ఎన్పీఎస్ చందాదారులకు శుభవార్త..
ప్రభుత్వ ప్రకటన ప్రకారం, ప్రతి ఉపసంహరణ పరిమితి వారు చేసిన కాంట్రిబ్యూషన్ లో 25 శాతాన్ని మించకూడదు
జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్) చందాదారులకు శుభవార్త. కొత్త పెన్షన్ స్కీమ్ ఫండ్ నుంచి ముందస్తు ఉపసంహరణకు అనుమతినిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం, ఇప్పుడు ఎన్పీఎస్ కింద సబ్ స్క్రిప్షన్ సమయంలో చందాదారులు మూడు పాక్షిక ఉపసంహరణలు చేసుకోవచ్చు. ప్రభుత్వ ప్రకటన ప్రకారం, ప్రతి ఉపసంహరణ పరిమితి వారు చేసిన కాంట్రిబ్యూషన్ లో 25 శాతాన్ని మించకూడదు, అలాగే యజమాని చేసిన కాంట్రిబ్యూషన్స్ ను మినహాయించాలి. అయితే, టైర్-II ఖాతా చందాదారులకు ఉపసంహరణలపై ఎలాంటి పరిమితి లేదు. ముఖ్యంగా, టైర్-I, టైర్-II ఖాతాలతో ఎన్పీఎస్ లభిస్తుంది. టైర్ 1 అనేది పన్ను విరామాలను అందించే పదవీ విరమణ ఖాతా కాగా, టైర్ II అనేది ఎన్పీఎస్ చందాదారులు ఎప్పుడైనా పెట్టుబడులు పెట్టడానికి అనుమతించే స్వచ్ఛంద ఖాతా. రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా, ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా ఈ సమాచారాన్ని ఇచ్చారు. చందాదారులకు ఆకస్మికంగా డబ్బు అవసరమైన సందర్భంలో, చందాదారులు టైర్ -1 ఖాతా నుంచి పాక్షిక ఉపసంహరణ సౌకర్యం పొందేందుకు కనీస కాల వ్యవధిని 10 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలకు తగ్గించినట్లు ప్రకటనలో తెలిపింది. అలాగే రెండు పాక్షిక ఉపసంహరణల మధ్య ఐదు సంవత్సరాల కనీస కాలవ్యవధిని కూడా ఆగస్టు 10, 2017 నుంచి తొలగించినట్లు ప్రకటనలో పేర్కొంది.
డిసెంబరు 6, 2018న పెన్షన్ ఫండ్ ఎంపికకు సంబంధించిన కింది ప్రతిపాదనలు, అలాగే ఎన్పీఎస్ కింద కేంద్ర ప్రభుత్వ చందాదారులకు పెట్టుబడి నమూనాను ప్రభుత్వం ఆమోదించింది.
ప్రైవేట్ సెక్టార్ పెన్షన్ ఫండ్లతో సహా ఎలాంటి పెన్షన్ ఫండ్లనైనా ఎంచుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వ చందాదారులకు అందించారు. వారికి సంవత్సరానికి ఒకసారి మాత్రమే వారి ఎంపికను మార్చుకునే వీలుంటుంది. అయితే ప్రస్తుత, కొత్త ప్రభుత్వ చందాదారుల కోసం పబ్లిక్ సెక్టార్ పెన్షన్ ఫండ్స్ డిఫాల్ట్ ఎంపికగా అందుబాటులో ఉంటుంది.
ఈ ప్రకటన ప్రకారం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెట్టుబడి ఎంపికల కోసం కింద ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది.
-
తక్కువ రిస్క్ తో స్థిర రాబడులను పొందాలనుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ సెక్యూరిటీలలోని నిధులలో 100 శాతం పెట్టుబడి పెట్టే ఆప్షన్ ను ఇవ్వవచ్చు.
-
అధిక రాబడిని ఆశించే ప్రభుత్వ ఉద్యోగులు ఈ కింది రెండు లైఫ్ సైకిల్ ఆధారిత పథకాల ఎంపికలను ఇవ్వవచ్చు.
-
కన్జర్వేటివ్ లైఫ్ సైకిల్ ఫండ్ - 35 సంవత్సరాల వయస్సులో ఈక్విటీ 25 శాతం, అలాగే డెట్ 75 శాతంగా ఉంటుంది.
-
మోడరేట్ లైఫ్ సైకిల్ ఫండ్ - 35 సంవత్సరాల వయస్సులో ఈక్విటీ 50 శాతం, అలాగే డెట్ 50 శాతంగా ఉంటుంది.
-
ఒకవేళ ఉద్యోగి ఎలాంటి ఎంపికను సమర్పించకపోతే, ప్రస్తుతం ఉన్న నిధుల కేటాయింపు డిఫాల్ట్ ఎంపికగా కొనసాగుతాయి.
Comments
0