క్రెడిట్ కార్డును విడుదల చేసిన పేటీఎం..

ఈ కార్డు ద్వారా చేసే ప్రతి కొనుగోలుపై ఎలాంటి పరిమితులు లేకుండా ఒక శాతం నగదు ప్రతి నెలా మీ కార్డులో జమ అవుతుంది

క్రెడిట్ కార్డును విడుదల చేసిన పేటీఎం..

పేటీఎం వినియోగదారులకు శుభవార్త. క్రెడిట్ కార్డు వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని, దాని నెలవారీ క్రియాశీల వినియోగదారుల సంఖ్యను పెంచుకునే ఉద్దేశంతో దిగ్గజ డిజిటల్ సర్వీసుల సంస్థ అయిన పేటీఎం కొత్తగా “పేటీఎం ఫస్ట్ కార్డు” పేరుతో క్రెడిట్ కార్డును విడుదల చేసింది. దీని కోసం సిటీ బ్యాంకుతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కార్డు ద్వారా చేసే ప్రతి కొనుగోలుపై ఎలాంటి పరిమితులు లేకుండా ఒక శాతం నగదు ప్రతి నెలా మీ కార్డులో జమ అవుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి ఈ క్రెడిట్ కార్డు ద్వారా రూ. 100 ఖర్చు చేసినట్లయితే, అతను రూ. 1ని నగదు రూపంలో తిరిగి పొందుతాడు. ఇది కాంటాక్ట్ లెస్ క్రెడిట్ కార్డు. దీనిని ప్రపంచంలో ఎక్కడైనా వినియోగించవచ్చు. ఈ కార్డుకి రూ. 500 వార్షిక రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఒకవేళ మీరు ఈ కార్డు ద్వారా సంవత్సరానికి కనీసం రూ. 50000 ఖర్చు చేసినట్లయితే, వార్షిక రుసుముపై పూర్తి మినహాయింపు లభిస్తుంది. దేశంలోనే అతిపెద్ద డిజిటల్ వ్యాలెట్ సర్వీసుల సంస్థ అయిన పేటీఎం ప్రస్తుతం 300 మిలియన్ల మంది వినియోగదారులని కలిగి ఉంది. అందులో 150 మిలియన్ల మంది క్రియాశీల వినియోగదారులు ఉన్నారు. కొత్తగా క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టడం ద్వారా ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతుందని పేటీఎం అంచనా వేస్తుంది. అలాగే పేటీఎం ఫస్ట్ క్రెడిట్ కార్డును కనీసం 25 మిలియన్ల మంది వినియోగదారులు తీసుకునే అవకాశం ఉందని సంస్థ అంచనా వేస్తుంది. కార్డు ఫీచర్స్ పేటీఎం యాప్ పై కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే పేటీఎం యాప్ ద్వారా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇది క్యాష్ బ్యాక్ ను అందించే మొట్టమొదటి క్రెడిట్ కార్డని, అలాగే కనీసం 20 నుంచి 25 మిలియన్ క్రెడిట్ కార్డులను వినియోగదారులను అందించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వన్97 కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ శేఖర్ శర్మ తెలిపారు.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly