సంక్షిప్త వార్తలు:

  • భారీ లాభాల‌తో ముగిసిన మార్కెట్లు ; సెన్సెక్స్ @ 35,843, నిఫ్టీ @ 10,551
  • గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం (2019-20)లో దేశంలో 3వ అతిపెద్ద టెలికాం సంస్థ `వొడాఫోన్ ఐడియా` రికార్డు స్థాయిలో రూ. 73,878 కోట్ల నిక‌ర న‌ష్టాన్ని చ‌విచూసింది.
  • 99ఏక‌ర్స్‌.కామ్ యొక్క స‌ర్వేలో 31% ఇప్ప‌టికీ రియ‌ల్ ఏస్టేట్‌లో పెట్టుబ‌డికి మొగ్గు చూపుతున్నారు.
  • 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రంలో 13 శాతం వృద్ధితో రూ.963 కోట్ల ఆదాయాన్ని న‌మోదు చేసిన సెబీ
  • పాన్-ఆధార్ గ‌డువును జూన్ 30 వ‌ర‌కు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించిన ఆర్థిక మంత్రిత్వ శాఖ‌
  • మ్యూచువ‌ల్ ఫండ్ యూనిట్ల రిడెంప్ష‌న్‌కు స్టాంప్ డ్యూటీ వ‌ర్తించ‌ద‌ని `సెబీ` స్ప‌ష్టం చేసింది.
  • కో-ఆప‌రేటివ్ బ్యాంకుల‌ను ఆర్‌బీఐ నియంత్ర‌ణ‌లోకి తీసుకొచ్చేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణ‌యం
  • యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) దేశ‌వ్యాప్తంగా 125 ప్రాంతీయ కార్యాల‌యాల‌ను ఏర్పాటు చేసింది.
  • నేడు డాల‌ర్‌తో రూ. 74.88 వ‌ద్ద కొన‌సాగుతోన్న రూపాయి మార‌కం విలువ‌
  • ఈ రోజు హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.83.49, డీజిల్ ధ‌ర రూ.78.69

ప్రస్తుతం నాకు ఒక బ్యాంకు లో సేవింగ్స్ అకౌంట్ ఉంది. నాకు వచ్చే శాలరీ కూడా ఇదే సేవింగ్స్ అకౌంట్ లో జమ అవుతుంది. ప్రస్తుతం నా అకౌంట్ లో రూ. 2,50,000/- ఉన్నాయి. ఈ డబ్బులు దాటితే నేను పన్ను చెల్లించాల్సి వస్తుందా? కొత్త బడ్జెట్ 2020 ప్రకారం రూ.2.5 లక్షలు దాటితే 5% income tax తప్పకుండా కట్టాలా? నేను ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ డబ్బులు బ్యాంకు లో సేవ్ చేసుకుంటున్నాను. కాని ఇప్పుడు ఇలా ప్రభుత్వం సేవ్ చేసుకునే వీలు లేకుండా చేస్తే ఎలా? ఇప్పుడు నేనేం చేయాలి? దీనికి పరిష్కారం తెలుపగలరు? అలాగే కొత్త బడ్జెట్ స్లాబ్స్ 2020 క్లుప్తoగా వివరించగలరు? నా సందేహాన్ని నివృతం చేయండి.

బ్యాంకు పొదుపు ఖాతా లో డబ్బు ఉంచినట్లయితే, ఏడాదికి రూ. 10 వేల వరకు వడ్డీ పై పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. ఆ పైన వచ్చిన వడ్డీ ని వార్షిక ఆదాయానికి జత......

హాయ్, నేను గత ఏడాది కి గాను నేను పన్ను రిటర్న్స్ దాఖలు చేశాను. అయితే, నాకు రూ. 20 వేలు రిఫండ్ వచ్చేదుంది. ఆదాయ పన్ను శాఖ వారు ఈ కింది మెసేజ్ పంపారు: Subject: CPC Grievance Status. Please find below the CPC resolution along with the status at CPC for the query raised by you through e-filling site. Query raised: Others - Processing Resolution: Dear Taxpayer,The processing of your Return(ITR) is pending for want of verification of the correctness of certain claims made by taxpayer in the ITR. This is likely to take few months depending on the swiftness & accuracy of taxpayer response. Taxpayer may receive further communication from the Department seeking responses to specific claims made by taxpayer in the ITR which have been identified for further verification. Please do respond with the information sought, at the earliest, as the refund will be generated only once the processing of the ITR is completed ఇప్పుడు ఏం చేయాలి?

ఈ విషయం లో మీరు చేయవలసింది ఏం లేదు. మీ నుంచి ఏదైనా సమాచారం కోరినట్టయితే అప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. దానికోసం వేచి చుడండి. ## సిరి లో ఇంకా మదుపర్ల ప్రశ......

నమస్కారములు, నేను నా భార్య (గృహిణి) హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం రెండు లక్షల రూపాయలు ఆన్లైన్ లో పంపించడం జరిగింది. ఐతే నా భార్య తండ్రి గారు హాస్పిటల్ ఖర్చులు చెల్లించడం వలన ఆ మెత్తం నా భార్య అకౌంట్ లోనే వున్నాయి. అలాగే సంవత్సరం క్రితం నా ప్రియ స్నేహితునికి డబ్బు అవసరమైతే స్నేహపూర్వకంగా ఏవిధమైన వడ్డీ లేకుండా లక్ష రూపాయలు ఆన్లైన్ లో జమచేయగా, ఇప్పుడు ఆ డబ్బును నా స్నేహితుడు తిరిగి జమచేయడం జరిగింది. వీటిమీద ఇన్కమ్ టాక్స్ ప్రభావం ఏవిధంగా ఉంటుంది. తెలియజేయగలరు. ధన్యవాదములు.

పొదుపు ఖాతా లో ఉన్న డబ్బు ని బట్టి ఆదాయ పన్ను లెక్కించారు. మీ ఆదాయాన్ని బట్టి పన్ను ఉంటుంది. వార్షిక ఆదాయం రూ. 2.50 లక్షల వరకు ఉన్నట్టయితే పన్ను వర్తి......

నా పేరు మనోహర్, నా వయసు 25. నేను నెలకు రూ. 30000/- సంపాదిస్తాను. గత ఏడాది ఎల్ఐసి జీవం లాబ్ పాలసీ తీసుకున్నాను. దాని ప్రీమియం రూ. 56000/-. పాలసీ కాల పరిమితి 15 ఏళ్ళు, 21 ఏళ్ళ తర్వాత నాకు రూ. 21 లక్షలు వస్తాయని ఏజెంట్ చెప్పాడు. ఈ పాలసీ లో మదుపు చేయడం కంటే మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేస్తే నాకు ఎక్కువ లాభం వస్తుంది అని విన్నాను. నేను మా కుటుంబ అవసరాల కోసం బ్యాంకు లో రూ. 10 లక్షల ఫిక్సిడ్ డిపాజిట్ చేశాను. ఈ పాలసీ ని క్లోజ్ చేసి ఫండ్ లో మదుపు చేయాలనుకుంటున్నాను. నెలకి రూ. 5000/- పెట్టగలను. 15 ఏళ్ళకి నాకు ఎంత వస్తుంది? వచ్చిన లాభం మీద ఏమైనా పన్ను కట్టాలా?

ఈ పాలసీ ని సరెండర్ చేయాలనే మీ ఆలోచన సరైనదే. బీమా మదుపు కలిపి ఉన్న పాలసీలలో బీమా హామీ తక్కువ, రాబడి తక్కువ, పైగా ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాటి......

సార్, నేను 2016 లో రూ. 16 లక్షల లోన్ తీసుకుని రూ. 21లక్షలకి ఒక ఫ్లాట్ కొన్నాను. దానికి ఏడాదికి రూ.1.5 లక్షలు వడ్డీ కడుతున్నాను. దీనిని నేను నా ఆదాయపు పన్నులో క్లెయిమ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మ‌రో రూ. 25 లక్షల లోన్ తీసుకుని రూ. 30 లక్షలకి రెండో ఫ్లాట్ కొనాలని అనుకుంటున్నాను. దానికి ఏడాదికి రూ.2.2 లక్షలు వడ్డీ కట్టాల్సి వస్తుంది. రెండు హోమ్ లోన్లు కలిపి మొత్తం 3.7 లక్షలు వడ్డీ అవుతుంది. అలాగే రెండు ఫ్లాట్స్ మొత్తం విలువ రూ. 51 లక్షలు అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం నేను రూ. 3.5 లక్షలు గృహ రుణ వడ్డీని ఆదాయపు పన్నులో క్లెయిమ్ చేసుకోవచ్చా? దయ చేసి తెలుపగలరు.

ఇటీవ‌ల ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌(2019) ప్ర‌కారం మార్చి 31, 2020 వ‌ర‌కు గృహ రుణం తీసుకున్న వారికి, అందుబాటు ధ‌ర‌లో ఉన్న ఇళ్ళు( ఇంటి విలువ రూ.45 ల‌క్ష‌......

విలువైన సమాచారాన్ని , సలహాలను, సూచనలను అందిస్తున్న ఈనాడు సిరి కి ధన్యవాదములు. నేను ఆగష్ట్ 2017 లొ నా పాన్ కార్డ్ ను ఆధార్ కార్డుతో లింక్ చేశాను. ప్రస్తుతం నేను ఆదాయ‌పు ప‌న్ను ఈ-ఫైల్లింగ్ సైట్‌లో వైరిఫై యువ‌ర్ ఫాన్ ఆప్ష‌న్ ద్వారా వివ‌రాలు వెరిఫై చేస్తే మీరు ఇచ్చిన పాన్ నెంబ‌రుపై ఎలాంటి రికార్డులేదు అని వ‌స్తుంది. లింక్ ఆధార్‌(లింక్ ఆధార్ స్టేట‌స్‌) ఆప్ష‌న్ ద్వారా పాన్ కార్డ్ వివరాలు వెరిఫై చేస్తే పాన్ నెంబ‌రు లేదు అని చూపుతుంది. దీనికి గల కారణాలను ఏంటి? పాన్‌ను యాక్టీవ్ చేసుకునేందుకు సలహాలు, సూచనలు తెలుపగలరు

ఒక‌సారి పాన్‌ను ఆధార్‌తో లింక్ చేస్తే స‌రిపోతుంది, ప‌దేప‌దే చేయాల్సిన అవ‌స‌రం లేదు. మీ స‌మ‌స్య‌ను portal.incometaxindiaefiling.gov.in ద్వారా ఈ-నిర్వా......

సర్, మా బ్రదర్ ఎన్ఆర్ఐ. తనకు హైదరాబాద్‌లో 6 సం.ల కిందట కొన్న 3 స్థలాలున్నాయి. వాటిని 2018 లో బిల్డర్‌కు డెవలప్మెంటుకి ఇచ్చాడు. వాటి తాలూకు మా బ్రదర్‌కి 6 అపార్ట్‌మెంట్స్ (ఫ్లాట్స్) వచ్చాయి. ఇపుడు కేపిటల్ గెయిన్ టాక్స్ లెక్కించడానికి బిల్డర్ ఫ్లాట్లుని అప్పగించిన తేదీని పరిగణలోకి తీసుకోవాలా లేక బిల్డర్‌తో జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ తేదీని తీసుకోవాలా? ఫ్లాట్లుని అప్పగించిన తేదీని తీసుకుంటే, 24 నెలల లోపే అమ్మకం జరిగినట్లవుతుంది. అదే అగ్రిమెంట్ తేదీని తీసుకుంటే 24 నెలలు దాటుతుంది. కాబట్టి సెక్షన్ 45(5a) ప్రకారం, ఈ ట్రాన్‌శాక్షన్ లో ఏ కేపిటల్ గెయిన్ (Short Term/LongTerm) వర్తిస్తుందో దయచేసి తెలుపగలరు. షార్ట్ టరమ్ కేపిటల్ గెయిన్ గనుక వర్తిస్తే, ఎంత శాతం టాక్స్ కట్టాలి, దానిని తగ్గించుకునే దానికి చట్టంలో వున్న సదుపాయాలను తెలుపగలరు. ధన్యవాదములతో,

ఇది పన్ను పరంగా సంక్లిష్టమైన సమస్య. కాబట్టి, మీరు ఒక ఛార్టర్డ్ అకౌంటెంట్ ని వీలైనంత త్వరగా సంప్రదించడం మంచిది. వారు మీకు తగిన సలహా ఇవ్వగలరు. ## సిరి......

హాయ్ సిరి, రూ.8 ల‌క్ష‌ల ఆదాయం ఉన్న వారికి, ప్ర‌స్తుతం రూ. 5 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు ఉంటే, మిగిలిన రూ.3 ల‌క్ష‌ల‌కు ప‌న్ను చెల్లించాలా? ఒక‌వేళ నా శాల‌రీ రూ.5.4 ల‌క్ష‌లు అయితే అందులో రూ. 40 వేలుకు ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చే ఆదాయం అవుతుంది. అయితే నేను రూ.40 వేల‌కు ఈఎల్ఎస్ఎస్‌లో సేవింగ్స్ చూపిస్తే స‌రిపోతుందా? లేదా ఇంకా ఎక్కువ చూపించాలా? ప‌న్ను ఆదా చేసుకునేందుకు ఈ నెల నుంచి మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మ‌దుపు చేయాల‌నుకుంటున్నాను. నేను మొద‌టి సారి ఫండ్ల‌లో పెడుతున్నాను. కావున నాకు త‌గిన స‌ల‌హా ఇవ్వండి?

లైఫ్ ఇన్సురెన్స్, ఈపీఎఫ్‌, పీపీఎఫ్‌, ఈఎల్ఎస్ఎస్‌, ఎన్‌పీఎస్, సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ప‌థ‌కాల‌లో పెట్టిన పెట్టుబ‌డుల‌పై, 5 సంవ‌త్స‌రాల బ్యాంక్ ఎఫ్‌డీ, గ......

హాయ్ సిరి. నేను తెలంగాణా ప్ర‌భుత్వ ఉద్యోగిని. నా శాలరీ ఖాతా ఉన్న ఎస్‌బీఐలో రూ. 2 ల‌క్ష‌ల‌ను ఆన్‌లైన్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశాను. కాల‌ప‌రిమితి 1సంవ‌త్స‌రం. దానిపై రూ.13 వేలు వ‌డ్డీ వ‌స్తుంది. నా నెల‌వారీ జీతం రూ.47వేలు. ఐటీ రిట‌ర్న‌ల‌లో ఫిక్సెడ్ డిపాజిట్‌పై వ‌చ్చే వ‌డ్డీకి ప‌న్ను చెల్లించాలి అని చెబుతున్నారు. అయితే నేను తరువాతి సంవ‌త్స‌రం ట్యాక్స్ ప‌రిధిలోకి రాక‌పోవ‌చ్చు. అప్పుడు ప‌న్ను చెల్లించ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉండ‌దా? లేదా నేను మా అమ్మ గారి ఖాతాలో డిపాజిట్ చేయ‌వ‌చ్చా? ఆమెకు, నాకు క‌లిపి తెలంగాణా గ్రామీణ బ్యాంకులో జాయింటు ఖాతా ఉంది. జాయింట్ ఖాతా వ‌ల్ల ఏమైనా న‌ష్టం ఉందా? జాయింటు ఖాతా నుంచి నేను వైదొల‌గాలా? తెలియ‌జేయండి.

ఆర్థిక సంవ‌త్స‌రం 2018-19కి గానూ వ‌డ్డీ ఆదాయం రూ.10 వేల‌కు మించితే బ్యాంకులు, పోస్టాఫీసులు కూడా టీడీఎస్‌ను డిడ‌క్ట్ చేస్తాయి. వ‌డ్డీ క్రెడిట్ చేసే స‌మ......

సార్, 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రానికి గానూ ఇచ్చిన చివ‌రి బ‌డ్జెట్‌లో, సెక్ష‌న్ 80టీటీబీ కింద సీనియ‌ర్ సిటిజ‌న్ల వ‌డ్డీ ఆదాయంపై రూ. 50 వేల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంద‌ని ఆర్థిక మంత్రి ప్ర‌క‌టించారు. ఇది ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రిక‌రింగ్ డిపాజిట్లు, పొదుపు డిపాజిట్ల‌ మొత్తం వ‌డ్డీపై వ‌ర్తిస్తుంది, కానీ ప్ర‌స్తుతం సీబీడీటీ విడుద‌ల చేసిన స‌ర్కుల‌ర్‌లో పొదుపు డిపాజిట్ల‌పై మాత్ర‌మే సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు రూ.50 వేల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు వ‌ర్తిస్తుంద‌ని పేర్కొన్నారు. సీనియ‌ర్ సిటిజ‌న్ల వ‌డ్డీ ఆదాయంపై రూ.50 వేల ప‌న్ను మిన‌హాయింపు అన్ని డిపాజిట్ల‌కు వ‌ర్తిస్తుందా? లేదా సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుందా? తెలుప‌గ‌ల‌రు.

"డిపాజిట్స్‌"," సేవింగ్స్" అనే ప‌దాలు సీబీడీటీ, వారి స‌ర్క్యుల‌ర్‌లో ఒక‌దానికి మ‌రొక‌టి పరస్పరంగా ఉప‌యోగించింది. ప్ర‌భుత్వం, సీనీయ‌ర్ సిటిజ‌న్ల‌కు ఉప......

డియ‌ర్ సిరి, ఆర్థిక విష‌యాల‌లో మాకు అవ‌గాహ‌న క‌ల్పిస్తూ మా సందేహాలను తీరుస్తున్నందుకు మీకు చాలా ధ‌న్య‌వాధ‌ములు. నా వార్షిక ఆదాయం 6 ల‌క్ష‌లు. యాభై వేల మీద ప‌న్ను మిన‌హాయింపు కోసం మ‌దుపు చేయాల‌నుకుంటున్నాను. 5 నుంచి 10 సంవ‌త్స‌రాల మ‌ధ్య‌లో రాబ‌డి కావాల‌నుకుంటున్నాను. ఫిక్సిడ్ డిపాజిట్ పై వ‌చ్చే వ‌డ్డీ మీద ప‌న్ను చెల్లించాల్సి వ‌స్తుందా? 5 సంవ‌త్స‌రాల కోసం ఏది ఉత్త‌మం? బ‌్యాంక్ క‌న్నా ఫోస్టాఫీసులో ఎక్కువ వ‌డ్డీ వ‌స్తుందా? 5 సంవ‌త్స‌రాల త‌రువాత నా వేత‌నం పెరిగితే ఆదాయ‌పు ప‌న్ను స్తాబ్ మారుతుందా? తెలుప‌గ‌ల‌రు.

ఆదాయ‌పు ప‌న్ను విన‌హాయింపు చ‌ట్టం సెక్ష‌న్ 80సి ప్ర‌కారం 1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు పిఫ్‌, లైఫ్ ఇన్సురెన్స్ ప్రీమియం, యులిప్స్‌, పిపిఎఫ్‌, నేషనల్ సేవింగ్స్ స......

నేను ఆదాయ ప‌న్ను ప‌రిధిలోకి రాను. అయితే మ్యూచువ‌ల్ ఫండ్లలో క్ర‌మానుగ‌త పెట్టుబ‌డుల విధానం(సిప్‌) మీద స‌రైన అవ‌గాహ‌న లేక సెప్టెంబ‌ర్, 2017 లో ఐసీఐసీఐ ప్రు వ్యాల్యూ డిస్క‌వ‌రీ ఫండ్‌ని ఉప‌సంహ‌రించుకున్నాను. అయితే నా సందేహం ఏంటంటే నేను పెట్టుబ‌డులు పెట్టి ఏడాది పూర్త‌యింద‌నుకున్నాను, నిజానికి ప్ర‌తీ సిప్‌ను ఏడాది పాటు కొన‌సాగించాల‌న్న విష‌యం తెలియ‌క, ముందే ఉపసంహ‌రించుకున్నాను. నేను ఇప్పుడు స్వ‌ల్ప కాల మూలధ‌న లాభాల ప‌న్ను(ఎస్‌టీసీజీ) చెల్లించాల్సి వ‌స్తుంద‌ని భ‌య‌ప‌డుతున్నాను. ప‌న్ను చెల్లింపుదారుడిని కాన‌ప్ప‌టికీ ఎస్‌టీసీజీ చెల్లించాల్సిందేనా? ఒకే వేళ నేను ఆదాయ ప‌న్ను రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేయాల్సి వ‌స్తే, ఆదాయం తక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌తీ ఏడాది రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేయాలా లేదా తెలుప‌గ‌ల‌రు?

మీ వ‌య‌సు 60 ఏళ్ల లోపే ఉండి, 2017-18 ఆర్థిక సంవ‌త్స‌రంలో, మీ మొత్తం ఆదాయం, స్వ‌ల్ప కాల మూల‌ధన లాభాల‌తో క‌లిసి రూ.2.50 ల‌క్ష‌ల కంటే త‌క్కువ‌గా ఉన్న‌ట్......

సర్, మా సోదరి తన పేరుమీద 1982 లో రిజిష్టరు అయిన 470 చ.గ స్తలాన్ని డెవలప్మెంటుకి ఇవ్వాలనుకుంటున్నది. ఆమె వాటాగా బిల్డర్ 4 ఫ్లాట్లు (అపార్ట్మెంట్లు) ఇవ్వడానికి అంగీకరించాడు. ఈ 4 ఫ్లాట్లని ఆమె తన ఇద్దరు కుమార్తెలకు రెండేసి చొప్పున గిప్టుగా ఇవ్వాలనుకుంటున్నది. కాపిటల్ గెయిన్ టాక్స్ తగ్గాలంటే ముందుగా కుమార్తెలకు కొంత స్తలాన్ని (ఇరువురకు ఒక్కొక్క ఫ్లాట్ వచ్చే విధంగా) గిప్ట్ డీడ్లుగా వ్రాసి ఆమె పేరుతో వచ్చే 2 ఫ్లాట్లుని కూడా తరువాత గిప్ట్ గా వ్రాస్తే మంచిదా? లేక 4 ఫ్లాట్లుని ముందు ఆమే పొంది తదుపరి వాటిని గిప్ట్ లుగా కుమార్తెలకు ఇస్తే మంచిదా? తెలుపగలరు. 1-4-2018 నుంచి ఆస్తి కొనుగోలు విలువ 2001 సం. మార్కెట్టు విలువ ఆధారంగా పరిగణించబడుతుంది కాబట్టి ఏది లాభమో సూచించగలరు. అలాగే స్తల యజమాని బిల్డర్ తో జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు, యజమాని ఆస్తి అమ్మకం విలువని (Full value of sale consideration) ఏ విధంగా లెక్కిస్తారో దయచేసి తెలుపగలరు.

గ‌తేడాది చేసిన స‌వ‌ర‌ణల ప్ర‌కారం భూమి య‌జ‌మాని డెవెలెప్‌మెంట్ కు ఇచ్చేందుకు క్యాపిట‌ల్ గెయిన్స్ కింద ప్లాట్లు పొందే ఏడాది ప్ర‌కారం గుర్తించాల్సి ఉంది.......

హాయ్‌! నేను బెంగ‌ళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ప‌ని చేస్తున్నాను. ప‌న్ను మిన‌హాయింపుల కోసం మా కంపెనీకి నేను అన్ని ఎల్ఐసీ పేప‌ర్లు, ఇంటి అద్దె ర‌శీదుల‌ను స‌మ‌ర్పించాను. కానీ మా ఇంటి య‌జ‌మాని పాన్ కార్డ్ వివ‌రాలు ఇవ్వ‌నందుకు గానూ మిన‌హాయింపుల కోసం మా కంపెనీ అద్దె ర‌శీదుల‌ను ప‌రిగ‌ణ‌లోనికి తీసుకోవ‌డం లేదు. అలాగే నేను డిసెంబ‌ర్ త‌ర్వాత క‌ట్టిన ఎల్ఐసీ పాల‌సీల పేప‌ర్ల‌ను సైతం ప‌రిగ‌ణ‌లోనికి తీసుకోవ‌డం లేదు. ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసేట‌ప్పుడు అన్ని ప‌త్రాల‌ను స‌మ‌ర్పించాల్సిందిగా వారు సూచించారు. నా ప్ర‌శ్నేంటంటే, ప‌న్ను ఆదా కోసం డిసెంబ‌ర్ త‌ర్వాత కట్టిన ఎల్ఐసీ ప్రీమియంల ర‌శీదుల‌ను ఎలా స‌మ‌ర్పించాలి. ఇంటి య‌జ‌మాని పాన్ కార్డ్ వివ‌రాల‌ను ఇవ్వ‌నందుకు గానూ ప‌న్ను మిన‌హాయింపుల కోసం ఇంటి అద్దె ప‌త్రాల‌ను ప‌రిగ‌ణ‌లోనికి తీసుకోరా, చెప్ప‌గ‌ల‌రు.

ఇంటి అద్దె ఏటా రూ.1 ల‌క్ష దాటితే క‌చ్చితంగా ఇంటి య‌జ‌మాని పాన్ వివరాలు స‌మ‌ర్పించాల్సిందేన‌ని ఆదాయ ప‌న్ను శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. మీ వేతన ఆదాయంల......
ఒక ఇంటిని య‌జ‌మాని నుంచి అద్దెకు తీసుకొని మ‌రొకరికి అద్దెకు ఇస్తే వ‌చ్చే ఆదాయంపై ప‌న్ను ప్ర‌భావం ఏమిటి?

జ‌:  సాధార‌ణంగా య‌జ‌మాని ఇంటి నుంచి అద్దె రూపంలో ఆదాయం పొందితే దానిని గృహం నుంచి వ‌చ్చే ఆదాయంగా ప‌రిగ‌ణించి ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇంటి య‌జ‌మాని నుంచి అద్దెకు తీసుకొని దానిని మ‌రొక‌రికి అద్దె ఇవ్వ‌డం ద్వారా పొందే ఆదాయంపై య‌జ‌మాని నుంచి అద్దెకు తీసుకున్న వ్య‌క్తి ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ఆదాయాన్ని ఇత‌ర మూలాల నుంచి వ‌చ్చిన ఆదాయంగా పేర్కొని దానిపై ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది.

గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో నేను మూడు కంపెనీల‌లో ఉద్యోగం చేశాను. ఏ కంపెనీలో కూడా నా జీతం నుంచి టీడీఎస్ మిన‌హాయించుకోలేదు. నేను ఆదాయ‌ప‌న్ను రిట‌ర్నులు స‌మ‌ర్పించాలా?

జ‌: గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో మూడు కంపెనీల‌లో క‌లిపి మీరు పొందిన ఆదాయం మొత్తం  గ‌రిష్ఠ ఆదాయ ప‌రిమితిని దాటితే  మీరు క‌చ్చితంగా ఆదాయ‌ప‌న్ను రిట‌ర్ను స‌మ‌ర్పించాల్సిందే. మీ గ‌త కంపెనీలో టీడీఎస్ మిన‌హాయించుకోక‌పోయినా ఇప్పుడు మీరు ఆదాయ‌ప‌న్ను రిట‌ర్ను స‌మ‌ర్పించాలి.

మా కంపెనీ నాకు చెల్లించే జీతం నుంచి ఎలాంటి ప‌న్ను మిన‌హాయించుకోలేదు. అయిన‌ప్ప‌టికీ నేను నా కంపెనీ నుంచి పారం 16 తీసుకోవాల్సి ఉంటుందా?

జ‌:  సాధార‌ణంగా ఫారం 16 అనేది టీడీఎస్ మిన‌హాయించుకుంటే ఆ వివ‌రాలను తెలుపుతూ ఇచ్చే స‌ర్టిఫికేట్‌. కాబ‌ట్టి మీరు మీ కంపెనీ నుంచి ఫారం 16 తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. అయితే మీరు కంపెనీ నుంచి శాల‌రీ స్టేట్‌మెంట్ ను తీస‌కోవ‌చ్చు.

బంధువులు, స్నేహితుల నుంచి ఇంటి కోసం తీసుకున్న రుణాల‌పై మిన‌హాయింపు పొంద‌వ‌చ్చా?

జ‌:  పొంద‌వ‌చ్చు. అయితే ఆ రుణాన్ని ఇంటి నిర్మాణానికి లేదా మ‌ర‌మ్మ‌తుల‌కు ఉప‌యోగిస్తే ఆ రుణం పై చెల్లించిన వ‌డ్డీకి మాత్ర‌మే సెక్ష‌న్ 24బి కింద .  మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. చెల్లించిన అస‌లు పై కూడా సెక్ష‌న్ 80సి కింద మిన‌హాయింపును పొందాలంటే గృహ‌రుణాన్ని ఏవైనా గుర్తింపు పొందిన సంస్థ‌ల నుంచి తీసుకొని ఉండాలి.

నేను, నా భార్య ఉమ్మ‌డి పేరు మీద ఇళ్లు కొన్నాం. దీనికి ఉప‌యోగించిన డ‌బ్బు కూడా ఇద్ద‌రం విడివిడిగా రుణం తీసుకున్నాం. ఇప్పుడు ఆ ఇంటిపైన వ‌చ్చే అద్దెను ఇద్ద‌రం పంచుకొని దాని పై ప‌న్ను చెల్లించాల్సి ఉంటుందా?

జ‌. అవును. ఆ ఇంటిపై వ‌చ్చే అద్దెను మీరు, మీ భార్య మీమీ పెట్టుబ‌డుల నిష్ప‌త్తుల‌ను బ‌ట్టి పంచుకొని దాని పై ప‌న్ను ఇద్ద‌రు విడివిడిగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఆ ఇంటి రుణంపై  మిన‌హాయింపులు కూడా ఇరువురూ విడివిడిగా పొంద‌వ‌చ్చు.

వివాహాల స‌మ‌యంలో కాకుండా ఇత‌ర శుభ‌కార్యాల‌లో బ‌హుమ‌తులు పొందితే వాటి పై ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చా?

జ‌: పొంద‌లేము. కేవ‌లం వివాహ సమ‌యంలో అందుకున్న బ‌హుమ‌తులు మాత్ర‌మే ప‌న్ను మిన‌హాయింపు ప‌రిధిలోకి వ‌స్తాయి. అలా కాకుండా పుట్టిన‌రోజులు, పెళ్లి రోజులు వంటి శుభ‌కార్యాల‌కు అందుకున్న బ‌హుమ‌తులపై ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది.

ప‌న్ను మిన‌హాయింపు ఉన్న మూలాల నుంచి వ‌చ్చిన న‌ష్టాల‌ను ఇత‌ర ఆదాయంతో స‌ర్థుబాటు లేదా క్యారీ ఫార్వ‌ర్డ్ చేయ‌వ‌చ్చా?

చేయ‌లేము. ప‌న్ను మిన‌హాయింపు ఉన్న మూలాల నుంచి వ‌చ్చిన న‌ష్టాల‌ను వేరే ఏ ఇత‌ర ఆదాయాల‌తో స‌ర్దుబాటు చేసుకునే అవ‌కాశం లేదు. ఉదాహ‌ర‌ణ‌కు వ్య‌వ‌సాయ ఆదాయం. దీనిపై ఎలాంటి ప‌న్ను చెల్లించం కావున దీని ద్వారా వ‌చ్చిన న‌ష్టాల‌ను వేరే ఏ ఇత‌ర ఆదాయంతో స‌ర్ధుబాటు చేయ‌లేము,

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

పోస్టాఫీసు పొదుపు ఖాతా ప్రారంభించేందుకు క‌నీస వ‌య‌సెంత‌?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%