నిపుణులు ఇచ్చిన సమాధానాలు

హాయ్ సిరి, నేను రూ. 2వేలు సిప్ ద్వారా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఫండ్ లో మిగతా రూ. 1,000 హెచ్‌డీఎఫ్‌సీ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్‌లో పెడదాము అనుకుంటున్నాను నా నిర్ణయం మంచిది అయినా చెప్పగలరు.

Asked by శ్రీనివాస్. జి on

ఎబీఎస్ఎల్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఫండ్ లార్జ్ క్యాప్ ఫండ్‌. ఇందులో 80 శాతం పైన లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబ‌డి పెడ‌తారు. హెచ్‌డీఎఫ్‌సీ ఈక్వీటీ ఫండ్ అనేది ఎగ్ర‌సీవ్ హైబ్రీడ్ ఫండ్, 65 నుంచి 80 శాతం ఈక్వీటీలోనూ, మిగిలిన‌ది డెట్‌లో పెట్టుబ‌డి పెడ‌తారు. ఈ రెండు ప‌థ‌కాల‌లో సిప్ ద్వారా మీ పెట్టుబడుల‌ను ప్ర‌తీ సంవ‌త్స‌రం పెంచుకుంటూ ఉండాలి. ఈక్వీటీ మ్యూచువ‌ల్ ఫండ్లు దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డుల‌ను ఇస్తాయి. అయితే స్వ‌ల్ప‌కాలంలో అధిక ఒడిదుడుకులు ప్ర‌ద‌ర్శిస్తుంటాయి.

మ్యూచువల్ ఫండ్ పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతులుంటాయి. బ్రోకింగ్ కంపెనీలు, పంపిణీదారుల ద్వారా ఆఫ్లైన్ పద్ధతి(లేదా వారి ఆన్లైన్ వెబ్సైటు ద్వారా అయినా)లో మ్యూచువల్ ఫండ్డ్ సలహాదారుని ద్వారా పెట్టుబడి చేయవచ్చు. దీన్ని రెగ్యులర్ ప్లాన్ అంటారు. ఇందులో పంపిణీదారులు కొంత కమీషన్ తీసుకుంటారు.

అలా కాకుండా నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(ET Money, www.mfuindia.com, www.kuvera.in, myCAMS మొబైల్ అప్) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.

ప్రైవేట్ వెబ్సైటు/ఆప్ ద్వారా ఏమైనా ఇబ్బందులు ఎదురైతే నేరుగా ఫండ్ సంస్థ ని సంప్రదించి యూనిట్లను కొనసాగించడం లేదా విక్రయించడం చేయవచ్చు. మీ వీలు ప్రకారం ఏదైనా ఒక దాని ద్వారా మదుపు చేయండి.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

డివిడెంట్ అంటే ఏంటి?

మీరేమంటారు?

బ్లాక్ చైన్ సాంకేతిక‌త వినియోగంతో ఆర్థిక కార్య‌క‌లాపాల్లో గుణాత్మ‌క‌మైన‌ మార్పులు తీసుకురావొచ్చ‌ని మీరు భావిస్తున్నారా?

80%
10%
10%