పీఎఫ్ వెనక్కి తీసుకోవడానికి ఈపీఎఫ్ఓ నుంచి ప్రత్యేక ఆన్లైన్ సదుపాయం

ఈ పధ్ధతి లో ఆన్లైన్ లో ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు

పీఎఫ్ వెనక్కి తీసుకోవడానికి ఈపీఎఫ్ఓ నుంచి ప్రత్యేక ఆన్లైన్ సదుపాయం

లాక్ డౌన్ ని దృష్టి లో పెట్టుకుని ఈపీఎఫ్ఓ సంస్థ పీఎఫ్ మొత్తాన్ని వెనక్కి తీసుకోవడానికి ప్రత్యేక సదుపాయాన్ని కల్పిస్తోంది. అత్యవసర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కేవలం 3 రోజుల్లోనే పీఎఫ్ మొత్తం వెనక్కి వచ్చే ల సౌకర్యం కల్పిస్తోంది. అయితే, దీని కోసం యూఏఎన్ తో ఆధార్ లింక్ అయి ఉండడం తప్పనిసరి. ఈ కింది పధ్ధతి లో ఆన్లైన్ లో ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.

  1. యూఏఎన్ పోర్టల్ కి వెళ్లి మీ లాగిన్ ఐడి, పాస్వర్డ్ తెలియపరచండి.
  2. ఆన్లైన్ సర్వీసెస్ మీద క్లిక్ చేసి, క్లెయిమ్ ఫారం క్లిక్ చేయండి.
  3. మీ వివరాలు చూడవచ్చు. ఇప్పుడు మీ బ్యాంకు ఖాతా లో చివరి 4 అక్షరాలు తెలుపండి.
  4. తరవాత ఆన్లైన్ క్లెయిమ్ చేసుకోవచ్చు.
  5. పీఎఫ్ అడ్వాన్స్ ఫారం 31 ఎంచుకుని మీరు పీఎఫ్ వెనక్కి తీసుకునే కారణం తెలుపండి.
  6. గరిష్టంగా 75 శాతం వరకు వెనక్కి తీసుకోవచ్చు.

ఈ ప్రక్రియ పూర్తి చేసాక పీఎఫ్ మొత్తం నేరుగా మీ బ్యాంకు ఖాతా లోకి జమ అవుతుంది. అయితే, అత్యవసరం అయితే తప్ప ఈ మొత్తం వెనక్కి తీసుకోక పోవడమే మంచిది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly