ఇకపై మరింత సులభంగా పేటీఎం చెల్లింపులు...

ఇప్పుడు పేటీఎం వినియోగదారులు ఏదైనా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి సులభంగా చెల్లించవచ్చు

ఇకపై మరింత సులభంగా పేటీఎం చెల్లింపులు...

భారతదేశపు ప్రముఖ డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ ఫారం పేటీఎం తమ వినియోగదారుల కోసం సరికొత్త చెల్లింపు విధానాన్ని ప్రవేసపెట్టింది. ఇప్పుడు పేటీఎం వినియోగదారులు ఏదైనా క్విక్ రెస్పాన్స్ (క్యూఆర్) కోడ్‌ను స్కాన్ చేసి సులభంగా చెల్లింపులు చేయవచ్చు. డిజిటల్ చెల్లింపులపై అవగాహన కలిగిన, అలాగే నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి డబ్బును పొందాలనుకునే చిన్న కిరానా దుకాణదారులకు ఇది ప్రయోజనం చేకూరుస్తుంది.

పేటీఎం క్యాష్ ను అనుమతించే దుకాణాల వద్ద తమ వినియోగదారులు వారికి ఇష్టమైన చెల్లింపు పద్ధతిని ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పించాలని ఎల్లప్పుడూ మేము కోరుకుంటామని, ఇప్పుడు ఇంటరోపెరబుల్ యూపీఐ సహాయంతో వినియోగదారులు పేటీఎం యాప్ ద్వారా ఏదైనా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తక్షణ చెల్లింపులు చేసే సౌలభ్యాన్ని పొందుతారని పేటీఎం సీనియర్ ఉపాధ్యక్షుడు దీపక్ అబోట్ తెలిపారు.

చాలా మంది వినియోగదారులు తమ బ్యాంక్ ఖాతాలను పేటీఎం యూపీఐతో లింక్ చేసుకొని, దగ్గరలోని దుకాణాలు, రెస్టారెంట్లు, పెట్రోల్ బంకులు, ఫార్మసీలు, ఆసుపత్రులు మొదలైన వాటిలో సౌకర్యవంతంగా చెల్లింపులు చేస్తున్నారు. వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి భవిష్యత్తులో కొత్త ఆలోచనలతో ముందుకు వస్తూ, క్రొత్త ఫీచర్స్ ను అందిస్తామని దీపక్ తెలిపారు.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly