నిపుణులు ఇచ్చిన సమాధానాలు

డీమ్యాట్ ఖాతాను ఎలా తెరవాలి ? ఖాతా ఎలా నిర్వ‌హించాలి?

Asked by Ramesh on

షేర్లలో మదుపుచేయడానికి డిమ్యాట్ ఖాతా తో పాటు కొంత పరిజ్ఞానం, అవగాహన, సమయం ఉండాలి. ఒక్కొక్కసారి నష్టాలు రావచ్చు. డిమ్యాట్ కోసం మీ దగ్గర లో ఉన్న స్టాక్ బ్రోకర్ ను లేదా బ్యాంకు వారిని సంప్రదించండి. మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయడానికి డి-మ్యాట్ ఖాతా అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్లలో అనేక రకాలు ఉంటాయి. ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మదుపు మొదలు పెడితే కొంత అలవాటు అవుతుంది. ఇండెక్స్ ఫండ్లు ఒక ఇండెక్స్ ని అనుసరించి పెట్టుబడులు పెడతాయి కాబట్టి ఇండెక్స్ ఫండ్లలో ఇతర ఫండ్ల కంటే రిస్క్ తక్కువగా ఉంటుంది. దీని కోసం మీరు యు టి ఐ నిఫ్టీ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ లో మదుపు చేయండి. దీనిలో వ్యయ నిష్పత్తి తక్కువగా ఉంటుంది కాబట్టి, దీర్ఘకాలం అంటే పది సంవత్సరాలు చేస్తే మంచి రాబడి పొందవచ్చు.
ప్రతి సంవత్సరం మదుపు మొత్తాన్ని పెంచండి.
నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ యాప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగ్యులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది. కనీసం 10 ఏళ్ళ పాటు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయండి.

team siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

షేర్ మార్కెట్లో ప‌రోక్షంగా పెట్టుబ‌డి పెట్టేందుకు మ‌దుప‌ర్ల‌కు స‌హ‌క‌రించేవి ఏవి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%