ఇకపై మరింత సులభంగా బీమా పాలసీని కొనుగోలు చేయవచ్చు...

ఫోటో, ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్ వంటి పత్రాలను ఆధార్‌తో భర్తీ చేయడానికి బీమా సంస్థలను ఈకేవైసీ ఆప్షన్ అనుమతిస్తుంది

ఇకపై మరింత సులభంగా బీమా పాలసీని కొనుగోలు చేయవచ్చు...

బీమా కొనుగోలు ప్రక్రియను సరళీకృతం చేసే ప్రయత్నంలో భాగంగా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) కేవైసీ నిబంధనలను నెరవేర్చడానికి యూనీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఆధార్ ఆధారిత ప్రామాణికరణలను పొందటానికి బీమా కంపెనీలను అనుమతించింది. అయితే, రాబోయే రోజుల్లో ఈకేవైసీని చేపట్టే సంస్థల జాబితాను రెగ్యులేటర్ సూచించింది. దానికి సంబంధించిన పూర్తి జాబితాను కింద చూడండి.

ఫోటో, ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్ వంటి పత్రాలను ఆధార్‌తో భర్తీ చేయడానికి బీమా సంస్థలను ఈకేవైసీ ఆప్షన్ అనుమతిస్తుంది. అయినప్పటికీ, ఇన్కమ్ ప్రూఫ్, మెడికల్ స్టేట్మెంట్ (అవసరమైతే) లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. గత ఏడాది జనవరిలో, ధృవీకరణ కోసం ఈకేవైసీని ఉపయోగించకుండా ఉండమని ఐఆర్డీఏఐ బీమా సంస్థలను కోరింది, ఒకవేళ ఆధార్ ను ఐడెంటిటీ ప్రూఫ్ గా సమర్పించిన సందర్భాల్లో, ఆధార్ నెంబర్ ను ఎలాంటి రూపంలోనైనా (భౌతిక లేదా డిజిటల్) సేవ్ చేయకూడదని బీమా సంస్థలకు తెలిపింది. దీన్ని ఇప్పుడు రెగ్యులేటర్ రద్దు చేసింది.

ఈ చర్య ఖచ్చితంగా కొనుగోలు ప్రక్రియను సులభతరం చేస్తుంది, ముఖ్యంగా కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుండడంతో కంపెనీలు, ప్రజలు ఆన్‌లైన్ సౌకర్యాలను వినియోగించాల్సి వచ్చింది. ఇకపై ప్రజలు కొనుగోలు చేసే పాలసీలు పూర్తి కేవైసీ ప్రక్రియతో కూడి ఉండవు, అంటే ప్రజలు బీమాను కొనుగోలు చేయడాన్ని వాయిదా వేయరని ఆన్‌లైన్ ఇన్సూరెన్స్ మార్కెట్‌ప్లేస్ పాలసీఎక్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ నావల్ గోయెల్ తెలిపారు.

సిరి లో ఇంకా:

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly