పన్ను ఆదా చేసే పెట్టుబడులకు ఇదే సరైన సమయం

పన్ను ఆదా చేసేందుకు పెట్టుబడులను ఆర్థిక సంవత్సరం మొదటినుంచే ప్రారంభించాల్సి ఉంటుంది

పన్ను ఆదా చేసే పెట్టుబడులకు ఇదే సరైన సమయం

పన్ను మినహాయింపు కోసం పెట్టుబడులు పెట్టేందుకు ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే సరైన సమయం. ఆలా కాకుండా వాయిదా వేస్తే చివర్లో హడావిడిలో ఎదో ఒకదానిలో పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడే మీ ఆర్థిక లక్ష్యాలకు తగినట్లుగా సరైన పెట్టుబడులను ఎంచుకోండి.

సెక్షన్ 80సి కింద ఎంత పన్ను మినహాయింపు లభిస్తుంది ?
సెక్షన్ 80సి తో రూ . 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. పీపీఎఫ్, ఎన్పీస్ , ఈపీఎఫ్ , ఈఎఎల్ఎస్ఎస్ ,పిల్లల ట్యూషన్ ఫీజు , గృహ రుణ చెల్లింపు ఫై పన్ను ఆదా చేసుకోవచ్చు. మీకు దీని గురించి పూర్తిగా అవగాహన ఉంటే సరైన పెట్టుబడులు సాధ్యమవుతాయి. ఉదాహరణకు ఒక ఉద్యోగి రూ . 70,000 గృహ రుణంగా చెల్లిస్తున్నాదాను కుందాం. ట్యూషన్ ఫీజు రూ. 20,000. మొత్తం కలిపి రూ. 90,000 సెక్షన్ 80సి కింద మినహాయింపు లభిస్తుంది. అదేవిధంగా ప్రతినెలా ఈపీఎఫ్ కోసం కొంత కేటాయిస్తుంటే 2020 ఆర్థిక సంవత్సరానికి రూ.20,000 అనుకుంటే ఇంకా సెక్షన్ 80సి కింద రూ 40,000 మినహాయింపు లభిస్తుంది. ఈ రూ.40,000 వివిధ రకాలుగా పెట్టుబడులు పెటుకోవచ్చు. పన్ను శ్లాబు ఆధారంగా ఈ ఆర్థిక సంవత్సరానికి రూ . 46,800 ( రూ .1. 50 లక్షలపై 30 శాతం ) వరకు ఆదా చేసుకోవచ్చు .

పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు:
పన్ను చెల్లింపుదారులకు లిక్విడిటీ అనేది కీలక అంశం. కేవలం పన్ను ఆదా కోసం పెట్టుబడులను ఎంచుకోకూడదు . మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు ఉండాలి. పన్ను ఆదా కోసం పెట్టుబడులను ఎంచుకునేముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన కొన్ని అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం …

రిస్క్:
ఈఎల్ఎస్ఎస్ , యులిప్స్ లో పెట్టుబడులు చాలా రిస్క్ తో కూడుకున్నవి . వీటి రాబడి స్టాక్ మార్కెట్లపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ పెట్టుబడులు పెట్టేముందు రిస్క్ గురించి ఆలోచించాలి. నష్టాన్ని తట్టుకోగలిగే శక్తి ఉంటే నిర్ణయం తీసుకోవచ్చు. అయితే ఇందులో వచ్చే రాబడులు సెక్షన్ 80సి కింద వర్తించే కొన్ని పెట్టుబడుల కంటే ఎక్కువగా ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి. అంటే రిస్క్ తో పటు రాబడి కూడా ఎక్కువగానే ఉంటుంది .

రాబడి అంచనా:
రాబడి విషయానికి వచ్చేసరికి సంప్రదాయ పెట్టుబడులు పీపీఎఫ్ , ఎన్ఎస్సి, ఎఫ్డీ ల రాబడి తక్కువగా ఉంటుంది. డెట్ ఫండ్లు , యులిప్స్ , ఎన్పీఎస్ ఇంకాస్త మెరుగైన రాబడిని అందిస్తాయి. ఈఎల్ఎస్ఎస్ లో రిస్క్ తో పాటు అధిక రాబడినిచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇందులో సిప్ ద్వారా పెట్టుబడులు పెడితే మంచి ఫలితాలను ఆశించవచ్చు.

పన్ను:
పెట్టుబడుల నుంచి వచ్చిన రాబడిపై శ్లాబు ప్రకారం పన్ను వర్తిస్తుంది. పన్ను ఆదా చేసే పథకాలైన పీపీఎఫ్, బీమా , యులిప్స్, సుకన్య సమృద్ధి యోజన వంటి వాటిపై పన్ను ఉండదు. ఈఎల్ఎస్ఎస్, పెన్షన్ ప్లాన్, ఎన్పీ ఎస్ ఫై పాక్షికంగా పన్ను ఉంటుంది. ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ , ఎన్ఎస్సి , సీనియర్ సిటిజెన్ సేవింగ్ స్కీమ్స్ ఫై పూర్తిగా పన్ను ఉంటుంది.

లిక్విడిటీ:
పన్ను ఆదా చేసే పథకాలలో పెట్టుబడులు చేసినపుడు కొన్నింటిలో లాక్ ఇన్ పీరియడ్ ఎక్కువ కాలం ఉంటుంది. మీ పోర్ట్ఫోలియో లిక్విడిటీ , పొదుపు , రాబడుల సమ్మేళనంగా ఉండాలి. పన్ను మినహాయింపులు కోసం దీర్ఘ కాలం లాక్ ఇన్ పీరియడ్ ఉన్న పథకాలను ఎంచుకుంటే లిక్విడిటీ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది . సమయానికి డబ్బు ఉన్న ఉపయోగపడకపోతే లాభం ఉండదు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly