స్వల్ప నష్టాలతో ప్రారంభమయిన మార్కెట్లు

సెన్సెక్స్ 40 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 10,925 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

స్వల్ప నష్టాలతో ప్రారంభమయిన మార్కెట్లు

దేశీయ మార్కెట్లు నేడు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 40 పాయింట్లు నష్టపోయి 36,936 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 22 పాయింట్లు కోల్పోయి 10,925 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మెటల్ మినహా ఇతర రంగాల సూచీలు స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి . డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 15 పైసలు బలహీనపడి 70.96 వద్ద కొనసాగుతుంది.

వడ్డీ రేట్ల తగ్గింపుపై భారీ ఆశలు నెలకొనడం, రిజ్వరు బ్యాంక్‌ వరసగా నాలుగోసారి కూడా 25 బేస్‌ పాయింట్ల మేరకు వడ్డీరేట్ల తగ్గింపును ప్రకటించవచ్చనే ప్రచారం జరగడంతో నిన్న లాభాలతో ముగిసిన మార్కెట్లు నేడు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్లు బుధవారం నష్టాలతో ట్రేడవుతున్నాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌, టైటాన్‌, టాటా స్టీల్‌, వేదాంత, కోల్‌ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎన్టీపీసీ తదితర కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. నేడు నిఫ్టీలో జీఎంటెర్టైన్మెంట్, యస్ బ్యాంక్, విప్రో, హీరో మోటో కార్ప్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభపడుతుండగా, ఇండియాబుల్స్ హౌసింగ్, టాటా స్టీల్, టైటాన్ కో, జెఎస్ డబ్ల్యూ స్టీల్, మహీంద్రా& మహీంద్రా కంపెనీల షేర్లు నష్టపోతున్నాయి.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly