నిపుణులు ఇచ్చిన సమాధానాలు

హాయ్ సిరి, నా పేరు వెంకట శివ నేను ఓక ప్రవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను నెలకు జీతం 24000/. అయితే నా ముందు రెండు లక్ష్యాలు ఉన్నాయి. ఓకటి మా బాబు (ప్రస్తుత వయస్సు 3 సం) ఇంజనీరింగ్ కోసం మరియు స్వతంగా మా ఊరిలో (స్వంత స్థలం 150 గజాల లో) ఇల్లు కట్టు కోవాలనీ. ప్రస్తుతానికి నేను SBI HYBRID EQUITY FUND -REG 100000/ (2 ఏళ్ళ క్రితం లంప్సమ్ లో మదుపు చేశాను) మరియు SBI Infrastructure Dir -G 5000/- (బంగారం పై రుణం తీసుకుని మదుపు చేసాను ఒకేసారి). ఇంకా సిప్ ల విషయానికీ వస్తే మొత్తం రూ. 4000/-నెలకీ క్రింది విధంగా విభజించి పెడుతున్నాను. ABSL Front Line Equity fund Dir Gr- 1000/-, అలాగే ICICI Nifty 50 Index Dir Gr - 1000, LT Mid cap Dir Gr -500, L&T India Value fund Dir Gr - 500, అలాగే TATA P/E Equity Dir Gr- 500 ఇంకా SBI Banking &Finance Dir Gr - 500. అంటే మొత్తం నెలకి 4000/- సిప్ లో మదుపు చేస్తున్నాను. ఇంక అత్యవసర నిధి కోసం ICICI Pru Liquid Fund లో 15000/- మరియు ICIC pru Blue chip Dir Gr 10000/- ఉంచాను. అలాగే LIC Bima Diamond Gold (841) బీమా హామీ రూ. 160000/- మనీ బ్యాక్ పధకం 4 ఏళ్ళకి ఒకసారి 15% (Sum assured) రూపం లో డబ్బు వెనక్కి వస్తుంది. సార్, నేను నా లక్ష్యాలను చేరుకోవడానికి నేను పైన చెప్పిన పెట్టుబడులలో మార్పులు చేర్పులు ఏమైనా చేయాలో కోంచెం తెలపగలరు. మీ సమాధానం మాకు ఇప్పుడున్న స్థితిలో ఎంత గానో ఉపయోగపడుతుంది. నా వయస్సు 29.

Asked by గాదె. వెంకట శివ on

దీర్ఘకాల లక్ష్యాలను గుర్తించి వాటి కోసం మదుపు చేయడం చాలా మంచి ఆలోచన. ముందుగా మీ బీమా డైమండ్ గోల్డ్ పధకం గురించి తెలుసుకుందాం. ఇందులో బీమా హామీ తక్కువ, రాబడి తక్కువ(4-5 శాతం వార్షిక రాబడి), పైగా ప్రీమియం ఎక్కువ. దీని బదులు మంచి పథకాల్లో మదుపు చేసే మంచి రాబడి పొందే అవకాశం కోల్పోతారు. కాబట్టి, కొంత నష్ట పోయినా మీరు ఈ పధకాన్ని వీలైనంత త్వరగా సరెండర్ చేయండి లేదా ఆపివేయండి. మీరు ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.

మీరు అధిక ఫండ్ లలో పెట్టుబడి చేస్తున్నారు. పైగా, రుణం తీసుకుని మదుపు చేయడం సరైన పధ్ధతి కాదు. మీరు ఐసీసీ పృ నిఫ్టీ ౫౦ ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి.
కాస్త రిస్క్ తక్కువ, దీర్ఘకాలం కోసం బాగుంటుంది. ఇతర ఫండ్లలో పెట్టుబడిని దీనికి బదిలీ చేసుకోవచ్చు. అత్యవసర నిధి కోసం ఒక లిక్విడ్ ఫండ్ లో కొనసాగవచ్చు.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

నిక‌ర ఆదాయ విలువ అంటే ఏంటి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%