నిపుణులు ఇచ్చిన సమాధానాలు

కొత్త ఎల్ఐసి పాలసీలలో అధిక బోనస్ రేట్లు ఉన్నవి సూచించండి. నా వయసు 40, వార్షిక ప్రీమియం రూ. 10 వేల వరకు చెల్లించగలను.

Asked by srinviasa rao pusarla on

మీరు పేర్కొన్న పాలసీల లో బీమా, రాబడి కలిపి ఉంటాయి. వీటిలో సగటు రాబడి 4-5 శాతం వరకు ఉంటుంది. కాబట్టి, బీమా హామీ మొత్తం తక్కువ, రాబడి కూడా తక్కువే. ఇలాంటి పాలసీల నుంచి దూరంగా ఉండడం మంచిది.

జీవిత బీమా కోసం ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మరో 20 ఏళ్ళ పాటు పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.

పెట్టుబడి కోసం పీపీఎఫ్, ఎన్పీఎస్, మ్యూచువల్ ఫండ్స్ లాంటి పథకాల్లో మీ వీలు, రిస్క్ సామర్ధ్యాన్ని బట్టి ఎంచుకోవచ్చు.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

పోస్టాఫీసు పొదుపు ఖాతా ప్రారంభించేందుకు క‌నీస వ‌య‌సెంత‌?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%