నిపుణులు ఇచ్చిన సమాధానాలు

నా పేరు రాజేష్, వయసు 35. నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని, వార్షిక ఆదాయం రూ. 26 లక్షలు. నేను ఎల్ఐసి లో రూ. 1 కోటి బీమా హామీ తో పాలసీ తీసుకున్నాను, ప్రీమియం రూ. 36,500. ఇతర కంపెనీలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. టర్మ్ పాలసీ కోసం మంచి కంపెనీలు సూచించండి. అలాగే, పిల్లల విద్య కోసం ఏదైనా మంచి పాలసీలు చెప్పండి.

Asked by Rajesh on

మీరు చెప్పినట్టుగా ఎల్ఐసి టర్మ్ పాలసీ ప్రీమియం ఇతర పాలసీల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు తీసుకున్న పాలసీ బీమా హామీ సరిపోకపోవచ్చు. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి, వీటి ప్రీమియం ఎల్ఐసి కంటే కాస్త తక్కువ ఉంటుంది, క్లెయిమ్ సెటిల్మెంట్ బాగుంటుంది. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.

పిల్లల చదువు లేదా ఇతర లక్ష్యాల కోసం ఎండోమెంట్, మనీ బ్యాక్, హోల్ లైఫ్ లాంటి పాలసీలను ఏజెంట్లు సూచిస్తుంటారు. వీటి నుంచి దూరంగా ఉండడం మంచిది. వీటిలో బీమా హామీ తక్కువ, రాబడి తక్కువ, పైగా ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. వార్షిక రాబడి 4-5 శాతం వరకు ఉండొచ్చు. దీర్ఘకాలం లో ఆర్ధిక లక్ష్యాలను చేరుకోవడానికి ఇవి సరైనవి కావు. మీరు పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్లలో కొంత మొత్తాన్ని ప్రతి నెలా మదుపు చేయండి. కనీసం 10 ఏళ్ళు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయడం మంచిది. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

కింది వాటిలో త‌క్కువ కాల‌వ్య‌వ‌ధిలో పెట్టుబ‌డి చేసేందుకు వీలున్న‌వి ఏవి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%