నిపుణులు ఇచ్చిన సమాధానాలు

నా పేరు సిసిర్ కుమార్, నేను నెలకి 20000 వచ్చే జాబ్ లో జాయిన్ అయ్యాను, నెలకి ఒక 500 లేదా 1000 రూపాయల వరకు పొదుపు చెయ్యాలి అనుకుంటున్నా మ్యూచువల్ ఫండ్స్ లో 3 లేదా 5 సంవత్సరాల వరకు చేద్దాం అనుకుంటున్న, కొంచెం ఎక్కువ లాభం ,తక్కువ రిస్క్ ఉండేవి చెప్పండి, పేరెంట్స్ కి ఫ్యూచర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే వెంటనే తీయడానికి వీలు పడుతుందా? మరియు నా పేరెంట్స్ పేరు మీద (నాన్న60 సం, అమ్మ 45 సం) మ్యూచుల్ ఫండ్స్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లేదా lic లాంటివి తీసుకుంటే ఎక్కువ బెనిఫిట్ ఏమైనా ఉంటుందా?

Asked by Sisir kumar on

మ్యూచువల్ ఫండ్లలో రిస్క్ ఉంటుంది. కనీసం 10 ఏళ్ళ పాటు మదుపు చేసే ఉద్దేశం ఉంటే ఇందులో సిప్ ద్వారా మీ పేరు మీద మదుపు చేయండి. ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.

బీమా హామీ, పెట్టుబడి కలిపి ఉన్న పధకాల నుంచి దూరంగా ఉండండి. వీలయితే మీరు ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.

మీ పేరు మీద, అలాగే మీ తల్లిదండ్రుల పేరు మీద కూడా ఆరోగ్య బీమా పాలసీ కూడా తీసుకోవడం చాలా మంచిది. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే దానికి అదనంగా సూపర్ టాప్ అప్ పాలసీని తీసుకోవడం ద్వారా మరింత ప్రయోజనం పొందేందుకు వీలుంటుంది. మాక్స్ బూపా, అపోలో మునిచ్, స్టార్ హెల్త్ కంపెనీల పాలసీలు పరిశీలించండి.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

నిక‌ర ఆదాయ విలువ అంటే ఏంటి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%