నిపుణులు ఇచ్చిన సమాధానాలు

హాయ్ సిరి, నేను ఎల్ఐసీ జీవ‌న్ ఆనంద్‌ పాలసీ తీసుకున్నాను. బీమా హామీ రూ 5 లక్షలు. వార్షిక ప్రీమియం రూ 28 వేలు . మెచ్యూరిటీ 2040 సం . ఈ పాలసీ ఏమైనా ఉపయోగం ఉంటుందా ?

Asked by A LAXMINARAYANA REDDY on

బీమా, పెట్టుబడి కలిపి ఉన్న పధకాల (ఎండోమెంట్, హోల్ లైఫ్ , మనీ బ్యాక్, యూలిప్స్ లాంటివి) నుంచి వీలైనంత దూరంగా ఉండడం మంచిది.
వీటిలో బీమా హామీ తక్కువ, రాబడి తక్కువ, ప్రీమియం ఎక్కువ .

ముందుగా మీరు ఒక టర్మ్ జీవిత బీమా పాలసీ తీసుకోండి . టర్మ్ పాలసీ ని వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి.
మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.

మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పీపీఎఫ్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మంచివి. అలాగే పదవీవిరమణ కోసం ఎన్పీఎస్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మంచివి.

సిరి లో ఇంకా

మీకు కావలసిన అంశంపై వివరాలతో కూడిన కధనాల కోసం " శోధన" చేయండి.
మదుపర్ల ప్రశ్నలకు సిరి జవాబులు , వడ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేటర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థమయ్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల పనితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివరాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్టర్

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

కింది వాటిలో స్టాక్ మార్కెట్ సూచీల‌ను ఆధారంగా పెట్టుబ‌డి పెట్టే ఫండ్లు ఏవి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%