సంపద నిర్వహణ వ్యాపారంలోకి పేటీఎమ్!

డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎమ్ సంపద నిర్వహణ వ్యాపారంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమైంది

సంపద నిర్వహణ వ్యాపారంలోకి పేటీఎమ్!

భారత్ దేశపు అతి పెద్ద డిజిటల్ ప్రెమెంట్స్ సంస్థ పేటీఎమ్ సంపద నిర్వహణ వ్యాపారంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ విషయమై వివిధ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ఏఎమ్‌సీ) లతో అనుసంధానం అయ్యే చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సంస్థ ‘పేటీఎమ్ మనీ’ పేరిట త్వరలో ఒక ఆప్ ను ప్రారంభించనుంది. 12 ఏఎమ్‌సీల‌తో మొదలు పెట్టి 25 ఏఎంసీ లకు ఇది పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సంస్థ కొన్ని రిజిస్ట్రేషన్లు స్వీకరించింది. దీనిలో నూటికి నూరు శాతం రిటైల్ వినియోగదారుల నుంచి వచ్చినట్టు, 90 శాతం మొబైల్ వినియోగించే వారి నుంచి వచ్చినట్టు సంస్థ తెలిపింది. మొబైల్ ద్వారా ఆర్ధిక వ్యవహారాలు చేసే వాళ్ళు పెరిగినట్టు తెలిపేందుకు
ఇది సంకేతమ‌ని బావించొచ్చు.

మ్యూచువల్ ఫండ్ల‌ తో మొదలు పెట్టనున్నట్లు సంస్థ తెలియజేసింది. దీన్నిభౌతికంగా పంపిణీదారులు లేని చోటకు తీసుకెళ్లడమే ప్ర‌ధాన ఉద్దేశంగా పేటీఎమ్ భావిస్తోంది. ముఖ్యంగా ఇందులో డైరెక్ట్ ప్లాన్స్ అందించడం వల్ల మదుపరులకు రెగులర్ ప్లాన్స్ అందించే ఇతర పంపిణీదారులు, మధ్యవర్తులకంటే 1-1.5 శాతం అధిక రాబడవచ్చే అవకాశం ఉంటుంది.

పేటీఎం మ‌నీ అప్లికేష‌న్ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ప్లాట్‌ఫారాలపై ల‌భిస్తుంది. ఇప్ప‌టికే పేటీఎంకి చాలా మంది వినియోగ‌దారులు ఉన్నారు. సంపద నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి మ‌దుప‌రులకు నాణ్య‌మైన సేవ‌లు ల‌భించే అవ‌కాశం ఉంది. అయితే అంత‌కుముందు ఈ యాప్ విశ్వ‌స‌నీయ‌త‌ను పెంపొందించుకోవాల్సి ఉంటుంద‌ని నిపుణులు అంటున్నారు.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly