నిపుణులు ఇచ్చిన సమాధానాలు

నా వ‌య‌సు 57ఏళ్లు. మ‌రో 32 నెల‌ల్లో రిటైర్ కాబోతున్నాను. అల్ట్రా షార్ట్ ట‌ర్మ్‌ డెట్ ఫండ్ల‌లో లంప్‌స‌మ్‌గా 3ఏళ్ల‌లోపు అవ‌స‌రాల‌కు రూ.35ల‌క్ష‌ల‌ను పెడ‌దామ‌నుకుంటున్నాను. పెట్టుబ‌డి వృద్ధిని, 7 లేదా 8శాతం రాబ‌డిని ఆశించ‌వ‌చ్చా? అల్ట్రా షార్ట్ ట‌ర్మ్ డెట్ ఫండ్ల‌లో చాలా త‌క్కువ రిస్క్ ఉంటుంద‌ని విన్నాను. మా భార్య గృహిణి. ఆమె పేరిట రూ.40ల‌క్ష‌లు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశాను. దీని పై ప‌న్ను విధిస్తారా లేదా తెలుప‌గ‌ల‌రు.

ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత కోసం ఆర్థిక ప్ర‌ణాళిక రూపొందించుకోవ‌డాన్ని అభినందిస్తున్నాం. 1. అల్ట్రా షార్ట్ ట‌ర్మ్ ఫండ్ల‌లో 6 నుంచి 9 నెల‌ల కాలంలో అద‌న‌ప...

నా పేరు శివ‌. నేను టెక్స్‌టైల్ వ్యాపారం చేస్తున్నాను. నెల‌కు సుమారు రూ.లక్ష దాకా ఆదాయం వ‌స్తుంది. ప్ర‌స్తుతం నా వ‌ద్ద‌ అయిదు ఎల్ఐసీ పాల‌సీలు ఉన్నాయి... అవి... 1. జీవ‌న్ ఆనంద్‌-149 - - 28/10/2004 న ప్రారంభించాను. బీమా హామీ సొమ్ము రూ.2ల‌క్ష‌లు 2. జీవ‌న్ ఆనంద్-149 - - 22/04/2009 న ప్రారంభించాను. బీమా హామీ సొమ్ము రూ.6 ల‌క్ష‌లు 3. మ‌నీ బ్యాక్‌-93 --- 23/04/2009న ప్రారంభించాను. బీమా హామీ సొమ్ము రూ.5ల‌క్ష‌లు 4. న్యూ బీమా గోల్డ్‌(మ‌నీ బ్యాక్‌)-179 ప్లాన్‌ -- 12/04/2012న ప్రారంభించాను. బీమా హామీ సొమ్ము రూ.5ల‌క్ష‌లు 5. జీవ‌న్ స‌ర‌ళ్‌-165 ప్లాన్ ---- 21/07/2010న ప్రారంభించాను. బీమా హామీ సొమ్ము రూ.1.25లక్ష‌లు పైన పేర్కొన్న పాల‌సీలు కాకుండా పోస్టాఫీసులో అయిదేళ్ల‌ రిక‌రింగ్ డిపాజిట్ చేస్తున్నాను. ఏడాదికి రూ.60వేలు జ‌మ‌చేస్తున్నాను. ఇప్ప‌టికి మూడున్న‌రేళ్లు పూర్త‌యింది. అన్ని ఎల్ఐసీ పాల‌సీల‌ను ర‌ద్దు చేసుకొని రూ.50ల‌క్ష‌ల విలువ చేసే రెండు కొత్త ఇ-ట‌ర్మ్ పాల‌సీల‌ను వేర్వేరు బీమా సంస్థ‌ల నుంచి తీసుకోవాల‌నుకుంటున్నాను. ఇది కాకుండా స్వ‌ల్ప‌కాల‌, దీర్ఘ‌కాల ల‌క్ష్యాల‌కు కొన్ని మిడ్ క్యాప్‌, లార్జ్ క్యాప్ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డిని ప్రారంభించాల‌నుకుంటున్నాను. పై విష‌యాల‌లో మీ సూచ‌న‌లు తెలుప‌గ‌ల‌రు.

సంప్ర‌దాయ బీమా ప‌థ‌కాల‌ను ర‌ద్దు చేసుకోవాల‌నే మీ నిర్ణ‌యం స‌రైన‌ది. దీర్ఘ‌కాలంలో వీటిపై వ‌చ్చే రాబ‌డి 6శాతానికి మించ‌దు. అయితే ఈ పాల‌సీల‌ను ర‌ద్దు చేస...

నా పేరు వి. కృష్ణారావు. వ‌య‌సు 30ఏళ్లు. బ్యాంకులో క్ల‌ర్క్‌గా చేస్తున్నాను. ఉద్యోగంలో చేరి 4ఏళ్లు అవుతోంది. ఉద్యోగం వ‌చ్చిన ఏడాదికే పెళ్లి అయిపోయింది. నేను ప్ర‌స్తుతం నెల‌కు రూ.30వేల వేత‌నం అందుకుంటున్నాను. మాకు ఇద్దరు పిల్ల‌లు రెండేళ్ల పాప‌, ఏడాది వ‌య‌సున్న బాబు. మా సంస్థ రూ.3ల‌క్ష‌ల విలువ క‌లిగిన ఆరోగ్య బీమా అందిస్తోంది. మా సంస్థ నా పేరిట ఎన్‌పీఎస్ ఖాతాను తెరిపించారు. దీంట్లో నెల‌కు రూ.2500 పెట్టుబ‌డి పెడుతున్నాను. మా సంస్థ కూడా అంతే మొత్తం జ‌మ‌చేస్తోంది. నా పెట్టుబ‌డులు ఈ విధంగా ఉన్నాయి... 1. సుక‌న్య స‌మృద్ధి ఖాతాలో ఏటా రూ.50వేలు. పెళ్లి కోసం రూ.25ల‌క్ష‌లు జ‌మ‌చేయాల‌నే ల‌క్ష్యం పెట్టుకున్నాను. 2. నాకు, నా భార్య‌కు క‌లిపి అట‌ల్ పింఛ‌ను యోజ‌న‌ 3. ఎల్ఐసీ జీవ‌న్ ఆనంద్‌- సంవ‌త్స‌రానికి ప్రీమియం రూ.25,464. 20ఏళ్ల ప్రీమియం చెల్లించాక రూ.10ల‌క్ష‌లు చేతికందుతుంది. ఇది నా కొడుకు ఉన్న‌త చ‌దువుల‌కు కేటాయించాను. 4. చిట్ ఫండ్స్‌లో నెల‌కు రూ.6వేలు త్వ‌ర‌లోనే ఓ ట‌ర్మ్ పాల‌సీ తీసుకోవాల‌నుకుంటున్నాను. అది కాకుండా రూ.వెయ్యితో మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో సిప్ ప్రారంభించాల‌నుకుంటున్నాను. పెట్టుబ‌డుల విష‌యంలో త‌గిన సూచ‌న ఇవ్వ‌గ‌ల‌రు.

* మీ వ‌య‌సు 30ఏళ్లే కాబ‌ట్టి సిస్ట‌మెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా ఈక్విటీ ఓరియెంటెడ్ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డిని ప్రారంభించి క్ర‌మంగా పెట్...

అయిదేళ్ల పాటు నెల‌కు రూ.50వేలు పెట్టుబ‌డి పెట్టాల‌నుకుంటున్నాను. ఈక్విటీ, డెట్‌, బ్యాలెన్స్‌డ్ ఫండ్ల‌లో ఏ నిష్ప‌త్తిలో పెట్టుబ‌డి పెడితే బాగుంటుంది. డెట్ ఫండ్ల‌ను ఎంచుకోవాలా లేదా కేవ‌లం ఈక్విటీ, బ్యాలెన్స్‌డ్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి పెట్ట‌మంటారా? అయిదేళ్ల త‌ర్వాత లేదా 3-4 ఏళ్ల మ‌ధ్య‌లో రాబ‌డుల‌పై ప‌న్ను వ‌ర్తింపు ఏ విధంగా ఉంటుంది.? అలాగే కొన్ని లార్జ్‌, మిడ్ క్యాప్‌, బ్యాలెన్స్‌డ్ ఫండ్ల‌ను సూచించ‌గ‌ల‌రు.

పెట్టుబ‌డుల కేటాయింపు వ్య‌క్తి వ‌య‌సు, రిస్క్ తీసుకునే సామ‌ర్థ్యం, పెట్టుబ‌డి కాల‌వ్య‌వ‌ధిని బ‌ట్టి ఉంటుంది. ఈక్విటీ ఓరియెంటెడ్ మ్యూచువ‌ల్ ఫండ్లు దీర్...

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

షేర్ల‌ను ఎల‌క్ట్రానిక్ రూపంలో నిల్వ చేసుకునేందుకు అవసరమయ్యే ఖాతా ?

మీరేమంటారు?

మార్చి నెల చివ‌రినాటికి సెన్సెక్స్ 36,000 పాయింట్ల‌ను చేరుతుంద‌ని భావిస్తున్నారా?

80%
10%
10%