నిపుణులు ఇచ్చిన సమాధానాలు

సర్, ఒకవేళ సుకన్య సమృద్ధి యోజన పధకం లో మదుపు చేస్తుండగా తండ్రి మరణిస్తే ఎలా? అలాగే, ఎల్ఐసి పాలసీ లో బీమా ఉంటుంది కదా?

Asked by p.sairam on

సుకన్య సమృద్ధి యోజన పధకం మధ్యలో అలంటి పరిస్థితి వచ్చినట్లయితే ముందస్తుగా ఖాతా ఆపివేయచ్చు. ఆ సమయం వరకు మదుపు చేసిన మొత్తానికి వడ్డీ కూడా అందుతుంది. కుటుంబం దీని మీద నిర్ణయం తీసుకోవచ్చు.

ఎల్ఐసి పాలసీ లో బీమా, రాబడి ఉంటుంది. అయితే, బీమా హామీ తక్కువ, రాబడి తక్కువ. ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉండడం మంచిది. ప్రత్యేకమైన టర్మ్ పాలసీ తీసుకుంటే సరైన బీమా మొత్తం పొందొచ్చు. ఇందులో మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.

పెట్టుబడి కోసం మ్యూచువల్ ఫండ్స్, పీపీఎఫ్, ఎన్పీఎస్ లాంటి పధకాలు మీ వీలు, రిస్క్ సామర్ధ్యాన్ని బట్టి ఎంచుకోవచ్చు.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

పోస్టాఫీసు రిక‌రింగ్ డిపాజిట్ కాలావధి ఎంత?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%