మీపై ద్ర‌వ్యోల్బ‌ణ ప్ర‌భావం ఉండ‌కూడ‌దంటే ఈ 5 చిట్కాలు

ద్రవ్యోల్బణం.. ధరల పెరుగుద‌ల‌తో పాటు, మీ జీవన ప్రమాణాలు, పొదుపుపై కూడా ప్ర‌భావం చూపుతుంది

మీపై ద్ర‌వ్యోల్బ‌ణ ప్ర‌భావం ఉండ‌కూడ‌దంటే ఈ 5 చిట్కాలు

అక్టోబర్‌లో ద్రవ్యోల్బణం 4.62 శాతానికి పెరగడం మ‌దుప‌ర్లకు నిరాశ‌కు గురిచేసింది. ద్రవ్యోల్బణంతో, ధరల పెరుగుద‌ల‌తో పాటు, మీ జీవన ప్రమాణాలు, పొదుపుపై కూడా ప్ర‌భావం ప‌డుతుంది. ద్రవ్యోల్బణం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఈ ఐదు మార్గాలను పాటించ‌డండి

దీర్ఘ‌కాలిక ఫిక్స్‌డ్ డిపాజిట్లు:
ఎప్పుడైనా దీర్ఘ‌కాలం పెట్టుబ‌డులు కొన‌సాగిస్తే మంచి లాభాలు వ‌స్తాయ‌న్న న‌మ్మ‌కం ఉంటుంది. అయితే ద్ర‌వ్యోల్బ‌ణం కార‌ణంగా వ‌చ్చిన రాబ‌డి త‌గ్గుతుంది. దీర్ఘ‌కాల పెట్టుబ‌డుల‌పై రాబ‌డి ఆశించ‌డంలో త‌ప్పులేదు. ఉదాహ‌ర‌ణ‌కు ప‌దేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 6.75 శాతం వ‌డ్డీ వ‌స్తే, మీరు గ‌రిష్ఠ‌ ప‌న్ను శ్లాబ్‌లో (స‌ర్ ఛార్జ్‌లు మిన‌హాయించి 31.2 శాతం ప‌న్ను) ఉంటే… అది 4.64 శాతానికి త‌గ్గుతుంది. ఆ త‌ర్వాత ప్ర‌స్తుతం ఉన్న ద్ర‌వ్య‌ల్బ‌ణం తీసివేయ‌గా చివ‌రికి మీకు ల‌భించే రాబ‌డి 0.02 శాతం. దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డుల‌కు క‌నీసం 1 శాతం కంటే ఎక్కువైనా రాబ‌డి ఉండాలి. తక్కువ రిస్క్ ఉన్న ప‌థ‌కాల‌లో ఎక్కువ కాలం పొదుపు చేసిన‌ప్ప‌టికీ ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగితే రాబ‌డి త‌గ్గుతుంది.

అద్దెపై ద్ర‌వ్యోల్బ‌ణ ప్ర‌భావం ప‌డ‌కూడ‌దంటే:
మీరు ఇంటి య‌జ‌మానులు అయితే అద్దె ఒప్పందం ప్ర‌కారం, ఒక‌టి కంటే ఎక్కువ సంవ‌త్స‌రాల‌కు ఒకే ర‌క‌మైన అద్దెను కొన‌సాగిస్తే ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగిన‌ప్పుడు మీరు న‌ష్ట‌పోతారు. ద్రవ్యోల్బణ ప్ర‌భావాన్ని త‌గ్గించుకునేందుకు మీ అద్దె ఒప్పందంలో పెరుగుదల నిబంధనను చేర్చండి. ఇక అద్దెదారుల విష‌యానికొస్తే, వస్తువుల ధరలు పెరగడంతో, మీరు మీ అద్దె ఖర్చు త‌క్కువ‌గా ఉండాల‌నుకుంటారు. కానీ అది కుద‌ర‌క‌పోవ‌చ్చు. కానీ ద్ర‌వ్యోల్బ‌ణం తక్కువ‌గా ఉన్న‌ప్పుడు కూడా అద్దె పెంచితే య‌జ‌మానితో చ‌ర్చించి అద్దె త‌క్కువ‌గా కొన‌సాగించాల‌ని కోర‌వ‌చ్చు.

పెట్టుబ‌డి ఆప్ష‌న్‌గా ఈక్విటీలు:
దీర్ఘకాలిక ఈక్విటీల నుంచి వచ్చే రాబడి కార్పొరేట్ ఆదాయాలతో ముడిపడి ఉంటుంది. అప్పుడు వ‌స్తువులు, సేవ‌ల ధ‌ర‌లు పెరిగిన‌ప్ప‌టికీ ద్ర‌వ్యోల్బ‌ణానికి త‌గిన‌ ఆదాయం స‌ర్దుబాటు అవుతుంది. దీర్ఘ‌కాలంలో , ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగిన‌ప్ప‌టికీ మీపై అంత‌గా ప్ర‌భావం ఉండ‌దు. స్వ‌ల్పకాలానికి అయితే మార్కెట్ల హెచ్చుత‌గ్గుల కార‌ణంగా రాబ‌డిని ఆశంచ‌లేం. అందుకే క‌నీసం ఐదేళ్లు పెట్టుబ‌డులు కొన‌సాగించాలి.

బంగారం, అంత‌ర్జాతీయ పెట్టుబ‌డులు:
బంగారం పెట్టుబ‌డులు దీర్ఘ‌కాలంలో ద్ర‌వ్యోల్బ‌ణానికి అనుగుణంగా రాబ‌డినిస్తాయి. ఈ విలువైన లోహ స‌ర‌ఫ‌రా ప‌రిమితంగా ఉంటుంది. అందువల్ల దాని ధర ఆర్థిక వ్యవస్థలో సాధారణ ధరల పెరుగుదలతో పాటు పెరుగుతుంది. అయితే మీ పోర్ట్‌ఫోలియోలో 10 శాతానికంటే ఎక్కువ‌గా బంగారానికి కేటాయించ‌వ‌ద్దు. అంత‌ర్జాతీయ స్టాక్ మార్కెట్లు లేదా మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు, ద్ర‌వ్యోల్బ‌ణానికి అతీతంగా మంచి రాబ‌డిని ఇస్తాయి. ఎందుకంటే ఈ పెట్టుబ‌డులు విదేశీ కరెన్సీతో ముడిప‌డి ఉంటాయి. భారతదేశంలో ద్రవ్యోల్బణం, విదేశీ ద్రవ్యోల్బణాన్ని మించినప్పుడు రూపాయికి వ్యతిరేకంగా విదేశీ కరెన్సీల విలువ పెరుగుతుంది.

మీ గృహ రుణం ముంద‌స్తు చెల్లింపులు:
వడ్డీ రేట్లు, పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అనుసరిస్తాయి. అందువల్ల వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు మీ గృహ రుణం పెరుగుతుంది. అయితే ఆర్‌బీఐ. గృహ రుణ రేట్ల‌ను ఆర్‌బీఐ రేట్ల‌తో అనుసంధానం చేయాల్సిందిగా కోరింది. గృహ రుణ మందుస్తు చెల్లింపులతో అధిక వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించుకునే అవ‌కాశం ఉంటుంది. కానీ, ముంద‌స్తు చెల్లింపు రుసుములు వ‌ర్తిస్తాయి, దీంతో పాటు ప‌న్ను ప్ర‌యోజ‌నాలు త‌గ్గుతాయ‌ని గుర్తుంచుకోండి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly