నిపుణులు ఇచ్చిన సమాధానాలు

సార్ నేను రూ.5 ల‌క్ష‌ల మొత్తాన్ని పెట్టుబ‌డిగా పెట్టి, 15 ఏళ్ల వ‌ర‌కు కొన‌సాగించాల‌నుకుంటున్నాను. నాకు నెలా నెలా రూ.4 నుంచి 5 వేల హామీ మొత్తం(స‌మ్ అష్యూర్డ్‌) అందించే మ్యూచువల్ ఫండ్ ప‌థ‌కాల‌కు ఏవైనా ఉన్నాయా?

Asked by M S NAWAZ on

స్వ‌ల్ప‌కాలానికి ఈక్విటీ మార్కెట్ల‌లో ఒడుదొడుకులుంటాయి, 5 ఏళ్లు లేదా అంత‌కంటే ఎక్కువ కాలానికి స్థిరంగా రాబ‌డులు వ‌స్తాయి, కాని ఎంత శాతం మేర‌కు రాబ‌డులు వ‌స్తాయ‌నేది చెప్ప‌లేం. మీరు 15 ఏళ్ల వ‌ర‌కు పెట్టుబ‌డులు పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు, కాబ‌ట్టి లార్జ్‌క్యాప్‌, బ్యాలెన్స్‌డ్ ఫండ్ల‌లో నుంచి చెరొక ప‌థ‌కాన్ని ఎంచుకోండి. వీటిలో మీరు ప్ర‌తీ నెలా రూ.50 వేల చొప్పున ఐదు నెల‌ల పాటు పెట్టుబ‌డి పెట్టండి. మార్కెట్ ఒడుదొడుకుల‌ను ఎదుర్కోవ‌డానికి ఇది మీకు ఉప‌క‌రిస్తుంది.

పెట్టుబ‌డి పెట్టిన త‌ర్వాత మీరు నెలా నెలా ఆదాయాన్ని ఆశిస్తున్నారు, కాబ‌ట్టి సిస్టమాటిక్ విత్‌డ్రాయ‌ల్ ప‌థ‌కాన్ని ఎంచుకోండి. దీంతో స‌మాంత‌రంగా మీ పెట్టుబ‌డులు వృద్ధి చెందుతాయి.

ఉదాహ‌ర‌ణ‌కు 15 ఏళ్ల కాలానికి మీరు రూ.5 ల‌క్ష‌ల‌ను పెట్టుబ‌డిగా(చివ‌ర‌లో మ‌ళ్లీ రూ.5 ల‌క్ష‌ల మూల‌ధ‌నం తిరిగి రావాల‌నుకుంటే) పెట్టార‌నుకుందాం. ఈ పెట్టుబ‌డుల‌పై మీకు ఏటా 12 శాతం రాబ‌డులు వ‌స్తే, మీరు 15 ఏళ్ల పాటు నెల నెలా రూ.5 వేలు చొప్పున పొంద‌వ‌చ్చు. సిస్టమాటిక్ విత్‌డ్రాయ‌ల్ పథ‌కాల‌లో రాబ‌డుల ఆధారంగా ఈ క్రింది ప‌ట్టిక‌లో వివ‌రాలిస్తున్నాం. ప‌రిశీలించ‌గ‌ల‌రు.

Table 2.jpg

దీంతోపాటు ఈ క్రింద వివ‌రించిన లార్జ్‌క్యాప్‌, బ్యాలెన్స్‌డ్ ఫండ్ల‌లో నుంచి చెరొక ప‌థ‌కాన్ని ఎంచుకోండి.

Table 3.jpg
Team Siri
Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

డివిడెంట్ అంటే ఏంటి?

మీరేమంటారు?

బ్లాక్ చైన్ సాంకేతిక‌త వినియోగంతో ఆర్థిక కార్య‌క‌లాపాల్లో గుణాత్మ‌క‌మైన‌ మార్పులు తీసుకురావొచ్చ‌ని మీరు భావిస్తున్నారా?

80%
10%
10%