నిపుణులు ఇచ్చిన సమాధానాలు

నా వ‌య‌సు 36 సంవ‌త్స‌రాలు. మంచి ప‌ద‌వీవిర‌మ‌ణ ప‌థ‌కాన్ని సూచించండి?

Asked by Rama Krishna on

భార‌త‌దేశంలో కొన్ని ప‌ద‌వీవిర‌మ‌ణ ప‌థ‌కాలు మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయి. ఈ కింది దీర్ఘ‌కాలిక ప‌థ‌కాల‌లో పెట్టుబ‌డులు ప్రారంభించ‌వ‌చ్చు.

  1. పీపీఎఫ్‌ : ప‌న్ను ప్ర‌యోజ‌నాల కోసం ఒక మంచి ఎంపిక‌. ఆదాయ‌పు పన్ను చ‌ట్టం 80సీ కింద వార్షికంగా రూ. 1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. వ‌డ్డీ ఆదాయం, విత్‌డ్రాల‌పై మిన‌హాయింపు ఉంటుంది. ప్ర‌స్తుత వ‌డ్డీ రేటు వార్షికంగా 8 శాతం ఉంది.
  2. ఈపీఎఫ్‌ : ఇందులో కూడా ఆదాయ‌పు పన్ను చ‌ట్టం 80సీ కింద వార్షికంగా రూ. 1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. నెల‌వారి ఈపీఎఫ్ చెల్లింపుల వాటాను పెంచుతూ ఉండాలి. వ‌డ్డీ వార్షికంగా 8.55 శాతంగా ఉంది.
  3. ఎన్‌పీఎస్‌ : ఇందులో కూడా ఆదాయ‌పు పన్ను చ‌ట్టం 80సీ కింద వార్షికంగా రూ. 1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. సెక్ష‌న్ 80సీసీడీ(1బీ) కింద వార్షికంగా రూ.50 వేల పెట్టుబ‌డుల‌పై అద‌న‌పు మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈక్వీటీ చెల్లింపుల వాటాల‌ను పెంచ‌డం ద్వారా దీర్ఘ‌కాలంలో అధిక మొత్తాన్ని పొంద‌వ‌చ్చు. విత్‌డ్రాల‌ను 58 సంవ‌త్స‌రాల వ‌య‌సు త‌రువాత అనుమ‌తించ‌డం ఇందులో ఉన్న ఒక మంచి విష‌యం.

ఈపీఎఫ్‌, పీపీఎఫ్‌ల వ‌డ్డీ రేటు దాదాపు 8 శాతం ఉంటుంది. కాన్ని ఈ రెండింటిలో సుల‌భంగా విత్‌డ్రా చేసుకొనే అవ‌కాశం ఉంది. అధిక నిధిని ఏర్పాటు చేసుకోవ‌డం ఇది ఆటంకంగా మారొచ్చు.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Team siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

షేర్ మార్కెట్లో ప‌రోక్షంగా పెట్టుబ‌డి పెట్టేందుకు మ‌దుప‌ర్ల‌కు స‌హ‌క‌రించేవి ఏవి?

మీరేమంటారు?

బ్లాక్ చైన్ సాంకేతిక‌త వినియోగంతో ఆర్థిక కార్య‌క‌లాపాల్లో గుణాత్మ‌క‌మైన‌ మార్పులు తీసుకురావొచ్చ‌ని మీరు భావిస్తున్నారా?

80%
10%
10%