ఎన్‌సీడీల్లో మ‌దుపు చేసే ముందు గ‌మ‌నించాల్సిన విష‌యాలు

ఎన్‌సీడీల్లో మ‌దుపు చేసే ముందు ముఖ్యంగా వాటి క్రెడిట్ రేటింగ్ ను మ‌దుప‌ర్లు గ‌మ‌నించాలి. మంచి క్రెడిట్ రేటింగ్ ఉంటే న‌ష్ట‌భ‌యం త‌క్కువ ఉంటుంది.

ఎన్‌సీడీల్లో మ‌దుపు చేసే ముందు గ‌మ‌నించాల్సిన విష‌యాలు

డిబెంచ‌ర్ల‌లో క‌న్వ‌ర్ట‌బుల్, నాన్ క‌న్వ‌ర్ట‌బుల్ డిబెంచ‌ర్లు రెండు ర‌కాలు ఉంటాయి.భ‌విష్య‌త్తులో కంపెనీ ఈక్విటీ రూపంలోకి మార్చే ఆప్ష‌న్ లేని డిబెంచ‌ర్ల‌ను నాన్ క‌న్వ‌ర్ట‌బుల్ డిబెంచ‌ర్లు అంటారు. క‌న్వ‌ర్ట‌బుల్ డిబెంచ‌ర్లు భ‌విష్య‌త్తులో కంపెనీ ఈక్విటీ రూపంలోకి మార్చే ఆప్ష‌న్ ఉంటుంది.

నాన్ క‌న్వ‌ర్ట‌బుల్ డిబెంచ‌ర్లు (ఎన్‌సీడీలు) నిర్ణీత కాలంపాటు వ‌డ్డీ మెచ్యూరిటీ ముగిశాక అస‌లు చెల్లించే స్థిరాదాయ పెట్టుబ‌డి సాధ‌నాలు. కంపెనీలు ఎన్‌సీడీల‌ను జారీచేయ‌డం ద్వారా వాటికి కావాల్సిన నిధుల‌ను స‌మీక‌రిస్తుంటాయి. కంపెనీలు ఎన్‌సీడీల ద్వారా మ‌దుపుచేసిన వారికి ముందుగా నిర్ణ‌యించిన దాని ప్ర‌కారం చెల్లింపులు చేస్తాయి. ఇవి క్లోజ్ ఎండెడ్ ప‌థ‌కాలు, అంటే కంపెనీలు జారీ చేసిన స‌మ‌యంలో మాత్ర‌మే కొనుగోలు చేసేందుకు వీలుంటుంది. రెగ్యులేట‌రీ నిబంధ‌న‌ల్లో మార్పులు చేయ‌డం ద్వారా ఎక్కువ‌గా ఎన్‌సీడీ ఆఫ‌ర్లు జారీ అయ్యాయి. సెబీ నిబంధ‌న‌ల్లో మార్పులు కార‌ణంగా రిటైల్ మ‌దుప‌ర్ల‌కు ఎన్‌సీడీ ఇష్యూల్లో పెట్టుబ‌డి చేసేందుకు అవ‌కాశాలు పెరిగాయి

సాధార‌ణంగా 3, 5, 10 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితుల్లో, వ‌డ్డీ ప‌రిధి 8.66 నుంచి 9.75 శాతం వ‌ర‌కూ స‌ద‌రు ఆఫ‌ర్ జారీ చేసిన కంపెనీ బ‌ట్టి ఉంటుంది. ఈ ఏడాది ఎన్‌సీడీ లు అందిస్తున్న‌ రేటు ఫిక్సిడ్ డిపాజిట్ల కంటే చాలా మెరుగ్గా ఉంది. వీటిలో కూడా నెల‌వానీ, త్రైమాసిక‌, వార్షిక‌, క్యుములేటివ్(ఒకే సారి చివ‌ర‌లో) విధానంలో రాబ‌డి పొందేందుకు అవ‌కాశాలు ఉన్నాయి. ఒక మ‌దుప‌రి నెల‌వారీ రాబ‌డిని కోరుకుంటే వారీ మంత్లీ ఆప్ష‌న్ ఎంచుకోవ‌చ్చు.

వీటిలో మ‌దుపు చేసేముందు గ‌మ‌నించాల్సిన విష‌యాలు

  • భ‌ద్ర‌త‌
  • లిక్విడిటీ
  • రాబ‌డి

పెట్టుబ‌డికి భ‌ద్ర‌త క్రెడిట్ రేటింగ్ ఆధారంగా ఉంటుంది. దీనికి మ‌దుప‌ర్లు ఎన్‌సీడీలు జారీ చేసే కంపెనీ క్రెడిట్ రేటింగ్ ను చూడాలి. టాప్ క్రెడిట్ రేటింగ్ A, AA, AAA వంటివి ఉన్న కంపెనీలు ఉత్త‌మ‌మైన‌వి. కొన్ని సార్లు ఇష్యూల‌కు ఒక‌టి కంటే ఎక్కువ (సాధార‌ణంగా రెండు) రేటింగ్ సంస్థ‌లు క్రెడిట్ రేటింగ్ జారీచేస్తుంటాయి. అప్పుడు రెండింటిని గ‌మ‌నించ‌డం మంచిది.

ఎన్‌సీడీల్లో 12నెల‌ల త‌ర్వాత ఉప‌సంహ‌రిస్తే, వాటిపై వ‌చ్చే ఆదాయాన్ని దీర్ఘ‌కాల‌ మూలధ‌న ఆదాయంగా ప‌రిగ‌ణిస్తారు . దీనిపై 10శాతం ప‌న్ను విధిస్తారు. ఎన్‌సీడీల్లో ఏడాది లోపు (స్వ‌ల్ప‌కాల‌ మూల‌ధ‌న) ఆదాయంపై ప‌న్నును వ్య‌క్తిగ‌త శ్లాబ్‌ల‌ను అనుస‌రించి నిర్ణ‌య‌స్తారు.

అధిక ప‌న్ను స్లాబులో ఉన్న మ‌దుప‌ర్లు స్వ‌ల్ప‌కాలానికి ఎన్‌సీడీల్లో మ‌దుపుచేయ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేదు. ఎన్‌సీడీల్లో ప‌న్ను వ్య‌క్తిగ‌త స్లాబు రేటు వ‌ద్ద‌ ఉంటుంది. 30 శాతం ప‌న్ను ప‌రిధిలో ఉన్న మ‌దుప‌ర్లు త‌మకు ఎన్‌సీడీల ద్వారా వ‌చ్చే ఆదాయంపై ప‌న్ను 30 శాతం చెల్లించాలి. త‌క్కువ‌ ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చే వారికి ఎన్‌సీడీలు అనుకూలంగా ఉంటాయి. వీటిలో లాక్ ఇన్ కాల‌ప‌రిమితి ఉంటుంది. దీర్ఘ‌కాలంపాటు పెట్టుబ‌డిని పెట్టే ఆలోచ‌న ఉండే వారు ఎన్‌సీడీల్లో పెట్టుబ‌డి చేయ‌వ‌చ్చు.

సిరి లో ఇంకా:

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly