కొత్త రీఛార్జ్ ప్లాన్ ను ప్రవేశపెట్టిన జియో..

సవరించిన ప్లాన్ 24 రోజుల వ్యాలిడిటీ, 36 జీబీ డేటాను అందిస్తుంది

కొత్త రీఛార్జ్ ప్లాన్ ను ప్రవేశపెట్టిన జియో..

దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన రూ. 149 రీఛార్జ్ ప్లాన్‌ కు సంబంధించిన వ్యాలిడిటీ, డేటా ఆఫర్‌ను పునరుద్ధరించింది. కొత్తగా పునరుద్ధరించిన రూ. 149 ప్లాన్‌లో జియో ఉచిత ఐయూసీ (జియోయేతర) వాయిస్ కాల్స్‌ను ప్రవేశపెట్టింది.

గతంలో రూ. 149 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల కాలపరిమితి, 42 జీబీ మొబైల్ డేటాతో అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు ఈ ప్లాన్ ను “జియో ఆల్ ఇన్ వన్ ప్లాన్స్” గా మార్చారు. దీంతో సవరించిన ప్లాన్ 24 రోజుల వ్యాలిడిటీ, 36 జీబీ డేటాను అందిస్తుంది.

జియోయేతర నంబర్లకు కాల్ చేయడానికి మీరు రూ. 10 మొదలుకొని రూ. 1000 వరకు టాప్ అప్ వోచర్‌లను కొనుగోలు చేయవచ్చు. దానికి గాను ప్రతి రూ. 10 వోచర్ పై మీరు 1 జీబీ ఉచిత డేటాను పొందుతారు. దానితో పాటు మీరు జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్, ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్ లను కూడా పొందుతారు.

రూ. 149 ప్లాన్ తర్వాత జియో తమ వినియోగదారులకు రూ. 222 రీఛార్జ్ ప్లాన్ ను అందిస్తుంది. ఇది 28 రోజుల వ్యాలిడిటీ, 56 జీబీ డేటాను అందిస్తుంది. అలాగే జియోయేతర నంబర్లకు 1,000 నిమిషాల పాటు ఉచితంగా కాల్స్ చేసుకునే అవకాశాన్ని ఈ ప్లాన్ మీకు అందిస్తుంది.

అంతేకాకుండా, జియో మరో రూ. 198 ప్లాన్‌ను కూడా తమ వినియోగదారులకు అందిస్తుంది. ఇది 56 జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది.

జియో ఆల్ ఇన్ వన్ ప్లాన్స్ :

సవరించిన రూ. 149 ప్లాన్‌తో పాటు జియో రూ. 222, రూ. 333, రూ. 444, రూ. 555 రీఛార్జ్ ప్లాన్‌లను కూడా అందిస్తుంది. ఇవన్నీ జియో నుంచి జియోకు అపరిమిత కాల్స్‌ ను అందిస్తున్నాయి.

జియోయేతర నంబర్లకు వాయిస్ కాల్స్ చేయడానికి వినియోగదారుల నుంచి జియో నిమిషానికి 6 పైసల చొప్పున వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్న తరువాత, కొత్త ఆల్ ఇన్ వన్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది, ఈ ప్లాన్స్ ద్వారా మీరు నిర్ణీత సంఖ్యలో జియోయేతర కాల్స్ ను ఉచితంగా పొందుతారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly