నిపుణులు ఇచ్చిన సమాధానాలు

నా వయసు 37 సంవ‌త్స‌రాలు, నా నెల జీతం రూ.50 వేలు. మాకు 6 సంవత్స‌రాల వ‌య‌సు గ‌ల పాప ఉంది. నేను గృహ‌రుణం తీసుకున్నాను. దాని కోసం నెల నెలా రూ.10 వేలు ఈఎమ్ఐలు చెల్లిస్తున్నాను. ఇంకా నాపేరు మీద బీమా కోసం ఏడాదికి రూ.15 వేలు చెల్లిస్తున్నాను. పాప కోసం సుక‌న్య స‌మృద్ధి యోజ‌న క్రింద ఏడాదికి రూ.25 వేలు క‌డుతున్నాను. ప్ర‌తీ నెలా నా కుటుంబ అవసరాలకు పోను, మిగతా డ‌బ్బు ని దీర్ఘకాలిక అవసరాల కోసం నా ఆదాయాన్ని వృద్ధి చేసుకోవాల‌నుకుంటున్నాను. దీని కోసం నేను నెలకు రూ.20 వేల వ‌ర‌కు వెచ్చించ‌గ‌ల‌ను. నాకు రానున్న 10 సంవ‌త్స‌రాల‌లో రూ.50 ల‌క్ష‌ల మొత్తం కావాలి. ఈ నిధిని సాధించేందుకు నేను ఏ ఏ ప‌థ‌కాల‌లో పెట్టుబ‌డి పెట్టాలో స‌ల‌హాలివ్వ‌గ‌ల‌రు.

Asked by బాలాజీ on

పై వివ‌రాల‌ను ప‌రిశీలిస్తే మీరు ఎండోమెంట్ పాల‌సీ తీసుకున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. ఈ పాల‌సీల‌లో ప్రీమియం అధికంగా ఉండి, హామీ మొత్తం(స‌మ్ అష్యూర్డ్‌) త‌క్కువ‌గా ఉంటుంది. అదే ట‌ర్మ్ పాల‌సీల‌లో త‌క్కువ ప్రీమియానికే అధిక హామీ మొత్తం ఉంటుంది. కాబ‌ట్టి మీ వార్షికాదాయానికి 10 రెట్లు ఎక్కువ మొత్తానికి, 60 ఏళ్ల నుంచి ప్ర‌స్తుత మీ వ‌య‌సు తీసివేయ‌గా వ‌చ్చే కాల‌వ్య‌వ‌ధికి ట‌ర్మ్ పాల‌సీ తీసుకంటే మంచిది. వీటికి అవ‌స‌ర‌మైన‌ రైడ‌ర్ల‌ను జోడించండి.

సుక‌న్య స‌మృద్ధి యోజ‌నలో మీరు ఏటా రూ.25 వేలు క‌డుతున్నారు గ‌నుక దీని ద్వారా వ‌చ్చే 10 ఏళ్ల‌లో మీకు రూ.3.64 ల‌క్ష‌ల నిధి స‌మ‌కూరుతుంది. ప‌థ‌కం ప్రారంభ సంవత్స‌రాల‌లోనే మీరు దీంట్లో అధికంగా పెట్టుబ‌డులు పెడితే చ‌క్ర‌వ‌డ్డీ ప్రభావంతో మీకు ఎక్కువ మొత్తం ల‌భించే అవ‌కాశం ఉంది.

రూ.50 ల‌క్ష‌ల మొత్తంలో పై ప‌థ‌కంలో వ‌చ్చే నిధి కాకుండా ఇంకా మీకు 46.36 లక్ష‌లు అవ‌స‌ర‌మ‌వుతాయి. 10 ఏళ్ల‌లో దీనిని సాధించాలంటే 8 శాతం మేర రాబడులతో మీరు ప్ర‌తీ నెలా రూ.25,340 ల‌ను పెట్టుబ‌డిగా పెట్టాలి. అలాగే 12 శాతం రాబ‌డులు రావాలంటే రూ.20153, 15 శాతం మేర రాబ‌డులు రావాలంటే రూ.16,845 చొప్పున ప్ర‌తీ నెలా పెట్టుబ‌డి పెట్టాల్సి ఉంటుంది.

ఈ పెట్టుబ‌డుల‌ను మీరు మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో లార్జ్‌క్యాప్‌, బ్యాలెన్స్‌డ్ ఫండ్ల‌లో చెరో రెండు ప‌థ‌కాల‌లో పెడితే మంచిది. ఏటా మీ ఆదాయంలో పెరుగుద‌ల మేర‌కు మీ పెట్టుబ‌డుల‌ను కూడా పెంచండి. గుర్తుంచుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యం ఏమిటంటే ఈక్విటీ మార్కెట్లు స్వ‌ల్ప కాలంలో ఒడుదొడుకుల‌కు గుర‌యిన‌ప్ప‌టికీ, 5 ఏళ్లు లేదా అంత‌కంటే ఎక్కువ కాలంలో స్థిర‌మైన రాబ‌డులనే అందిస్తాయి.

దీని కోసం ఈ క్రింద వివ‌రించిన ప‌థ‌కాల‌ను ప‌రిశీలించండి.

Table 3.jpg
Team Siri
Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

కింది వాటిలో పెట్టుబ‌డి వృద్ధికి ఎక్కువ‌గా ఆస్కారం ఉండే మ్యూచువ‌ల్ ఫండ్లు ఏవి?

మీరేమంటారు?

బ్లాక్ చైన్ సాంకేతిక‌త వినియోగంతో ఆర్థిక కార్య‌క‌లాపాల్లో గుణాత్మ‌క‌మైన‌ మార్పులు తీసుకురావొచ్చ‌ని మీరు భావిస్తున్నారా?

80%
10%
10%