కుటుంబ సభ్యుల పేర్లతో పీపీఎఫ్ ఖాతా తెరవచ్చా?

ఒక ఆర్ధిక సంవత్సరంలో ఎంత మొత్తం వరకు పెట్టుబడి పెట్టాలనే దానిపై చాలా మందికి అవగాహన తక్కువగా ఉంటుంది

కుటుంబ సభ్యుల పేర్లతో పీపీఎఫ్ ఖాతా తెరవచ్చా?

ప్రజా భవిష్య నిధి లేదా పీపీఎఫ్ పెట్టుబడులను ఉత్తమ పన్ను ఆదా పథకాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద, పీపీఎఫ్ పెట్టుబడి మొత్తంపై పన్ను మినహాయింపు లభించడంతో పాటు పెట్టుబడి మొత్తంపై సంపాదించిన వడ్డీకి కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. ఏదేమైనప్పటికీ, ఒక వ్యక్తి ఎన్ని పీపీఎఫ్ ఖాతాలను తెరవగలరు? అలాగే ఒక ఆర్ధిక సంవత్సరంలో ఎంత మొత్తం వరకు పెట్టుబడి పెట్టాలనే దానిపై చాలా మందికి అవగాహన తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు రమేష్ అనే వ్యక్తి ఒక సనాతన కుటుంబానికి చెందినవాడు, అతను దైర్యం చేసి ఈక్విటీ పెట్టుబడులలో పెట్టుబడి చేయడం, క్రెడిట్ కార్డు వంటి వాటిని వినియోగించడం చేయడు. వాటికి బదులుగా అతను ప్రభుత్వ మద్దతు ఉండే పీపీఎఫ్ ఖాతాలను తెరిచాడు, ఈ ఖాతాలు అతనికి, అతని భార్యకి, కుమార్తె కి చాలా సురక్షితమైనవిగా భావించి ప్రతి సంవత్సరం ఒక్కొక్కరి ఖాతాలో రూ. 1,50,000 డిపాజిట్ చేశాడు. పీపీఎఫ్ ఖాతాల సంఖ్య, పెట్టుబడుల పరిమితులు గురించి ప్రైవేట్ బ్యాంకు ప్రతినిధి నుంచి సమాచారం అందుకుని రమేష్ ఖాతాలను ప్రారంభించాడు.

ఒక్కోసారి పెట్టుబడిదారులను బ్యాంకు ప్రతినిధులు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయవచ్చు, అందువలన ఖాతాలను తెరిచే ముందు పెట్టుబడిదారులు ప్రజా భవిష్య నిధికి సంబంధించిన నియమాలను తెలుసుకోవడం మంచిది. పీపీఎఫ్ ఖాతాలపై ప్రభుత్వం కొన్ని నిబంధనలను విధించింది. ఎందుకంటే, పెట్టుబడిదారులు సార్వభౌమాధికార హామీ మొత్తాన్ని పొందడమే కాకుండా అధిక వడ్డీ రేట్లతో పాటు, ఆదాయ పన్ను సెక్షన్ 80సీ కింద పన్ను తగ్గింపు ప్రయోజనాలను కూడా పొందుతారు. అలాగే మెచ్యూరిటీ మొత్తంపై కూడా పన్ను వర్తించదు.

ముందుగా, భార్యాభర్తలు ఇద్దరూ సొంత ఆదాయ వనరులను కలిగి ఉన్నట్లయితే వారి పేరుతో పీపీఎఫ్ ఖాతాలను తెరవవచ్చు. కావున ఉద్యోగం చేస్తున్న భర్త తన భార్య పేరుతో పీపీఎఫ్ ఖాతాను తెరవలేడు. అయితే, అతను తన పిల్లల పేరుతో ఖాతాను తెరవవచ్చు, కానీ ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం పెట్టుబడులు రూ. 1,50,000 లను మించకూడదు, ఇది సెక్షన్ 80 సీ పరిమితికి సమానం. ఒకవేళ మహిళ ఉద్యోగం చేస్తున్నట్లైతే, ఆమె తన పేరుతో అలాగే తన పిల్లల పేరుతో పీపీఎఫ్ ఖాతాలను తెరవవచ్చు, కానీ ఆమె భర్త పేరుతో మాత్రం ఖాతాను తెరవడానికి కుదరదు.

అందువలన, పాన్ కార్డు కలిగిన ఖాతాదారుడు తన పేరుతొ ఒక బ్యాంకులో లేదా వివిధ బ్యాంకులలో లేదా పోస్ట్ ఆఫీస్ లలో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను తెరవలేరు. ఒక వ్యక్తి తన మైనర్ పిల్లల కోసం పీపీఎఫ్ ఖాతాలను తెరవచ్చు, కానీ ఒక పాన్ పై పీపీఎఫ్ లో మొత్తం పెట్టుబడులు ఒక ఆర్ధిక సంవత్సరంలో రూ. 1,50,000 మించకూడదు. పాన్ మార్గదర్శకాల ప్రకారం, పాన్ కార్డు ఖాతాదారుడు రూ. 1,50,000 కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టినట్లయితే, ఖాతాదారులు అదనపు పెట్టుబడులపై వడ్డీని పొందరు, కానీ ఎప్పుడైనా పూర్తి మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly