ఇక‌పై పాన్ చెల్లాలంటే .. ఆధార్‌తో అనుసంధానించాల్సిందే..

పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించేందుకు ఆగ‌ష్టు 31 చివ‌రి తేదీ

ఇక‌పై పాన్ చెల్లాలంటే .. ఆధార్‌తో అనుసంధానించాల్సిందే..

పాన్ కార్డు లేని వారు ఆధార్ కార్డును ఉప‌యోగించి కూడా ఆదాయపు పన్ను రిటర్నుల ఫైల్ చేయోచ్చ‌ని, ఇకపై పాన్ కార్డుకు బదులు ఆధార్‌ను ఉపయోగించొచ్చని ఇటీవల బడ్జెట్‌ సందర్భంగా కేంద్రం మంత్రి నిర్మలా సీతారామ‌న్ స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. ఈ రెండింటిలో దేన్నైనా ఉపయోగించొచ్చని సూచించింది. అయితే, పాన్‌-ఆధార్‌ అనుసంధానం మాత్రం యథావిధిగా కొనసాగనుంది. అలా ఆగస్టు 31 లోపల అనుసంధానం చేయకుంటే పాన్‌ను చెల్లనిదిగా గుర్తిస్తారని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.

ఆదాయపు పన్ను ఫైలింగ్‌కు ఆధార్‌ను ఉపయోగించినప్పుడు సంబంధిత కార్డు పాన్‌ కార్డుతో అనుసంధానం కానట్లు తేలితే ఇకపై కొత్త వర్చువల్‌ పాన్‌ నంబర్‌ కేటాయిస్తారు. ఇకపై అదే పాన్‌ నంబర్‌ కానుంది. పాన్‌ కార్డు లేనివారికీ ఒక విధంగా ఉపయోకరం. అదే వారికి పాన్‌ నంబర్‌ కానుంది. అయితే, ఆధార్‌తో పాన్‌ కార్డు అనుసంధానం కాని వాటిని తొలుత తాత్కాలికంగా నిలుపుదల చేస్తామని, ఒకసారి అనుసంధానం చేశాక వాటిని పునరుద్ధరించుకోవచ్చని ఓ అధికారి తెలిపారు. అలా చేయని పక్షంలో శాశ్వతంగా తొలగిస్తామని పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశంలో 40 కోట్ల పాన్‌ కార్డులు ఉండగా… 22 కోట్లు మాత్రమే ఆధార్‌తో అనుసంధానం చేసి ఉన్నాయి. మిగిలిన 18 కోట్ల పాన్‌ కార్డులు లింక్‌ చేయాల్సి ఉంది. ఈ రెండింటి అనుసంధానం కేంద్రం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఆధార్‌తో అనుసంధానం చేయకుంటే అవి నకిలీగా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే వీటి అనుసంధానం తప్పనిసరిచేసింది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly