నిపుణులు ఇచ్చిన సమాధానాలు

హాయ్ సిరి, నా వ‌ద్ద రూ.10 ల‌క్ష‌లు ఉన్నాయి. ఈ మొత్తంలో స్థ‌లం కొనుగోలు చేయాలా? లేదా దీర్ఘ‌కాల(15-20 సంవ‌త్స‌రాలు) రాబ‌డుల కోసం మ్యూచువల్ ఫండ్ల‌లో పెట్టాలా అనే సందిగ్ధంలో ఉన్నాను. ఏమిచేయాలో తెలుప‌గ‌ల‌రు.

Asked by Giridhar Yadav on

ముందుగా మీరు మీ ల‌క్ష్యాల‌ను గుర్తించండి. మీరు దీర్ఘ‌కాల రాబ‌డుల కోసం మ‌దుపు చేయాల‌నుకున్న‌ట్ల‌యితే ఈక్వీటీ మ్యూచువ‌ల్ ఫండ్లు మంచి ఎంపిక‌. 6 నుంచి 7 నెల‌ల కాలంలో మీ వ‌ద్ద ఉన్న మొత్తాన్ని సిప్ ద్వారా ఈక్వీటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి పెట్టంది. మీరు కొత్తగా పెట్టుబడి ప్రారంభిస్తున్నారు కాబట్టి సిప్ విధానంలో మీ నష్టభయం ప్రకారం ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి.

యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ లేదా ఐసీఐసీఐ పృ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ వ్యయ నిష్పత్తి చాలా తక్కువ, దీని వల్ల రాబడి కాస్త ఎక్కువగా ఉండవచ్చు. కనీసం 10 ఏళ్ళు మదుపు చేయడం మంచిది. ఈక్వీటీ ఫండ్లు అధిక రాబ‌డుల‌ను అందిస్తాయి.

స్థ‌లం కొనుగోలు చేస్తే: స్థ‌లం ఉన్న ఏరియా, అక్క‌డ జ‌రుగుతున్న అభివృద్ధి వంటి వాటి ఆధారంగా స్థ‌లం డిమాండ్ పెరుగుతుంది. కాబ‌ట్టి ఆయా వివ‌రాల‌ను బ‌ట్టి పెట్టుబ‌డి నిర్ణ‌యం తీసుకోవాలి.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

ఈ రోజు రూ.10కే ల‌భించే వ‌స్తువు, మ‌రికొన్నేళ్ల‌కు రూ. 20 అవుతుంది. ఆర్థిక ప‌రిభాష‌లో ఈ ప్ర‌భావాన్ని ఏమంటారు?

మీరేమంటారు?

బ్లాక్ చైన్ సాంకేతిక‌త వినియోగంతో ఆర్థిక కార్య‌క‌లాపాల్లో గుణాత్మ‌క‌మైన‌ మార్పులు తీసుకురావొచ్చ‌ని మీరు భావిస్తున్నారా?

80%
10%
10%