నిపుణులు ఇచ్చిన సమాధానాలు

హ‌లో స‌ర్‌, నా వ‌య‌సు 26 సంవ‌త్స‌రాలు. నాకు ఇంకా పెళ్లి కాలేదు. నా వార్షికాదాయం రూ.12 ల‌క్ష‌లు. నేను పొదుపు, ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం పోర్ట్‌ఫోలియో ఎలా సిద్ధం చేసుకోవాలి తెలుప‌గ‌ల‌రు.

Asked by Hareesh on

చిన్న వ‌య‌సులోనే మీరు భ‌విష్య‌త్తు గురించి ఆలోచించి పెట్టుబ‌డులు చేయాల‌నుకోవ‌డం మంచి నిర్ణ‌యం. మీ స్వ‌ల్ప‌, మ‌ధ్య‌, దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాలు ఏంటో మొద‌ట నిర్ణ‌యించుకోవాలి. అంటే పెళ్లి, పిల్ల‌లు, వారి ఉన్న‌త చ‌దువులు, ఇళ్లు కొనుగోలు చేయ‌డం, కారు, ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం ఆదాయం, ప‌ర్య‌ట‌న‌లు వంటివి.
పెట్టుబ‌డులు చేసేందుకు చాలా ప‌థ‌కాలు అందుబాటులో ఉన్నాయి. ఈపీఎఫ్ లేదా వీపీఎఫ్‌, పీపీఎఫ్, ఎన్‌పీఎస్, ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్లు వంటి వాటిలో పెట్టుబ‌డులు పెట్టవ‌చ్చు. దీంతో పాటు ట‌ర్మ్ బీమా, ఆరోగ్య బీమా తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి.

ఈపీఎఫ్ /వీపీఎఫ్‌
ప‌ద‌వీ విర‌మణ త‌ర్వాత అవ‌స‌ర‌మ్యే ఆదాయం కోసం ఇందులో పొదుపు చేయ‌వ‌చ్చు. వ‌డ్డీ రేట్ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యిస్తుంది. ప్ర‌స్తుత వ‌డ్డీ రేట్లు వార్షికంగా 8.65 శాతంగా ఉన్నాయి.

పీపీఎఫ్‌
ప్ర‌స్తుతం వార్షిక‌ వ‌డ్డీ రేట్లు 7.90 శాతం. ఏడ‌వ ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ‌కు అవ‌కాశం ఉంటుంది. డిపాజిట్లు, వ‌డ్డీ, విత్‌డ్రాపై ప‌న్ను ఉప‌సంహ‌ర‌ణ ల‌భిస్తుంది. మ‌ధ్య‌, దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాలనే చేరుకునేందుకు పీపీఎఫ్‌లో పెట్టుబ‌డులు చేయ‌వ‌చ్చు.

ఎన్‌పీఎస్- జాతీయ పింఛ‌ను ప‌థ‌కం ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత జీవితానికి అవ‌స‌ర‌మైన నిధిని స‌మ‌కూర్చుకునేందుకు ఇది స‌రైన ఆప్ష‌న్. మంచి లాభాల‌ను పొందేందుకు ఈక్విటీల‌కు ఎక్కువ కేటాయించ‌డం మంచిది.

పై ప‌థ‌కాల‌పై రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు సెక్ష‌న్ 80సీ కింద ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. ఎన్‌పీఎస్‌లో అద‌నంగా రూ.50 వేల వ‌ర‌కు 80CCD(1b) తో ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్లలో ప‌దేళ్లు అంత‌కంటే ఎక్కువ‌కాలం పెట్టుబ‌డులు చేస్తే మంచి రాబ‌డిని పొంద‌వ‌చ్చు. ఈక్విటీ మార్కెట్లు స్వ‌ల్ప‌కాలంలో ఒడుదొడుకుల‌కు లోనైన‌ప్ప‌టికీ, దీర్ఘ‌కాలంలో ఎక్కువ లాభాల‌ను ఇస్తాయి.

ట‌ర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌
త‌క్కువ ప్రీమియంతో ఎక్కువ హామీ పొంద‌వ‌చ్చు. ప్రీమియంపై సెక్ష‌న్ 80సీ కింద ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది.

ఆరోగ్య బీమా
సెక్ష‌న్ 80 డీ కింద ఆరోగ్య బీమా ప్రీమియంపై ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది.

ఆర్థిక ప్ర‌ణాళిక గురించి మ‌రిన్ని విష‌యాలు తెలుసుకునేందుకు www.eenadusiri.net చ‌ద‌వండి.
పెట్టుబడులు చేసేముందు పెట్టుబ‌డుల కాల‌ ప‌రిమితి, రాబ‌డి, లాక్‌-ఇన్ పీరియ‌డ్, భ‌ద్ర‌త‌, లిక్విడిటీ, ప‌న్ను వ‌ర్తింపుల గురించి తెలియాలి. దీనికోసం ఆర్థిక స‌ల‌హాదారుడి నుంచి స‌ల‌హాలు తీసుకోవచ్చు.
స‌ర్టిఫైడ్ ఫైనాన్షియ‌ర్ ప్లాన‌ర్ సీఎమ్ గురించి తెలుసుకునేందుకు ఈ కింద క్లిక్ చేయండి
https://india.fpsb.org/cfp-certificants-directory/?
search_by=&search=&city=&state=&employment=

మీరు హైద‌రాబాద్‌లో ఉన్న‌ట్ల‌యితే క‌రీమ్ ల‌ఖానీని గానీ, గార్డియ‌న్ క్యాపిట‌ల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజ‌ర్స్ లేదా అర్థ‌యంత్ర‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

పోస్టాఫీసు పొదుపు ఖాతా ప్రారంభించేందుకు క‌నీస వ‌య‌సెంత‌?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%