ఇకపై ఓటీపీ ఎంటర్ చేస్తేనే నగదు ఉపసంహరణ..

ఏటీఎంలలో మోస‌పూరిత‌ లావాదేవీల నుంచి సుర‌క్షితంగా ఉంచ‌డానికి ఎస్‌బీఐ ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ వ్యవస్థను ప్రవేశ‌పెట్టింది

ఇకపై ఓటీపీ ఎంటర్ చేస్తేనే నగదు ఉపసంహరణ..

దేశంలోనే అతిపెద్ద బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఏటీఎంలలో అనధికార లావాదేవీల నుంచి తన వినియోగదారులను రక్షించడానికి వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) ఆధారిత నగదు ఉపసంహరణ వ్యవస్థను ప్రవేశపెట్టనుంది. ఓటీపీ- ఆధారిత నగదు ఉపసంహరణ వ్యవస్థ జనవరి 1, 2020 రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య అన్ని ఎస్బీఐ ఏటీఎంలలో అందుబాటులో ఉండనుంది.

ఏటీఎంలలో అనధికార లావాదేవీల నుంచి మిమ్మల్ని రక్షించడానికి ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ వ్యవస్థను ప్రవేశపెడుతున్నాం. జనవరి 1, 2020 నుంచి ఈ కొత్త భద్రతా విధానం అన్ని ఎస్బీఐ ఏటీఎంలలో అందుబాటులో ఉంటుందని ఎస్బీఐ ట్వీట్ చేసింది. ఎస్బీఐ ఓటీపీ- ఆధారిత నగదు ఉపసంహరణ సౌకర్యం రూ. 10,000 కంటే ఎక్కువ విలువగల లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుంది.

ఎస్బీఐ ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ సౌకర్యం గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు…

  1. ఈ కొత్త భద్రతా విధానం ద్వారా నగదు ఉపసంహరించుకోవడానికి మీ బ్యాంకు ఖాతాకు లింక్ చేసుకున్న మొబైల్ నంబర్‌ తప్పనిసరి.

  2. ఖాతాదారుడు తాను ఉపసంహరించుకోవాలనుకున్న మొత్తాన్ని నమోదు చేసిన తర్వాత, ఏటీఎం స్క్రీన్ పై ఓటీపీ నమోదు చేయాల్సిన పాప్ అప్ కనిపిస్తుంది.

  3. అనంతరం ఖాతాదారుడు తన మొబైల్ నెంబర్ కి వచ్చిన ఓటీపీని ఏటీఎం స్క్రీన్ పై ఎంటర్ చేసి నగదును ఉపసంహరించుకోవచ్చు.

  4. అయితే, ఈ సౌకర్యం మరొక బ్యాంకు ఏటీఎంల ద్వారా చేసే లావాదేవీలకు వర్తించదు, ఎందుకంటే ఈ కార్యాచరణను నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ (ఎన్ఎఫ్ఎస్) లో డెవలప్ చేయలేదు.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly