నిపుణులు ఇచ్చిన సమాధానాలు

హాయ్ సిరి, నా పేరు చందు కుమార్. వయసు 26, నెలసరి జీతం రూ. 25 వేలు, మిగులు రూ. 6 వేలు, ఇంటి రుణం ఈఎంఐ రూ. 12 వేలు. మ్యూచువల్ ఫండ్లు, ఎల్ఐసి ప్రీమియం లో ఏది మంచిది?

Asked by Chandu Kumar on

బీమా కంపెనీల పాలసీల నుంచి దూరంగా ఉండండి. ఇందులో పెట్టుబడి, బీమా కలిపి ఉంటాయి. అయితే, బీమా హామీ తక్కువ, రాబడి తక్కువ, పైగా ప్రీమియం ఎక్కువ. దీని బదులు జీవిత బీమా కోసం ఒక టర్మ్ ప్లాన్ తీసుకోండి. పాలసీ బజార్, కవర్ ఫాక్స్ లాంటి వెబ్సైటులలో ఐసీఐసీఐ, మాక్స్ లైఫ్ లాంటి వాటి టర్మ్ ప్లాన్ తక్కువ ప్రీమియం తో తీసుకోవచ్చు. మీ వార్షిక ఆదాయానికి 10-12 రేట్లు బీమా హామీ తీసుకోండి.

పెట్టుబడులకు మీ లక్ష్యం, రిస్క్ ఆధారంగా పధకం ఎంచుకోవచ్చు. దీర్ఘకాలం కోసం ఒక ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ మంచిది. కనీసం 10 ఏళ్ళ పాటు నెల నెలా యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ లో సిప్ చేయండి. పేటీఎం, కువేరా లాంటి వాటిలో డైరెక్ట్ ప్లాన్ ఎంచుకోవచ్చు. రిస్క్ లేని పధకం కావాలంటే పీపీఎఫ్ మేలు.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

ప్ర‌భుత్వం జారీ చేసే డేటెడ్ సెక్యురిటీల్లో ప్ర‌త్యేకంగా పెట్టుబ‌డి చేసే ఫండ్లు ఏవి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%