బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసిన నోకియా..

సాధారణ ప్రజలకు తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ ను అందించాలనే ఉద్దేశంతో ఈ ఫోన్ ను అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ తెలిపింది

బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసిన నోకియా..

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ నోకియా తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్ లో విడుదల చేసింది. దాని పేరు నోకియా 2.2. ఇది 2జీబీ+16జీబీ, 3జీబీ+32జీబీ వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. నోకియా బ్రాండ్‌పై హెచ్‌ఎండీ గ్లోబల్‌ స్మార్ట్‌ఫోన్‌న్లను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. సాధారణ ప్రజలకు తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ ను అందించాలనే ఉద్దేశంతో ఈ ఫోన్ ను అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ తెలిపింది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే… 2 జీబీ ర్యామ్‌+16 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 6,999 కాగా, 3జీబీ+32జీబీ వేరియంట్‌ ధర రూ. 7,999గా ఉంది. అయితే, ప్రారంభ ఆఫర్ కింద జూన్‌ 30 వరకూ మాత్రమే ఈ ధరలకు నోకియా 2. 2 ను సంస్థ విక్రయించనుంది. జులై 1 నుంచి 2 జీబీ ర్యామ్‌+16 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 7,699 గాను, 3జీబీ+32జీబీ వేరియంట్‌ ధర రూ. 8,699 గా ఉండనున్నట్లు సంస్థ తెలిపింది. అలాగే జియో వినియోగదారులకు రూ. 2,200 విలువైన క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ ను అందించడంతో పాటు, 100 జీబీ డేటాను ఉచితంగా అందించనుంది. ఈ ఆఫర్ రూ. 198, రూ. 299 రీఛార్జ్‌లపై మాత్రమే అందుబాటులో ఉండనుంది.

నోకియా 2. 2 స్పెసిఫికేషన్స్ ను ఒకసారి పరిశీలిస్తే…

• 5.71 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
• మీడియా టెక్‌ హీలియో ఏ22 ప్రాసెసర్‌
• 2జీబీ+16జీబీ, 3జీబీ+32జీబీ వేరియంట్లు
• వెనుకవైపు 13 మెగా పిక్సెల్‌ మెయిన్ కెమెరా
• ముందు వైపు 5 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరా
• ఆండ్రాయిడ్‌ 9.0 ఆపరేటింగ్ సిస్టం
• 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly