సంక్షిప్త వార్తలు:

 • లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు; సెన్సెక్స్ @ 32,424, నిఫ్టీ @ 9580
 • సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఎఫ్‌డీ పథకాన్ని ప్రవేశపెట్టిన ఐసీఐసీఐ బ్యాంకు..
 • సరికొత్త రైడర్‌ను ప్రారంభించిన హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్...
 • ఈపీఎఫ్ నెలవారీ సహకారాన్ని 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గించిన కేంద్రం
 • 2019-20 సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించే గడువును నవంబర్ 30 వరకు పొడిగించిన ప్రభుత్వం
 • రెపో రేటును 0.40 శాతం తగ్గించిన ఆర్‌బీఐ
 • మార్చి త్రైమాసికంలో రూ.1702 కోట్ల నిక‌ర న‌ష్టాన్ని న‌మోదుచేసిన పిర‌మాల్ ఎంట‌ర్‌ప్రైజెస్‌
 • ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప‌రిశ్ర‌మ‌కు రూ.4.5 ల‌క్ష‌ల కోట్ల అద‌న‌పు సాయం అవ‌స‌రమ‌ని అంచ‌నా వేసిన‌ ఫిక్కీ
 • నేడు డాల‌ర్‌తో రూ.75.84 వ‌ద్ద కొన‌సాగుతోన్న రూపాయి మార‌కం విలువ‌
 • ఈ రోజు హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.73.97, డీజిల్ ధ‌ర రూ.67.82

ఆదాయ‌పు ప‌న్ను శాఖ సిటిజ‌న్ చార్ట‌ర్ లో పేర్కొన్న విధంగా స‌కాలంలో ప‌న్ను చెల్లింపుదార్ల ప‌నుల‌ను పూర్తిచేస్తుంది. ఇన్‌కం ట్యాక్స్ రిట‌ర్నుల‌, పెండింగ్ ద‌ర‌ఖాస్తుల‌పైనే ఎక్కువ ఫిర్యాదులు ఉంటాయి. కొన్ని సంద‌ర్భాల్లో ఆల‌స్యం జ‌రిగి ఆదాయ‌పు ప‌న్ను శాఖ మీద ఫిర్యాదులు వెల్లువెత్తుతాయి.

సాధార‌ణ స‌మ‌స్య‌లు-ఫిర్యాదు అంశాలు

ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఫిర్యాదులు ఎక్కువ‌గా వీటికి సంబంధించిన‌వై ఉంటాయి.

 • ఐటీఆర్ ద‌ర‌ఖాస్తు ఫారాలు నింపాక వాటి స్టేట‌స్‌, అక్నాల‌డ్జ్‌మెంట్ పై స‌మ‌స్య‌లు
 • ఈ ఫైలింగ్ లో మార్పుల‌ను ఆన్‌లైన్‌ స్వీక‌రించ‌క‌పోడం, రిఫ‌రెన్స్ సంఖ్య, పిన్ నెంబ‌ర్ త‌ప్పు అని సూచించ‌డం లాంటి స‌మ‌స్య‌లు
 • ఫార‌మ్ 26AS లో రీఫండ్ క్రెడిట్‌ల‌ను చూపిస్తుంది కానీ, రీఫండ్ రాక‌పోవ‌డం.
 • రీఫండ్ అయిన‌ట్టు ఆన్‌లైన్‌లో చూపిస్తుంది కానీ వాస్త‌వానికి రీఫండ్ మ‌న ఖాతాకు జ‌మ‌కాక‌పోవ‌డం.
 • ఆన్‌లైన్ రెక్టిఫికేష‌న్ కు ద‌ర‌ఖాస్తు చేసి మూడు నెల‌లు దాటినా దాన్ని ఇంకా స‌రిచేయ‌క‌పోవ‌డం
 • రిట‌ర్ను ప్రాసెసింగ్ గురించి స‌రైన స‌మాచారం లేక‌పోడం.
 • రిట‌ర్నుల‌కు సంబంధించి ఇచ్చిన ఫిర్యాదుపై 10 రోజులైనా ఐటీశాఖ నుంచి స్పంద‌న కొర‌వ‌డ‌డం.

ఇలా ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఒకే వేదిక ఉంటే అనువుగా ఉంటుంద‌ని భావించి ఈ-నివార‌ణ్ పోర్ట‌ల్‌ను తీసుకొచ్చారు.

ఈ-నివారణ్

పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదుల స‌త్వ‌ర‌ పరిష్కారానికి ఐటీ శాఖ ఈ-నివారణ్ పేరుతో ప్రత్యేక ఆన్‌లైన్ పోర్ట‌ల్‌ను ఏర్పాటుచేసింది. ఈ ప్లాట్‌ఫాం ద్వారా ఆన్‌లైన్‌తోపాటు స్వయంగా దాఖలు చేసిన ఫిర్యాదులను అనుసంధానం చేస్తారు. ఈ వ్యవస్థ ద్వారా ఫిర్యాదుల రికార్డు చేయ‌డంతోపాటు పరిష్కారం లభించే దాకా ట్రాక్ చేసేందుకు అవ‌కాశం ఉంటుంది.

E-NIVARAN-1.jpg

అయిదు విభాగాల‌పై ఫిర్యాదు

ఈ - నివార‌ణ్ ప్ర‌త్యేక పోర్ట‌ల్ ద్వారా ముఖ్యంగా అయిదు విభాగాల‌పై ఫిర్యాదు చేసే అవ‌కాశం క‌లుగుతుంది.

 • ఐటీ ఆసెసింగ్ అధికారి
 • ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్ టీం
 • NSDL
 • డైరొక్ట‌రేట్ ఆఫ్ సిస్ట‌మ్స్‌
 • UTIITSL

ఫిర్యాదు ఉప‌విభాగాల ఎంపిక‌

 • ఫిర్యాదుల విభాగం ఎంపిక త‌ర్వాత కేట‌గిరీలు, ఉప కేట‌గిరీలను ఎంచుకునే అవ‌కాశం ఉంటుంది.
 • ఫిర్యాదుల ఫారంలో త‌ప్ప‌నిస‌రిగా ఈ వివ‌రాలు పొందుప‌ర్చాలి…
  పేరు
  చిరునామా
  ఫోన్ నంబ‌రు
  మెయిల్ ఐడీ
 • చివ‌ర‌లో నిర్దేశించిన స్థ‌లంలో ఫిర్యాదు అంశాన్ని క్లుప్తంగా వివ‌రించాలి.
 • ఫిర్యాదును బ‌ల‌ప‌రిచే అనుబంధ డాక్యుమెంట్ల‌ను అప్‌లోడ్ చేసుకునేందుకు అవ‌కాశం ఉంది. స‌బ్‌మిట్ చేసేముందు ప్రివ్యూ చూసుకొనే వెసులుబాటు క‌ల్పించారు.

ఇలా ఈ-నివార‌ణ్ ద్వారా చేసే ఫిర్యాదులు నిర్ణీత గ‌డువులో ప‌రిష్కార‌మ‌వుతాయి. అలా కాని ప‌క్షంలో త‌దుప‌రి ద‌శ‌కు స‌మ‌స్య‌ను తీసుకెళ్లేందుకు రెండు మార్గాలున్నాయి. అవి…

 1. ఆదాయ‌పు ప‌న్ను శాఖ అంబుడ్స్‌మ‌న్‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌డం
 2. స‌మాచార హ‌క్కు చ‌ట్టం (ఆర్‌టీఐ) ప్ర‌యోగించ‌డం

అంబుడ్స్‌మ‌న్‌కు ద‌ర‌ఖాస్తు

అంబుడ్స్‌మ‌న్‌కు వచ్చే ఫిర్యాదుల్లో 95శాతం ఇన్‌కం ట్యాక్స్ రీఫండ్ల‌కు సంబంధించిన‌వే. 30 రోజులైనా ఫిర్యాదుకు స‌రైన స్పంద‌న రాక‌పోయినా, స‌మ‌స్య ప‌రిష్కారం కాక‌పోయినా… స‌మ‌స్య‌ను మ‌రోసారి వివ‌రిస్తూ పై అధికారుల‌కు లేఖ రాసి తెలియ‌జేయాలి. అప్ప‌టికీ స‌మ‌స్య ప‌రిష్కారం కాక‌పోతే ఇన్‌కం ట్యాక్స్ అంబుడ్స్‌మ‌న్ కు ద‌ర‌ఖాస్తు చేయాలి. ఫిర్యాదు చేసే వ్య‌క్తి పేరు, చిరునామాతో స‌మ‌స్య‌ను వివ‌రిస్తూ క్లుప్తంగా లేఖ రాయాలి. ఏ ఇన్‌కం ట్యాక్స్ అధికారిపై ఫిర్యాదు చేయ‌ద‌లిచారో వారి పేరు, హోదాను లేఖ‌లో పేర్కొనాలి.

మ‌న దేశంలో 12 చోట్ల ఇన్‌కం ట్యాక్స్ అంబుడ్స్‌మ‌న్ కేంద్రాలున్నాయి. తెలుగు రాష్ర్టాల‌కు సంబంధించి అంబుడ్స్‌మ‌న్ కేంద్రం చిరునామా
Hyderabad : 040 (Andhra Pradesh)
Income Tax Ombudsman, Room No.819, 8th Floor, Aayakar Bhawan, BasheerBagh,Hyderabad-4
Sh. M.L. Agrawall, Income Tax Ombudsman
(Ph:040-23425612 Fax:040-23425345)
Email : hyd-itombuds@nic.in

ఫిర్యాదుకు అనుబంధంగా సంబంధిత డాక్యుమెంట్లు, ఇంత‌కుముందు పై అధికారుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్టు ఉన్న లేఖ‌ల కాపీల‌ను జ‌త చేయాలి. సాధార‌ణంగా చాలా కేసుల్లో ఫిర్యాదు అందిన వెంట‌నే అంబుడ్స్‌మ‌న్ మ‌ధ్యేమార్గంగా స‌మ‌స్య తొంద‌ర‌గా తీర్చేందుకు ప్ర‌య‌త్నిస్తారు.

స‌మాచార హ‌క్కు చ‌ట్టం ప్ర‌యోగంతో…

స‌మ‌స్య ప‌రిష్క‌రం అయ్యేందుకు అద్భుత అస్ర్తం స‌హ చ‌ట్టం. స‌మాచార హ‌క్కు ద‌ర‌ఖాస్తుకు ప్ర‌త్యేక ఫార్మ‌ట్ లేదు. ద‌ర‌ఖాస్తుకు వెచ్చించే ఫీజు కూడా నామ‌మాత్రంగా రూ.10 ఉంటుంది. పోస్ట‌ల్ ఆర్డ‌ర్‌, పే ఆర్డ‌ర్‌, కోర్టు ఫీ స్టాంపుల ద్వారా ఫీజు చెల్లించవ‌చ్చు.
సంబంధిత న్యాయ‌స్థానం ప‌రిధిలోని ఆదాయ‌పు ప‌న్ను శాఖ క‌మిష‌న‌ర్‌కు స‌హ ద‌ర‌ఖాస్తు ఫారాన్ని స‌మ‌ర్పించాలి. స‌హ ద‌ర‌ఖాస్తులో స‌మ‌స్య వివరించే విధానం చాలా ముఖ్యం. స‌మ‌స్య ఎందుకు ప‌రిష్కారం కాలేదు అని అడిగేదానిక‌న్నా… స‌మ‌స్య ప్ర‌స్తుత ప‌రిస్థితి ఎలా ఉంది అని అడ‌గ‌డం భావ్యం.

రీఫండ్‌కు సంబంధించి ఫిర్యాదు చేయ‌ద‌లిస్తే … రీఫండ్ ప్ర‌స్తుత ప‌రిస్థితి (స్టేట‌స్‌) తెలియ‌జేయాల్సిందిగా వారిని కోరాలి.

స‌హ ద‌ర‌ఖాస్తు స‌మ‌ర్పించేందుకు ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌లో ప్ర‌త్యేక విభాగం లేదు. స‌హ చ‌ట్టం ప్ర‌కారం ప్ర‌తి అధికారి స‌హ ద‌ర‌ఖాస్తును స్వీక‌రించాలి. ఒక వేళ ఆ స‌మ‌స్య త‌మ ప‌రిధిలోది కాక‌పోతే, స‌ద‌రు అధికారి వేరొక‌రికి దాన్ని బ‌దిలీ చేయాలి.

స‌హ చ‌ట్టం కింద చేసిన ఏ ఫిర్యాదు అయినా 30రోజుల‌లోగా ప‌రిష్కార‌మ‌వ్వాలి. కాబ‌ట్టి మీ ఆదాయ‌పు ప‌న్ను ఫిర్యాదు కూడా 30రోజుల్లోగా ప‌రిష్కార‌మ‌య్యేలా సంబంధిత ఐటీ శాఖ క‌మిష‌న‌ర్ చ‌ర్య‌లు తీసుకుంటారు.

పైన పేర్కొన్న రెండు విధానాల్లో ఏదైనా ఒక‌దాన్ని ప్ర‌యోగించి ఫిర్యాదుల‌ను స‌త్వ‌రం ప‌రిష్కార‌మ‌య్యే దిశ‌గా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాం.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

కింది వాటిలో స్టాక్ మార్కెట్ సూచీల‌ను ఆధారంగా పెట్టుబ‌డి పెట్టే ఫండ్లు ఏవి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%