నిపుణులు ఇచ్చిన సమాధానాలు

స‌ర్ నేను విదేశంలో నివసిస్తున్నాను. నా నెల‌వారీ జీతం రూ.1.2 ల‌క్ష‌లు. నేను ప్ర‌స్తుతం శ్రీరామ్ చిట్స్‌లో నెల‌కి రూ.50 వేల చొప్పున రూ.20 ల‌క్ష‌ల చిట్టీ క‌డుతున్నాను. నాకు, మా నాన్న గారికి కోట‌క్ మ‌హీంద్రాలో రూ.1 ల‌క్ష విలువ చేసే రెండు బీమా పాల‌సీలు ఉన్నాయి. నేను మ‌రిన్ని పెట్టుబ‌డులు పెట్టాల‌నుకుంటున్నాను. నాకు త‌గిన స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌గ‌ల‌రు.

Asked by Indu Sekhar on

ప్ర‌స్తుతం మీకున్న బీమా క‌వ‌రేజీ చాలా త‌క్కువ. మీ వార్షికాదాయానికి 10 రెట్లు ఎక్కువ మొత్తానికి, 60 ఏళ్ల నుంచి ప్ర‌స్తుత మీ వ‌య‌సు తీసివేయ‌గా వ‌చ్చే కాల‌వ్య‌వ‌ధికి ట‌ర్మ్ పాల‌సీ తీసుకోండి. దీని కోసం మీరు ఐసీఐసీఐ ప్రు ప్రొటెక్ట్ స్మార్ట్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, మాక్స్ లైఫ్ లాంటి ప‌థ‌కాల‌ను ప‌రిశీలించండి. ఆన్‌లైన్ పాలసీలు చ‌వ‌క‌గా ఉంటాయి. పాల‌సీలు తీసుకునేట‌ప్పుడు బీమా కంపెనీకి మీకు సంబంధించిన‌ అన్ని వివ‌రాలివ్వండి.

చిట్ ఫండ్ పెట్టుబ‌డుల‌తో పాటు మీ వ‌ద్ద మిగిలిన మొత్తాన్ని మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో లార్జ్‌క్యాప్‌, బ్యాలెన్స్‌డ్ ఫండ్ల‌లో ఒక్కో ప‌థ‌కాన్ని ఎంచుకుని మ‌దుపు చేస్తే మంచిది.

ఈ క్రింద కొన్ని ప‌థ‌కాల వివ‌రాలున్నాయి. ప‌రిశీలించండి.

Table 3.jpg

దీంతో పాటుగా మీ ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం నిధిని ఏర్పాటు చేసుకోవ‌డానికి కూడా పెట్టుబ‌డులు పెట్ట‌డం మంచిది. నేష‌న‌ల్ పెన్ష‌న్ సిస్ట‌మ్‌లో ఖాతాను ప్రారంభించాల్సి ఉంటుంది. పెట్టుబ‌డులు ప్రారంభించేట‌ప్పుడు మొద‌ట‌గా 50 శాతం వ‌రకు ఈక్విటీ ప‌థ‌కాల‌లో పెట్టుబ‌డి పెట్టండి. త‌ర్వాత మీ ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు ద‌గ్గ‌ర‌కొచ్చేస‌రికి ఈ నిష్ప‌త్తిని క్ర‌మంగా త‌గ్గిస్తూ రండి. ఈక్విటీ ప‌థ‌కాల‌లో గ‌రిష్టంగా మ‌దుపు చేయ‌డం ద్వారా భ‌విష్య‌త్‌లో మీ పింఛ‌ను నిధి పెరిగే అవ‌కాశం ఉంటుంది.

Team Siri
Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

షేర్ మార్కెట్లో ప‌రోక్షంగా పెట్టుబ‌డి పెట్టేందుకు మ‌దుప‌ర్ల‌కు స‌హ‌క‌రించేవి ఏవి?

మీరేమంటారు?

బ్లాక్ చైన్ సాంకేతిక‌త వినియోగంతో ఆర్థిక కార్య‌క‌లాపాల్లో గుణాత్మ‌క‌మైన‌ మార్పులు తీసుకురావొచ్చ‌ని మీరు భావిస్తున్నారా?

80%
10%
10%