నిపుణులు ఇచ్చిన సమాధానాలు

నేను కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లో చేరాను. నా వయసు 27 ఏళ్ళు. నాకు ఆదాయపు పన్ను మరియు పెట్టుబడులకు సంబంధించిన సలహా ఇవ్వండి.

Asked by సి హెచ్ సురేష్ on

కొత్తగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందినందుకు అభినందనలు. చిన్న వయసు నుంచే సరైన మదుపు చేయడం ద్వారా పన్ను ఆదాతోపాటు, దీర్ఘకాలంలో మంచి సంపదను చేకూర్చుకోవచ్చు. మీకు ఎన్ పీ ఎస్ తప్పనిసరి కాబట్టి, ఇందులో మీ వాటాను పెంచండి . అలాగే, ఎక్కువ శాతం ఈక్విటీని ఎంచుకోండి.

మ్యూచువల్ ఫండ్లలో అనేక రకాలు ఉంటాయి. ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మదుపు మొదలు పెడితే కొంత అలవాటు అవుతుంది. ఇండెక్స్ ఫండ్లు ఒక ఇండెక్స్ ని అనుసరించి పెట్టుబడులు పెడతాయి కాబట్టి ఇండెక్స్ ఫండ్లలో ఇతర ఫండ్ల కంటే రిస్క్ తక్కువగా ఉంటుంది. దీని కోసం మీరు యు టి ఐ నిఫ్టీ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ లో మదుపు చేయండి. దీనిలో వ్యయ నిష్పత్తి తక్కువగా ఉంటుంది కాబట్టి, దీర్ఘకాలం అంటే పది సంవత్సరాలు చేస్తే మంచి రాబడి పొందవచ్చు.

ప్రతి సంవత్సరం మదుపు మొత్తాన్ని పెంచండి. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగ్యులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది. కనీసం 10 ఏళ్ళ పాటు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయండి.

పన్ను ప్రణాళిక గురించి ఈ కింది కధనంలో తెలుసుకోవచ్చు:
http://eenadusiri.net/Tax-planning-portfolio-GFbW9lI

సిరి లో ఇంకా

మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

కంపెనీల షేర్ల‌ను మొద‌టి సారి ఎక్క‌డ జారీ చేస్తారు?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%