పోస్టాఫీసు ఏటీఎమ్ కార్డు లావాదేవీలు-వ‌ర్తించే ఛార్జీలు

పోస్టాఫీసు ఏటీఎమ్ కార్డు ద్వారా రోజుకు రూ. 25 వేల వ‌ర‌కు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు

పోస్టాఫీసు ఏటీఎమ్ కార్డు లావాదేవీలు-వ‌ర్తించే ఛార్జీలు

పోస్టాఫీసుగా ప్ర‌సిద్ధి పొందిన భార‌తీయ త‌పాలా శాఖ, పొదుపు ఖాతాతో పాటు రిక‌రింగ్ డిపాజిట్ (ఆర్‌డీ), ప‌బ్లిక్ ప్రావిడెండ్ ఫండ్‌(పీపీఎఫ్‌), కిసాన్ వికాస్ ప‌త్రా, మంత్లీ ఇన్‌క‌మ్ స్కీమ్ ఖాతా(ఎమ్ఐఎస్‌), సుక‌న్య స‌మృద్ధి యోజ‌న‌, ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతా, సీనియ‌ర్ సిటిజ‌న్స్ సేవింగ్స్ స్కీమ్‌(ఎస్‌సీఎస్ఎస్‌) వంటి వివిధ పొదుపు ప‌థ‌కాల‌ను అందుబాటులో ఉంచింది. పోస్టాఫీస్ పొదుపు ఖాతాతో పాటు ఏటీఎమ్ కార్డు సౌక‌ర్యాన్ని అందిస్తుంది. అయితే ఈ కార్డుల‌పై చేసే విత్‌డ్రాల‌కు, లావాదేవీల‌కు కొన్ని ప‌రిమితులు ఉన్నాయి. ఇండియా పోస్ట్ వెబ్‌సైట్ indiapost.gov.in ప్రకారం, పోస్టాఫీసు పొదుపు ఖాతా డిపాజిట్ల‌పై వార్షికంగా 4శాతం వడ్డీ చెల్లిస్తుంది.

పోస్టాఫీసు ఏటీఎమ్ కార్డు స‌దుపాయం గురించి తెలుసుకోవ‌ల‌సిన 10 ముఖ్య విష‌యాలు

  1. ఇండియా పోస్ట్ వెబ్‌సైట్ ప్రకారం, పోస్టాఫీసు ఏటీఎమ్ కార్డు ద్వారా రోజుకు రూ. 25 వేల వ‌ర‌కు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.
  2. ఒకే లావాదేవీలో పోస్టాఫీసు ఏటీఎమ్ కార్డు ద్వారా గ‌రిష్టంగా రూ. 10 వేల వ‌ర‌కు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.
  3. ఇండియా పోస్ట్, తన ఖాతాదారుల‌కు అన్ని పోస్ట్ ఆఫీస్ ఏటీఎమ్‌లలో ఉచిత లావాదేవీలను అందిస్తుంది.
  4. పోస్టాఫీసు ఏటీఎమ్ కార్డు ద్వారా ఖాతాదారులు అన్ని పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ ఏటీఎమ్‌లలో ఉచిత లావాదేవీల‌ను నిర్వ‌హించ‌వ‌చ్చు.
  5. పోస్టాఫీసు ఏటీఎమ్ కార్డును ఉప‌యోగించి మెట్రో న‌గరాల‌లో ఇత‌ర బ్యాంకు ఏటీఎమ్‌ల వ‌ద్ద మూడు ఉచిత లావాదేవీల‌ను నిర్వ‌హించ‌వ‌చ్చు.
  6. పోస్టాఫీసు డెబిట్ కార్డును ఉప‌మోగించి నాన్-మెట్రో న‌గరాల‌లోని ఇత‌ర బ్యాంకు ఏటీఎమ్‌ల వ‌ద్ద 5 ఉచిత లావాదేవీల‌ను నిర్వ‌హించేంద‌కు పోస్టాఫీస్ అనుమ‌తిస్తుంది.
  7. మెట్రోతో పాటు నాన్ మెట్రో న‌గ‌రాల‌కు నిర్ధేశించిన ప‌రిమితులు అన్ని ఆర్థిక‌, ఆర్థికేత‌ర లావాదేవీల‌కు వ‌ర్తిస్తాయి.
  8. ఇత‌ర బ్యాంకు ఏటీఎమ్‌ల వ‌ద్ద నిర్దేశించిన ప‌రిమితుల‌కు మించి చేసే అన్ని ఆర్థిక‌, ఆర్థికేత‌ర లావాదేవీల‌పై అద‌న‌పు చార్జీలు వ‌ర్తిస్తాయి.
  9. ఇత‌ర బ్యాంకు ఏటీఎమ్‌ల వ‌ద్ద నిర్దేశించిన లావాదేవీల‌కు మించి చేసే ప్ర‌తీ ఆర్థిక లావాదేవీపై రూ.20+జీఎస్‌టీ(వ‌స్తు సేవ‌ల ప‌న్ను) వ‌ర్తిస్తుంది.
  10. ఇత‌ర బ్యాంకు ఏటీఎమ్‌ల వ‌ద్ద నిర్దేశించిన లావాదేవీల‌కు మించి చేసే ప్ర‌తీ ఆర్థికేత‌ర‌ లావాదేవీపై రూ.8+జీఎస్‌టీ వ‌ర్తిస్తుంద‌ని ఇండియా పోస్ట్ తెలిపింది.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly