నిపుణులు ఇచ్చిన సమాధానాలు

హాయ్ సిరి నా పేరు మధు నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడు ని. నాకు ఒక సంవత్సరం పాప ఉంది నేను నెలకు ఐదు వేల రూపాయలు మదుపు చేయాలనుకుంటున్నాను. అందుకోసం సుకన్య సమృద్ధి స్కీం లో నా లేక మ్యూచువల్ ఫండ్స్ లో నా అర్థం కావడం లేదు. నష్టభయం లేకుండా మంచి రాబడి వచ్చే స్కీం ఉంటే చెప్పండి.

Asked by Govuri madhu on

నష్టం లేని పధకాలు కావాలనుకుంటున్నాడు కాబట్టి మీరు సుకన్య సమృద్ధి యోజన పధకం ఎంచుకోవచ్చ్చు. ఇందులో మంచి రాబడి వస్తుంది. మీ అమ్మాయి చదువు, పెళ్లి ఖర్చులకు మంచి నిధి సమకూర్చుకోవచ్చు.

ఇతర లక్ష్యాల కోసం సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

ఈ రోజు రూ.10కే ల‌భించే వ‌స్తువు, మ‌రికొన్నేళ్ల‌కు రూ. 20 అవుతుంది. ఆర్థిక ప‌రిభాష‌లో ఈ ప్ర‌భావాన్ని ఏమంటారు?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%