నిపుణులు ఇచ్చిన సమాధానాలు

సర్, నమస్కారం. నేను షేర్ మార్కేట్ లో పెట్టుబడి పెట్టాలంటే ఏం చేయాలి? ఎన్ని రూపాయల నుంచి పెట్టవచ్చు?

Asked by g.kumar on

షేర్ మార్కెట్ లో పెట్టుబడి వ్యక్తిగత నిర్ణయం. మీరు మీ అవసరం, వీలు, లక్ష్యాన్ని బట్టి పెట్టుబడులు పెట్టవచ్చు. షేర్ ఖాన్, ఐసీఐసీఐ డైరెక్ట్, జీరోధా లాంటి వాటిల్లో ఏదైనా ఒక బ్రోకర్ ని సంప్రదించి డీ మ్యాట్ ఖాతా తెరిచి పెట్టుబడులు ప్రారంభించవచ్చు. అయితే, మార్కెట్ లో నేరుగా పెట్టుబడులు పెడితే అధిక రిస్క్ ఉంటుంది. దీనికి సమయం, నైపుణ్యం అవసరం. దీని బదులు మీరు నెల నెలా సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు.

నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

ఈ రోజు రూ.10కే ల‌భించే వ‌స్తువు, మ‌రికొన్నేళ్ల‌కు రూ. 20 అవుతుంది. ఆర్థిక ప‌రిభాష‌లో ఈ ప్ర‌భావాన్ని ఏమంటారు?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%