క్రిప్టో క‌రెన్సీల లావాదేవీల‌కు కొత్త ప‌ద్ధ‌తి

క్రిప్టోక‌రెన్సీ లావాదేవీలు రూపాయిల్లో చేసేందుకు పీటూపీ వేదిక‌ను అందుబాటులోకి తెచ్చారు

క్రిప్టో క‌రెన్సీల లావాదేవీల‌కు కొత్త ప‌ద్ధ‌తి

జులై 6 నుంచి మ‌న దేశంలో బ్యాంకుల‌న్ని క్రిప్టోక‌రెన్సీల లావాదేవీల‌ను నిలిపివేశాయి. పూర్తిగా ఈ లావాదేవీల‌ను నిలిపివేసేందుకు బ్యాంకుల‌కు ఆర్‌బీఐ ఇచ్చిన మూడు నెల‌ల గ‌డువు ముగిసింది. ఆర్‌బీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం క్రిప్టో క‌రెన్సీల‌ను నిర్వ‌హించే ఎక్స్చేంజీలు దేశంలో బ్యాంకుల‌తో లావాదేవీలు చేయ‌డం కుద‌ర‌దు. అయితే ప్ర‌స్తుతం రెండు క్రిప్టో ఎక్స్ఛేంజీలు వాజిర్ఎక్స్, కాయినెక్స్ ఎక్స్ఛేంజీలు లావాదేవీలు రూపాయి మార‌కంలో చేసేందుకు అవ‌కాశం క‌ల్పిస్తున్నాయి.

ఆర్‌బీఐ క్రిప్టో లావాదేవీల‌ను బ్యాంకు ద్వారా చేయ‌డంపై నిషేధం విధించిన త‌రువాత చాలా మంది క్రిప్టోక‌రెన్సీ ట్రేడ‌ర్లు,మ‌దుప‌ర్లు త‌మ పెట్టుబ‌డుల‌ను విక్ర‌యించి బ‌య‌టొకొచ్చారు. ఈ నేప‌థ్యంలో మ‌న దేశంలో క్రిప్టోక‌రెన్సీల ట్రేడింగ్ ప‌రిమాణం త‌గ్గిపోయింది. త‌మ వ‌ద్ద ఉన్న క్రిప్టోల‌ను విక్ర‌యించ‌డం ద్వారా కొంత మంది ట్రేడ‌ర్లు స్వ‌ల్ప‌కాలిక‌రాబ‌డి పొందారు. కొంద‌రు మ‌దుప‌ర్లు వీటిపై న‌మ్మ‌కం ఉంచి దీర్ఘ‌కాలం కొన‌సాగే ఉద్దేశంతో వాటిని కొన‌సాగించారు.

పీ2పీ విధానంలో:

సాధార‌ణంగా క్రిప్టోఎక్స్ఛేంజీ ద్వారా లావాదేవీలు చేసేవారు న‌గ‌దును ఎక్స్ఛేంజీకి చెల్లించి క‌రెన్సీని పొందేవారు. ఈ పీటూపీ విధానంలో ఒక‌ వ్య‌క్తి ద‌గ్గ‌ర నుంచి మ‌రొక వ్య‌క్తి కొనుగోలు చేయ‌వ‌చ్చని వాజిర్ ఎక్స్ సీఈఓ నిశ్చ‌ల్ శెట్టి అన్నారు.

రెండు పార్టీల‌ (కొనుగోలుదార్లు, అమ్మ‌కందార్లు ) మ‌ధ్య జ‌రిగే లావాదేవీలు. వీటికి క్రిప్టో ఎక్స్ఛేంజీలు త‌గిన స‌హ‌కారం అందిస్తాయి. ఈ విధానంలో క్రిప్టోక‌రెన్సీ విక్ర‌యించాల‌నుకున్న వ్య‌క్తి ఆ స‌మాచారాన్ని ఎక్స్ఛేంజీకి తెలియ‌చేస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు వారికి అందిస్తారు. క్రిప్టో క‌రెన్సీ కొనుగోలు చేయాల‌నుకునే వారు ఎక్స్ఛేంజీకి స‌మాచారం అందింస్తారు. వీరు కూడా త‌మ పూర్తి వివ‌రాల‌ను అందింస్తారు. ఈ స‌మాచారం ప్ర‌కారం ఎక్స్ఛేంజీ ఇద్ద‌రి మ‌ధ్య లావాదేవీ జ‌రిగేందుకు స‌హ‌కారం అందిస్తుంది. క్రిప్టో క‌రెన్సీలు అధిక న‌ష్ట‌భ‌యం క‌లిగిన‌వ‌ని గుర్తుపెట్టుకోవాలి.

రూపాయిల్లో లావాదేవీలు:

ఈ కొత్త పీటూపీ విధానంలో క్రిప్టోక‌రన్సీలు అమ్మేవారికి న‌గ‌దు నేరుగా రూపాయిల్లో ల‌భిస్తుంది. అదే విధంగా కొనుగోలు చేసేవారు రూపాయిల్లో న‌గ‌దు చెల్లించి కొనుగోలు చేయ‌వ‌చ్చు. న‌గ‌దు చెల్లింపులు ఎన్ఈఎఫ్‌టీ, ఆర్‌టీజీఎస్,యూపీఐ విధానంలో చేయ‌వ‌చ్చు.

స‌మ‌స్య‌లు త‌లెత్తితే:

పీ2పీ విధానంలో లావాదేవీలు ఎవ‌రికి వారు అవ‌త‌లి వ్య‌క్తితో లావాదేవీలు చేస్తుంటారు. న‌గ‌దు లావాదేవీలు క‌రెన్సీ కొనుగోలు దారు ఖాతా నుంచి నేరుగా విక్ర‌యదారుని ఖాతాలోకి జ‌మ‌వుతుంది. ఈ విధానంలో లావాదేవీల‌కు సంబంధించి ఏవైనా స‌మ‌స్య‌లు త‌లెత్తితే త‌మ ఎక్స్సేంజీకి చెందిన బృందం వారి స‌మ‌స్యల‌ను ప‌రిష్కారిస్తుంద‌ని నిశ్చ‌ల్ శెట్టి అన్నారు.

కేవైసీ నిబంధ‌న‌ల ప్ర‌కారం పాన్ త‌దిత‌ర వివ‌రాల‌ను తీసుకుని ఆమోదం పొందిన ఖాతాదారుల నుంచే లావాదేవీలు అనుమ‌తిస్తున్నారు. దీంతో ఎవ‌రైనా లావాదేవీలో డీఫాల్ట్ అయితే వారి వివ‌రాలు ఎక్స్ఛేంజీ ద్వారా తెలుసుకోవ‌చ్చు.

విక్ర‌యించే వారికి ఉప‌యోగ‌మే:

ఇప్ప‌టికీ త‌మ వ‌ద్ద క్రిప్టోల‌ను ఉంచుకున్న మ‌దుప‌ర్లు ఈ పీటూపీ విధానంతో విక్ర‌యించుకోవ‌చ్చు. ఇది విక్ర‌యించే వారికి చాలా ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. ఈ విధానంలో కొనుగోలు చేసే వారు కాస్త జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. ఈ లావాదేవీలు రూపాయిల్లో కాబ‌ట్టి వారు పెట్టుబ‌డులు చేసేముందు చాలా అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. పీటూపీ విధానం ఒక విధంగా అంత మంచి విధానం కాదంటున్ఆరు. ఆషిస్ సింఘాల్ కాయిన్ వాచ్ సీఈఓ. అయితే మ‌న దేశంలో ఉన్న నిబంధ‌న‌ల ప్ర‌కారం పీటూపీ విధానం అమ‌లు చేస్తుండొచ్చు. అయితే ఈ విధానంలో జ‌రిగే లావాదేవీలు గ్రేమార్కెట్ గానే ప‌రిగ‌ణిస్తారు.

పీటూపీ వేదిక ద్వారా లావాదేవీలు జ‌రిపేవారికి రేటింగ్ ఉంటుంది. దీనిద్వారా స‌ద‌రు వ్య‌క్తి గ‌తంలో ఎన్ని ట్రేడ్లు విజ‌య‌వంతంగా చేశారు, ట్రేడ్ డీఫాల్టు అయ్యారా త‌దిత‌ర వివ‌రాలు తెలుస్తాయి. కాబ‌ట్టి ఈ రేటింగ్ ఆధారంగా లావాదేవీలు చేసే ముందు అవ‌త‌లి వ్య‌క్తి గురించి తెలుసుకోవ‌చ్చు అని కాయినెక్స్ ఎక్స్ఛేంజీ సీఈఓ రాహుల్ రాజ్ పేర్కొన్నారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly