ఆరోగ్య బీమా పాలసీ నుంచి తొలగించిన అంశాలు

ఐఆర్డీఏఐ 2016 సంవత్సరంలో 199 నాన్-పేయబుల్ అంశాల జాబితాను తయారుచేసింది

ఆరోగ్య బీమా పాలసీ నుంచి తొలగించిన అంశాలు

ఇన్సూరెన్సు రెగ్యులేటరీ డెవలప్మెంట్ అధారిటీ అఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) ఆగష్టు 27న ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటనలో పది రకాల రోగాలను, వైద్య విధానాలను ఆరోగ్య బీమా పాలసీలోని నాన్-పేయబుల్ అంశాల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు తెలిపింది. వీటిలో ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేని దంత చికిత్సలు, హార్మోన్ రీప్లేస్మెంట్ చికిత్స, ఇన్ఫెర్టిలిటీ చికిత్స, ఊభకాయం, హెచ్ఐవీ లేదా ఎయిడ్స్, కాస్మొటిక్ శస్త్రచికిత్స, స్టెమ్ సెల్ ఇంప్లాంటేషన్ వంటివి ఉన్నాయి. ఐఆర్డీఏఐ 2016 సంవత్సరంలో 199 నాన్-పేయబుల్ అంశాల జాబితాను తయారుచేసింది. ఈ అంశాలను చేర్చుకునే లేదా మినహాయించుకునే ఫ్లెక్సిబిలిటిని బీమా సంస్థలకు ఇచ్చాయి. వినియోగవస్తువులు, వైద్యేతర అంశాలపై మాత్రమే దృష్టి పెట్టడానికి, ఐఆర్డీఏఐ వైద్య విధానాలను, వ్యాధులను ఈ జాబితా నుంచి తొలగించింది. ఐఆర్‌డీఏఐ జాబితా నుంచి తొల‌గించినప్ప‌టికీ బీమా సంస్థ‌లు త‌ప్ప‌నిస‌రిగా వీటిపై క‌వ‌రేజ్ అందించాల‌నే నిబంధ‌న‌ ఏమి లేదు. కాని నాన్-పేయబుల్ వస్తువుల జాబితా ప్రధానంగా వినియోగ వస్తువులు, ఇతర వైద్యేతర అంశాలను కలిగి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ జాబితాలో వైద్య ప్రక్రియలు, రోగాలు కూడా ఉన్నాయి. అందువలన మేము వీటిని ఆ జాబితా నుంచి తొలగించామని ఐఆర్డీఏఐ అధికారి ఒకరు తెలిపారు. చట్టం నిబంధనల ప్రకారం, ఈ విధానాలను మినహాయించడం లేదా చేర్చే విషయంలో బీమా సంస్థలు ఇప్పటికీ స్వేచ్ఛను కలిగి ఉంటాయని అధికారి తెలిపారు. అందువలన ఆరోగ్య పధకంలోని నాన్-పేయబుల్ అంశాల జాబితాను అర్థం చేసుకోవడం మంచిది.

నాన్-పేయబుల్ అంశాలు:

ఆరోగ్య బీమా పాలసీ నుంచి మినహాయించిన 199 అంశాలను ప్రామాణిక జాబితా కలిగి ఉంది. వాస్తవానికి, బీమా సంస్థలు జాబితాలోని కొన్ని అంశాలను చేర్చే స్వేచ్ఛను కలిగి ఉంటాయి, కానీ వారు మినహాయింపుల జాబితాకు జోడించలేరు. మీ పాలసీ ఈ ఖర్చులను చెల్లించదు. ఈ జాబితాలోని అంశాలు గది చార్జీలు, పరిపాలనా ఛార్జీలకు సంబంధించిన అంశాలైన టాయిలెట్, కాస్మొటిక్స్, వ్యక్తిగత సౌకర్యం లేదా సౌలభ్యంతో సహా వినియోగించే వస్తువులు, వైద్యేతర వస్తువులను కలిగి ఉంటాయి.

ఉదాహరణకు టెలిఫోన్ చార్జీలు, లాండ్రీ, ఇంటర్నెట్ చార్జీలను ఆరోగ్య పాలసీ కింద చెల్లించరు. కళ్లద్దాలు, కాంటాక్ట్ లెన్స్, వినికిడి సాధనాలు, వివిధ రకాల బ్యాండేజ్ లు వంటి వైద్య వస్తువులు కూడా పాలసీ కింద కవర్ అవ్వవు. అలాగే ఆసుపత్రి గదికి సంబంధించిన ఖర్చులైన టెలివిజన్, ఎయిర్ కండీషనర్, హౌస్ కీపింగ్, అటెండర్ కు అయ్యే ఖర్చులను గది ఖర్చుల కింద కలపకుండా, ప్రత్యేకంగా నమోదు చేసినట్లయితే, వాటిని కూడా పాలసీ కింద కవర్ అవ్వవు.

అడ్మిషన్ కిట్లు, డిచ్ఛార్జ్ విధానం, ప్రవేశ పాస్లు లేదా సందర్శకుల పాస్లు వంటి నిర్వహణ ఖర్చులు, రోగి గుర్తింపు బ్యాండ్లు లేదా పేరు ట్యాగ్లను పాలసీ కింద చెల్లించరు. దీంతో పాలసీ కింద కవర్ అవ్వని వాటి కోసం మీరు చెల్లించాల్సిన మొత్తం ఆసుపత్రి బిల్లులో 10 శాతం వరకు ఉంటాయి. అందువలన ఏవి చెల్లింపుల కిందకు రావో తెలుసుకోవడం ముఖ్యం.

చాలా ఆరోగ్య బీమా పాలసీలు ఈ వైద్య పరిస్థితులను, విధానాలను మినహాయిస్తాయి, అందువలన మీరు పాలసీలో కవర్ చేయని రోగాలను, పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఆరోగ్య బీమా పాలసీ పత్రాలను పరిశీలించడం అవసరం.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly