవిధంగా కేంద్ర ప్ర‌భుత్వంలోని రెండు విభాగాలు పంచుకోకూడ‌ద‌ని తాజాగా జారీచేసిన స‌ర్క్కులార్‌లో పేర్కొంది.

కొత్త 5 గ్రాట్యుటీ నిబంధ‌న‌లు
1.కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు మొద‌ట ఒక విభాగంలో ప‌నిచేసి త‌ర్వాత వేరే విభాగానికి మారిన‌ప్పుడు, మొద‌ట ప‌నిచేసిన సంస్థ‌నే గ్రాట్యుటీని మంజూరు చేయాలి. ఉద్యోగి ప‌నిచేసిన‌ కేంద్ర ప్ర‌భుత్వ రెండు విభాగాలు గ్రాట్యుటీని పంచుకోకూడ‌దు.

2.అదేవిధంగా కేంద్ర ప్ర‌భుత్వంలో ప‌నిచేసి, రాష్ర్ట ప్ర‌భుత్వానికి మారిన‌ప్పుడు…గ్రాట్యుటీ బాధ్య‌త‌ను కేంద్ర, రాష్ర్ట ప్ర‌భుత్వాల భాగ‌స్వామ్యం ఉండ‌కూడ‌దు. మొద‌ట కేంద్రంలో ప‌నిచేసిన ప‌ద‌వీవిర‌మ‌ణ‌ ఎన్‌పీఎస్ క‌లిగిన ఉద్యోగి బాధ్య‌త కేంద్ర ప్ర‌భుత్వానికి వ‌ర్తిస్తుంది.

3.కేంద్ర ప్రభుత్వ సేవ నుంచి పదవీవిర‌మ‌ణ‌ ఎన్‌పిఎస్, డెత్ గ్రాట్యుటీ కలిగి ఉన్న కేంద్ర లేదా రాష్ట్ర స్వయంప్రతిపతి సంస్థల‌కు మారిన‌ప్పుడు కేంద్ర ప్రభుత్వంలో చేసిన సేవల‌కు గ్రాట్యుటీ మంజూరు అవుతుంది. దీనిని కేంద్ర ప్ర‌భుత్వం కేంద్ర / రాష్ట్ర స్వయంప్రతిపత్తి సంస్థకు చెల్లిస్తుంది.

4.కేంద్ర ప్రభుత్వ సేవ నుంచి రిటైర్‌మెంట్ ఎన్‌పీఎస్‌, డెత్ గ్రాట్యుటీ లేని కేంద్ర లేదా రాష్ట్ర స్వయంప్రతిపతి సంస్థకు మారిన‌ప్పుడు గ్రాట్యుటీ భాద్య‌త‌ను కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది.

5.కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థల్లో మరో నియామకం చేపట్టడానికి రాజీనామా చేసే ఎన్‌పిఎస్ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly