నిపుణులు ఇచ్చిన సమాధానాలు

సర్, నేనొక పీఎస్బీ ఉద్యోగిని. నా జీతం రూ. 5 లక్షలు. lic money-back పాలసీ ఉంది, Ppf కడుతున్నాను నెలకు రూ. 2000, ఎస్బీఐ బ్లూచిప్ లో రూ. 2000 కడుతున్నాను. ఇంటి రుణం ఉంది రూ. 40 లక్షలు. నా 3 ఏళ్ళ పాప కోసం ఎస్బీఐ స్కాలర్ లో ఏడాదికి రూ. 50 వేలు కడుతున్నాను, సుకన్య సమృద్ధి లో నెలకు రూ. 500 కడుతున్నాను. ప్రీమియం వెనక్కి వచ్చే టర్మ్ పాలసీ తీసుకోవచ్చా?

Asked by K sreeranganath on

ముందుగా మీరు ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. ప్రీమియం వెనక్కి ఇచ్చే పాలసీ లో ప్రీమియం కాస్త అధికంగా ఉంటుంది. వీటి వాదులు సాధారణ టర్మ్ పాలసీ తీసుకోండి.

బీమా, రాబడి కలిపి ఉండే పాలసీ ల నుంచి దూరంగా ఉండండి. వీటిలో బీమా హామీ తక్కువ, రాబడి తక్కువ, పైగా ప్రీమియం ఎక్కువ. ఎస్బీఐ స్కాలర్, ఎల్ఐసి పాలసీ లు సరెండర్ చేయడం మేలు. కాస్త నష్టం వచ్చినా మంచి పథకాల్లో పెట్టుబడి పెట్టడం మంచిది. సుకన్య సమృద్ధి యోజన లో పెట్టుబడి పెంచండి. ఎస్బీఐ బ్లూచిప్ ఫండ్ బదులు యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎంచుకోవచ్చు.

Team Siri

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు తెలుసా !

ఈ కింది అంశాల్లో బుల్ మార్కెట్ ప‌రిస్థితిని సూచించేంది?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%