త్వరలో క్రెడిట్ కార్డు రంగంలోకి ఓలా, ఫ్లిప్‌కార్ట్‌...

మొదటి సంవత్సరంలో సంస్థకు చెందిన 15 కోట్ల మంది వినియోగదారులలో కనీసం 10 లక్షల మందికి ఈ క్రెడిట్ కార్డులను జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది

త్వరలో క్రెడిట్ కార్డు రంగంలోకి ఓలా, ఫ్లిప్‌కార్ట్‌...

భారదేశంలో ట్యాక్సీ సేవలను అందించే ఓలా, అలాగే ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ సంస్థలు త్వరలో క్రెడిట్‌ కార్డు రంగంలోకి అడుగుపెట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. దేశంలోనే అతి పెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐ సహకారంతో ఓలా తమ వినియోగదారులకు క్రెడిట్‌ కార్డులను జారీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా, ఫ్లిప్‌కార్ట్‌ మాత్రం యాక్సిస్‌ బ్యాంక్‌ లేదా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల సహకారంతో క్రెడిట్‌ కార్డులను జారీ చేసేందుకు ప్రయత్నిస్తుంది.

ఓలా ఈ ప్రాజెక్టును వచ్చే వారం నుంచి ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. అలాగే మొదటి సంవత్సరంలో సంస్థకు చెందిన 15 కోట్ల మంది వినియోగదారులలో కనీసం 10 లక్షల మందికి ఈ క్రెడిట్ కార్డులను జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. యువత ఎక్కువగా ఈ క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటారని సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తుంది. దీని ద్వారా తమ కార్డు వినియోగదారుల ఖర్చులపై ఒక అంచనాకు రావడంతో పాటు, క్రెడిట్‌ కార్డ్‌ మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ అంచనా వేస్తుంది.

మరోవైపు ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ కూడా యాక్సిస్‌ బ్యాంక్‌ లేదా హెచ్‌డీఎఫ్‌సీ సౌజన్యంతో వినియోగదారులకు క్రెడిట్‌ కార్డులను త్వరలో అందించేందుకు ప్రణాళికలను రచిస్తోంది. గత సంవత్సరం అమెజాన్‌ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్‌ సహకారంతో కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులను అందుబాటులోకి తీసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ రెండు సంస్థలు కూడా అమెజాన్ బాటలోనే పయనించడానికి ప్రయత్నిస్తున్నాయి.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly