జూన్ నుంచి 'వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్'..

అంతకుముందు ఈ సదుపాయాన్ని దేశంలోని 12 రాష్ట్రాల్లో నూతన సంవత్సరం సందర్భంగా ప్రారంభించినట్లు పాస్వాన్ తెలిపారు

జూన్ నుంచి 'వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్'..

రేషన్ కార్డ్ వినియోగదారులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన ‘వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్’ పథకాన్ని జూన్ 1, 2020 నాటికి దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ సోమవారం ప్రకటించారు. "జూన్ 1 నాటికి మొత్తం దేశంలో ‘వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్’ పథకాన్ని అమలు చేస్తాం. ఈ పథకం కింద లబ్ధిదారుడు ఒకే రేషన్ కార్డును ఉపయోగించి దేశవ్యాప్తంగా ప్రయోజనాలను పొందగలుగుతారని పాస్వాన్ తెలిపారు.

అంతకుముందు ఈ సదుపాయాన్ని దేశంలోని 12 రాష్ట్రాల్లో నూతన సంవత్సరం సందర్భంగా ప్రారంభించినట్లు పాస్వాన్ తెలిపారు. ఈ సదుపాయం కింద, ఈ రాష్ట్రాల లబ్ధిదారులు వారు నివసిస్తున్న 12 రాష్ట్రాలలో ఎక్కడైనా రేషన్ ను పొందవచ్చని మంత్రి తెలిపారు. డిసెంబర్ 30, 2020 నాటికి ‘వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్’ వ్యవస్థ తప్పకుండా దేశం మొత్తం అమలులోకి వస్తుందని పాస్వాన్ తెలిపారు.

(source- livemint)

సిరి లో ఇంకా:

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly