అతి త్వరలో వన్ ప్లస్ స్మార్ట్ టీవీ..

సంస్థ సీఈఓ పీట్ లా టీవీల తయారీ రంగంలోకి ప్రవేశించడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే

అతి త్వరలో వన్ ప్లస్ స్మార్ట్ టీవీ..

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ అతి త్వరలో స్మార్ట్ టీవీని మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఎక్కువగా ఉంది. గత ఏడాది సంస్థ సీఈఓ పీట్ లా టీవీల తయారీ రంగంలోకి ప్రవేశించడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మే నెలలో జరిగిన వన్ ప్లస్ 7 ప్రో లాంచ్ కార్యక్రమంలో సంస్థ దీనికి సంభందించిన వార్తను వెలువరిస్తుందని అందరూ భావించారు, కానీ అలాంటిది ఏది జరగలేదు.

అయితే, టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ వన్‌ప్లస్ స్మార్ట్‌టీవీకి సంబంధించి ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో వన్‌ప్లస్ స్మార్ట్‌టీవీ అతి త్వరలో మార్కెట్‌లోకి వస్తుందని, దీనిపై తనకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని అగర్వాల్ తెలిపారు. అలాగే వన్‌ప్లస్ టీవీ ఓఎల్ఈడీ టీవీ కాదని, హెచ్డీఆర్ తో కూడిన 4కే స్మార్ట్‌టీవీ అయ్యి ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

మొదట ఒప్పో సంస్థకు సబ్-బ్రాండ్‌గా ప్రారంభమైన వన్‌ప్లస్, హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లను సరసమైన ధరలకే వినియోగదారులకు అందించింది, అదే విధంగా స్మార్ట్‌టీవీలను కూడా తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి సారించిందని అగర్వాల్ తెలిపారు. ఈ స్మార్ట్ టీవీలో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్‌ను అభివృద్ధి చేయడంతో పాటు, అధిక నాణ్యత గల హార్డ్‌వేర్ ను వినియోగించి ఉండవచ్చునని తెలిపారు.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly