నిపుణులు ఇచ్చిన సమాధానాలు

నా పేరు ఆంజనేయులు, 33 ఏళ్ళు, భార్య గృహిణి, నా నెల జీతం రూ 1,20,000. ఖర్చులు రూ. 60 వేలు. రుణాలు రూ 2 లక్షలు. ఎటువంటి ఆర్ధిక ప్రణాళిక వేసుకోవాలి?

Asked by Anjaneyulu on

ముందుగా మీరు ఒక టర్మ్ జీవిత బీమా పాలసీ తీసుకోండి . టర్మ్ పాలసీ ని వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి.

మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. బీమా, పెట్టుబడి కలిపి ఉన్న పధకాల (ఎండోమెంట్, మనీ బ్యాక్, యూలిప్స్ లాంటివి) నుంచి వీలైనంత దూరంగా ఉండడం మంచిది. వీటిలో బీమా హామీ తక్కువ, రాబడి తక్కువ, ప్రీమియం ఎక్కువ .

ఆర్ధిక లక్ష్యాలైన ఇల్లు కొనుగోలు, భవిష్యత్ లో పిల్లల చదువులు, విహార యాత్రలు, పదవీవిరమణ అనంతర జీవితానికి సరిపడా నిధిని సమకూర్చుకోవడం వంటివి. స్వల్ప కాలిక లక్ష్యాల కోసం రికరింగ్ డిపాజిట్ ఖాతా, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పీ పీ ఎఫ్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయొచ్చు.

పదవీవిరమణ నిధి కోసం ఎన్పీఎస్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లలోమదుపు చేయొచ్చు. చిన్న వయసు నుంచే ఖర్చులను నియంత్రణలో ఉంచుకుని, మదుపు చేయడం వలన దీర్ఘకాలంలో చక్రవడ్డీ ప్రభావంతో మంచి రాబడి పొందొచ్చు.

మ్యూచువల్ ఫండ్లలో అనేక రకాలు ఉంటాయి. ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మదుపు మొదలు పెడితే కొంత అలవాటు అవుతుంది. ఇండెక్స్ ఫండ్లు ఒక ఇండెక్స్ ని అనుసరించి పెట్టుబడులు పెడతాయి కాబట్టి ఇండెక్స్ ఫండ్లలో ఇతర ఫండ్ల కంటే రిస్క్ తక్కువగా ఉంటుంది. దీని కోసం మీరు యు టి ఐ నిఫ్టీ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ లో మదుపు చేయండి. దీనిలో వ్యయ నిష్పత్తి తక్కువగా ఉంటుంది కాబట్టి, దీర్ఘకాలం అంటే పది సంవత్సరాలు చేస్తే మంచి రాబడి పొందవచ్చు. ప్రతి సంవత్సరం మదుపు మొత్తాన్ని పెంచండి.

నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగ్యులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది. కనీసం 10 ఏళ్ళ పాటు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయండి.

అధిక ఆదాయం ఉన్నవారు ఒక సర్టిఫైడ్ ఫైనాన్సియల్ ప్లానర్ ను సంప్రదించినట్లైతే , దీర్ఘకాలంలో మరింత లాభపడే అవకాశాలు ఉంటాయి. సర్టిఫైడ్ ఫైనాన్సియల్ ప్లానర్ కోసం ఈ కింది లింకు ద్వారా తెలుసుకొనండి :
https://india.fpsb.org/cfp-certificants-directory/?search_by=&search=&city=&state=&employment=

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

రుణ చ‌రిత్ర నివేదిక‌(సీఐఆర్‌) అనేది వ్య‌క్తి రుణ చ‌రిత్ర‌పై ఇచ్చే నివేదిక‌. ఇందులో ఉండే అంశాలు:

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%